2018 జనవరి నుండి ధరల పెంపుకు కసరత్తులు చేస్తున్న టాటా మోటార్స్
దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ జనవరి 2018 నుండి తమ అన్ని కార్ల మీద ధరలు పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ జనవరి 2018 నుండి తమ అన్ని కార్ల మీద ధరలు పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
టాటా ఇండియా లైనప్‌లో లభించే అన్ని ప్యాసింజర్ కార్ల మీద ఈ ధరలు పెంపు ఉండనుంది. వీటి ధరలు గరిష్టంగా రూ. 25,000 ల వరకు పెరిగే అవకాశం ఉంది. ధరల పెంపు అనంతరం సవరించబడిన అన్ని కొత్త ధరలు జనవరి 1, 2018 నుండి అమల్లోకి రానున్నాయి.

ప్రస్తుతం టాటా ఇండియా లైనప్‌లో నానో, ఇండికా, బోల్ట్ మరియు టియాగో హ్యాచ్‌బ్యాక్ కార్లు, ఇండిగో, జెస్ట్, మరియు టిగోర్ సెడాన్ కార్లు అదే విధంగా సుమో గోల్డ్, సఫారీ స్టార్మ్, నెక్సాన్ మరియు హెక్సా ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. 2018 నుండి వీటన్నింటి మీద ధరల పెంపు ఉండనుంది.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ప్రెసిడెంట్ మయాంక పరీక్ మాట్లాడుతూ, "మార్కెట్ పరిస్థితులు మారడం, పెట్టుబడి ఖర్చులు పెరగడం మరియు అంతర్గత ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకే ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు."

వినియోగదారుల మీద అధిక భారం పడకుండానే నిర్ణీత పరిధి మేరకు మాత్రమే ధరలు పెంచనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం బెస్ట్ సెల్లింగ్ మోడళ్లుగా నిలిచిన టియాగో, హెక్సా మరియు టిగోర్ కార్లతో భవిష్యత్తులో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.

అంతే కాకుండా టాటా నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ప్రారంభ పరిచయ ధరలు డిసెంబర్ 31, 2017 నుండి మాత్రమే అందుబాటులో ఉంటాయి. జనవరి 1, 2018 నుండి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని టాటా మోటార్స్ పేర్కొంది.

టాటా మోటార్స్ ఈ ఏడాది సెప్టెంబరులో నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని 5.85 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా వచ్చిన నెక్సాన్ టాటాకు మంచి సక్సెస్ సాధించిపెట్టింది. ఇప్పటికే 10,000 యూనిట్లను విక్రయించిన మైలురాయిని నెక్సాన్ అధిగమించింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టాటా మోటార్స్ తమ అన్ని ఉత్పత్తుల మీద ధరల సవరణ చేపట్టి, జనవరి 1, 2018 నుండి కొత్త ధరలను అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇలా ముందుగా వెల్లడించడం ద్వారా కస్టమర్లు డిసెంబర్ 31, 2017లోపే నచ్చిన టాటా కారును ఎంచుకుంటే ధరల పెంపు భారం నుండి తప్పించుకోవచ్చు.
టాటా మోటార్స్ మాత్రమే కాదు, స్కోడా, హోండా, ఇసుజు మరియు టయోటా మోటార్స్ కూడా జనవరి 2018 నుండి తమ కార్ల మీద ధరలు పెంచనున్నట్లు ప్రకటించాయి.


Click it and Unblock the Notifications








