డస్టర్ తరహా సక్సెస్ లక్ష్యంతో కప్తుర్: విడుదలకు సన్నద్దం

రెనో ఇండియా తమ కప్తుర్ ఎస్‌యూవీని వచ్చే పండుగ సీజన్ నాటికి విడుదల చేయడానికి సిద్దం అవుతోంది.

By Anil

ఫ్రెంచ్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియన్ మార్కెట్లోకి కప్తుర్ ఎస్‌యూవీ విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే అనేక మార్లు రోడ్డు టెస్టింగ్‌కు వచ్చిన కప్తుర్ తాజాగా మరోసారి రహస్యంగా పరీక్షించబడుతూ మీడియా కంటపడింది. రెనో కప్తుర్ గురించి పూర్తి వివరాలు....

రెనో కప్తుర్ టెస్టింగ్

కప్తుర్ ఎస్‌యూవీని గుర్తించడానికి ఏ మాత్రం వీల్లేకుండా నలుపు మరియు తెలుపు స్టిక్కరింగ్‌తో బాడీ మొత్తాన్ని కవర్ చేసి పరీక్షించారు. ఫ్రంట్ డిజైర్‌‌లోని పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, మరియు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ గుర్తించడం జరిగింది.

రెనో కప్తుర్ టెస్టింగ్

ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న కప్తుర్ ఎస్‌యూవీనే పోలి ఉంది ఈ ఇండియన్ మోడల్ కప్తుర్. అదే విధంగా డస్టర్ ఎస్‌యూవీని నిర్మిస్తున్న ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా కప్తుర్ అభివృద్ది చేశారు. కాబట్టి దేశీయంగా ఉన్న ప్రొడక్షన్ ప్లాంటులో కప్తుర్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేయడం చాలా సులభతరం కానుంది.

రెనో కప్తుర్ టెస్టింగ్

ఇండియన్ మోడల్ కప్తుర్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ ఆప్షన్‌లు రానున్నాయి. పెట్రోల్ వేరియంట్ 105బిహెచ్‌పి పవర్ మరియు డీజల్ ఇంజన్ రెండు రకాల పవర్ (84 మరియు 108బిహెచ్‌పి పవర్) ఉత్పత్తి చేయును.

రెనో కప్తుర్ టెస్టింగ్

ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభమయ్యే నాటికి రెనో కప్తుర్ విక్రయాలకు సిద్దంగా విపణిలోకి విడుదల కానుంది. కప్తుర్ రూ. 10 లక్షల ఎక్స్-రూమ్ ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయంగా ఎస్‌యూవీలకు డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోంది. కాబట్టి ధరకు విలువలతో, అత్యుత్తమ డిజైన్ మరియు ఫీచర్లతో విడుదలయ్యే వాహనాలకు ఫ్యూచర్ బాగానే ఉంటుంది. కప్తుర్ కూడా డస్టర్ తరహా విజయాన్ని రెనో కు అందివ్వనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 29, 2017, 11:52 [IST]
English summary
Read In Telugu: Renault Kaptur Spotted Testing
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+