మళ్లీ వస్తున్న సుజుకి జిమ్నీ

సెకండ్ జనరేషన్‌ జిమ్నీ ఎస్‌యూవీని ఆవిష్కరించడానికి సుజుకి సిద్దం అవుతోంది.

By Anil

జపాన్ వాహన తయరీ సంస్థ సుజుకి తమ మొదటి తరానికి చెందిన జిమ్నీ ఎస్‌యూవీని 1997 లో జరిగిన టోక్యో మోటార్ షో వేదిక మీద ప్రదర్శించబడింది. అయితే ఇప్పుడు, మరో సారి సెకండ్ జనరేషన్‌ జిమ్నీ ఎస్‌యూవీగా ఆవిష్కరించడానికి సిద్దం అవుతోంది.

సుజుకి జిమ్నీ

సుజుకి సెకండ్ జనరేషన్ జిమ్నీ ఎస్‌యూవీని 2017 టోక్యో మోటార్ షో వేదిక మీద రానున్న ఆక్టోబరులో ఆవిష్కరించనుంది. ప్రస్తుతం జిమ్నీకి చెందిన కొత్త ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి.

సుజుకి జిమ్నీ

అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న సుజుకి సమురాయ్, ప్రస్తుతం ఇండియాలో ఉన్న జిప్సీ స్థానాన్ని భర్తీ చేయనుంది. కొత్త తరానికి చెందిన జిమ్నీ ఎస్‌యూవీని బాడీ-ఆన్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్‌తో నిర్మిస్తోంది. అయితే మునుపటి జిమ్నీ పోలికలనే కలిగి ఉంది.

Recommended Video

Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
సుజుకి జిమ్నీ

లీక్ అయిన సరికొత్త జిమ్నీ ఫోటోలను పరిశీలిస్తే, ముందు వైపున పొడవాటి ఐదు స్లాట్లు ఉన్న ఫ్రంట్ గ్రిల్, చంకీ బంపర్,గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్, ప్లాస్టిక్ క్లాడింగ్, మరియు వీల్ ఆర్చెస్ ఉన్నాయి. జిమ్నీ బాడీ మొత్తం బాక్సీ స్టైల్లో ఉంది.

సుజుకి జిమ్నీ

జిమ్నీ ఎస్‌యూవీ మూడు మరియు ఐదు డోర్ల మోడళ్లలో ప్రదర్శనకు వచ్చే అవకాశం ఉంది. జిమ్నీ టాప్ ఎండ్ వేరియంట్లలో అల్లాయ్ వీల్స్ మరియు డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ రానుంది.

సుజుకి జిమ్నీ

సుజుకి జిమ్నీ ఇంటీరియర్ ఆధునికతను సంతరించుకుంది. ఇంటీరియర్‌లో టచ్ స్క్రీన్ డిస్ల్పే, త్వరలో విడుదల కానున్న స్విఫ్ట్‌లో ఉన్నటువంటి స్టీరింగ్ వీల్, మరియు ఎయిర్ వెంట్లు ఉన్నాయి. సుజుకి జిమ్నీ పెట్రోల్ శ్రేణి ఇంజన్ వేరియంట్లలో కూడా లభించే అవకాశం ఉంది.

సుజుకి జిమ్నీ

పెట్రోల్ ఇంజన్ పరంగా 660సీసీ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్, 1-లీటర్ బూస్టర్‌జెట్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను సుజుకి పరిశీలిస్తోంది. అయితే డీజల్ ఇంజన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుజుకి ఆల్‌‍గ్రిప్ ప్రొ సిస్టమ్ మరియు ఆల్‌గ్రిప్ 4-వీల్ డ్రైవ్ టెక్నాలజీతో రానుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Suzuki Jimny Debut Details Revealed
Story first published: Thursday, August 31, 2017, 10:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X