స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‍‌బ్యాక్ ఆవిష్కరించిన సుజుకి

Written By:

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం సుజుకి 2017 స్విఫ్ట్ స్పోర్ట్‌ను ఆవిష్కరించింది. అయితే, సుజుకి అధికారికంగా 2017 ఫ్రాంక్‌ ఫర్ట్ మోటార్ షో వేదిక మీద సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్‌ను ప్రజా సందర్శనకు సిద్దం చేస్తోంది.

స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‍‌బ్యాక్ ఆవిష్కరించిన సుజుకి

ఎక్ట్సీరియర్ పరంగా రెగ్యులర్ వెర్షన్ స్విఫ్ట్ మరియు స్విఫ్ట్ స్పోర్ట్ రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే, స్విఫ్ట్ స్పోర్ట్ ఫ్రంట్ డిజైన్‌లో చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. నల్లటి ప్లాస్టిక్ క్లాడింగ్ జోడింపుతో దప్పంగా ఉన్న బ్లాక్ కలర్ హనికాంబ్ ఫ్రంట్ గ్రిల్‌ను గుర్తించవచ్చు. సరికొత్త ఫ్రంట్ గ్రిల్‌కు అనుగుణంగా ఫ్రంట్ బంపర్‌లో కూడా మార్పులు జరిగాయి.

Recommended Video
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‍‌బ్యాక్ ఆవిష్కరించిన సుజుకి

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రదర్శన చేయనున్న విషయం మినహాయిస్తే, ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఇందులో 1.4-లీటర్ సామర్థ్యం గల టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది.

స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‍‌బ్యాక్ ఆవిష్కరించిన సుజుకి

2017 స్విఫ్ట్ స్పోర్ట్ 140బిహెచ్‌పి పవర్ మరియు 220ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అయితే మునుపటి స్విఫ్ట్ స్పోర్ట్ వెర్షన్‌లో 135బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ సామర్థ్యం గల పెట్రలో ఇంజన్‌తో లభించేది.

స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‍‌బ్యాక్ ఆవిష్కరించిన సుజుకి

ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి కార్లకు మంచి డింమాండ్ ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు స్విఫ్ట్ స్పోర్ట్‌ను దేశీయంగా అందుబాటులో ఉంచలేదు. అయితే, బాలెనో ఆర్ఎస్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో స్విఫ్ట్ స్పోర్ట్‌ ఈ సారి భారత్ విపణిలోకి విడుదల చేసే అవకాశం ఉంది.

స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‍‌బ్యాక్ ఆవిష్కరించిన సుజుకి

ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో

67 వ ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో మెస్సే ఫ్రాంక్‌ఫర్ట్‌లో సెప్టెంబర్ 12, 2017 నుండి జరగనుంది. తొలి రెండు రోజులు 12 మరియు 13 తేదీలలో మీడియా ప్రతినిధులకు మరియు 14 నుండి 24 వ తేదీ వరకు ప్రజల సందర్శన నిర్వహించినున్నారు. మరిన్ని తాజా ఆటోమొబైల్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు.... మీ నగరంలో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇక్కడ తెలుసుకోండి...

English summary
Read In Telugu: Suzuki Swift Sport Be Revealed Before Franksurt Show
Story first published: Thursday, July 27, 2017, 10:45 [IST]
Please Wait while comments are loading...

Latest Photos