అదిరిపోయే ఫీచర్లతో టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్: ధర మరియు ఇతర వివరాలు

Written By:

టాటా మోటార్స్ తమ లేటెస్ట్ బెస్ట్ ఎస్‌యూవీ హెక్సా ను డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్‌లో మార్కెట్లోకి లాంచ్ చేసింది. సరికొత్త టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్‌ ప్రారంభ వేరియంట్ ధర రూ. 12.18 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

అబ్సల్యూట్ మరియు ఇండల్జ్ అనే రెండు విభిన్న ప్యాకేజీల్లో ఎన్నో అధునాతన ఫీచర్లను జోడిస్తూ డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్‌ అనే ప్రత్యేక మోడల్‌ను పరిచయం చేసింది. సిటీ యంగ్ బయ్యర్లను టార్గెట్ చేస్తూ ఈ ప్రత్యేక ఎడిషన్ హెక్సాలో సిటీ లైఫ్ స్టైల్‌కు తగిన ఫీచర్లను అందించింది.

సాంకేతికంగా హెక్సా డౌన్‍‌టౌన్ అర్బన్ ఎడిషన్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. అయితే, ఇందులో మొత్తం 15 కొత్త ఫీచర్లను టాటా పరిచయం చేసింది. వీటి గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో చూద్దాం రండి...

Recommended Video - Watch Now!
[Telugu] Skoda kodiaq Launched In India - DriveSpark
టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

సరికొత్త కలర్ ఆప్షన్

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్ ఎస్‌యూవీ సరికొత్త అర్బన్ బ్రాంజ్ అనే కలర్ ఆప్షన్‌లో పరిచయమైంది. ప్రీమియ్ లుక్‌ను కల్పించే విధంగా మోడ్రన్ లైఫ్ స్టైల్‌కు చాలా దగ్గరగా ఉండటం ఈ కలర్ ప్రత్యేకత.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

డౌన్‌టౌన్ బ్యాడ్జింగ్

సాధారణ హెక్సా వెహికల్స్‌తో పోల్చుకుంటే ఈ ప్రత్యేక ఎడిషన్ విభిన్నంగా ఉండేందుకు డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్(Downtown Urban Edition) బ్యాడ్జితో వచ్చింది.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

క్రోమ్ మేళవింపులు

లగ్జరీ ఎక్ట్సీరియర్ ఫీల్ కలిగించేందుకు హెక్సా బాహ్య భాగంగో విసృతమైన క్రోమ్ సొబగులను అందివ్వడం జరిగింది. రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే క్రోమ్ ట్రీట్‌మెంట్ ఇందులోనే అధికంగా ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, మరిన్ని ప్రదాన భాగాల్లో క్రోమ్ సొబగులతో పాటు సైడ్ ప్లాస్టిక్ క్లాడింగ్ వంటివి అందివ్వడం జరిగింది.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

ప్రీమియమ్ సీట్ కవర్లు

హెక్సా అర్బన్ ఎడిషన్ ఇంటీరియర్ సొగసైన టాన్ లెథర్ సీట్ కవర్లు ఉన్నాయి. హెక్సా ఎస్‌యూవీ ఇంటారియర్ మొత్తానికి పర్సనల్ టచ్ ఇస్తూ లగ్జరీ సీటింగ్ వ్యవస్థను టాటా అందించింది.

వైర్ లెస్ ఛార్జింగ్

టాటా మోటార్స్ తమ హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్‌లో వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్‌ను జోడించింది. దీంతో కేబుల్ అవసరం లేకుండానే హెక్సా‌లో ఉన్నంత సేపు మీ ఫోన్‌ను ఫుల్ ఛార్జింగ్‌లో ఉంచుకోవచ్చు.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేయర్

టాటా మోటార్స్ హెక్సా డౌన్‌టౌన్ అర్భన్ ఎడిషన్ ఎస్‌యూవీలో రియర్ ప్యాసింజర్స్ కోసం 10.1-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్‌ Blaupunkt RSE ప్లేయర్ డిస్ల్పేలను అందించింది. రియర్ ప్యాసింజర్లు తమకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను వ్యక్తిగతంగా పొందవచ్చు.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

హెడ్స్ అప్ డిస్ల్పే

సరికొత్త హెక్సా స్పెషల్ ఎడిషన్‌లో ఆధునిక ఫీచర్ హెడ్స్ అప్ డిస్ల్పే కలదు. ఎల్ఇడి హెడ్స్ అప్ డిస్ల్పే స్పీడ్ లిమిట్ అలర్ట్స్, బ్యాటరీ వోల్టోజ్ అలర్ట్స్ మరియు భద్రత గురించిన సూచనలు చేస్తుంది.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(TPMS)

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ టైర్లలోని గాలి సాంద్రతను ఎప్పటికప్పుడు లెక్కగడతుంది. ఈ ఫీచర్ ఉండటం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

స్టైలిష్ అల్లాయ్ వీల్స్

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్ అధునాతన 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో వచ్చింది.

సైడ్ స్టెప్స్

హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్ లోపలికి సౌకర్యవంతంగా ప్రవేశించడానికి సైడ్ స్టెప్స్‌ను జోడించింది.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

కార్పెట్ సెట్

చాలా వరకు కార్లలో అడుగు భాగంలో రబ్బరు కార్పెట్లు వస్తుంటాయి. అయితే, రెగ్యులర్ మోడల్‌తో పోల్చుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్ హెక్సాలో ప్రత్యేకమైన కార్పెట్ సెట్‌ను టాటా అందించింది.

టాటా మోటార్స్ హెక్సా ఎస్‌యూవీని ఎక్స్ఇ, ఎక్స్ఎమ్, ఎక్స్ఎమ్ఎ, ఎక్స్‌టి మరియు ఎక్స్‌టి వేరియంట్లో అందుబాటులో ఉంచింది. సరికొత్త టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్ రెండు విభిన్న ప్యాకేజీల్లో లభిస్తోంది. అవి, అబ్సల్యూట్ ప్యాకేజి మరియు ఇండల్జ్ ప్యాకేజ్. వివిధ వేరియంట్ల మధ్య ఈ ప్యాకేజీలో ఎలాంటి వ్యత్యాసం ఉందో చూద్దాం రండి...

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

అబ్సల్యూట్ ప్యాక్

ఎక్స్ఇ/ఎక్స్ఎమ్/ఎక్స్ఎమ్ఎ వేరియంట్లలో డౌన్‌టౌన్ బ్యాడ్జింగ్, క్రోమ్ ప్యాక్ సూట్, సీట్ కవర్లు, వైర్ లెస్ ఛార్జింగ్, సైడ్ స్టెప్స్, కార్పెట్ సెట్ మరియు కార్ కేర్ కిట్.

ఎక్స్‌టి/ఎక్స్‌టి వేరియంట్లలో డౌన్‌టౌన్ బ్యాడ్జింగ్, క్రోమ్ ప్యాక్ సూట్, వైర్ లెస్ ఛార్జర్, సైడ్ స్టెప్స్, కార్పెట్ సెట్ మరియు కార్ కేర్ కిట్ ఉన్నాయి. అయితే, ఈ రెండు వేరియంట్లలో సీట్ కవర్లు మిస్సయ్యాయి.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

ఇండల్జ్ ప్యాక్

ఎక్స్ఇ/ఎక్స్ఎమ్/ఎక్స్ఎమ్ఎ వేరియంట్లలో డౌన్‌టౌన్ బ్యాడ్జింగ్, క్రోమ్ ప్యాక్ సూట్, సీట్ కవర్లు, వైర్ లెస్ ఛార్జర్, సైడ్ స్టెప్స్, కార్పెట్ సెట్, కార్ కేర్ కిట్ మరియు సరికొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఎక్స్‌టి/ఎక్స్‌టిఎ వేరియంట్లలో డౌన్‌టౌన్ బ్యాడ్జింగ్, క్రోమ్ ప్యాక్ సూట్, వైర్ లెస్ ఛార్జర్, సైడ్ స్టెప్స్, కార్పెట్ సెట్ మరియు కార్ కేర్ కిట్‌తో పాటు అదనంగా, 10.1-అంగుళాల పరిమాణం గల Blaupunkt కంపెనీ వారి రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేయర్ మరియు హెడ్స్ అప్ డిస్ల్పే ఉన్నాయి.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రీమియమ్ ఎస్‌యూవీ ఫీల్ కలిగించేందుకు టాటా మోటార్స్ ఎన్నో ప్రీమియమ్ ఫీచర్లను అందించింది. రెగ్యులర్ వెర్షన్ హెక్సాతో పోల్చుకుంటే హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్ ఎస్‌యూవీ చాలా విభిన్నంగా ఉంటుంది. ఇది విపణిలో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500కు గట్టి పోటీనిస్తుంది.

English summary
Read In Telugu: Tata Hexa Downtown Urban Edition Launched In India — Boasts Of New Upmarket Features
Story first published: Friday, November 3, 2017, 21:02 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark