ఈ రెండు కార్లే మా టార్గెట్: టాటా మోటార్స్
టాటా మోటార్స్ రానున్నఆర్థిక సంవత్సరంలో రెండు కొత్త ఎస్‍యూవీలను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
టాటా మోటార్స్ రానున్నఆర్థిక సంవత్సరంలో రెండు కొత్త ఎస్‍యూవీలను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో విపణిలోకి 5-సీటర్ మరియు 7-సీటర్ ఎస్‌యూవీలను విడుదలకు సిద్దం చేస్తోంది.

టాటా 5-సీటర్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు రెనో వారి అప్‌కమింగ్ ఎస్‌యూవీ కప్తుర్ లకు గట్టి పోటీనివ్వనుంది. మరియు 7- సీటర్ ఎస్‌యూవీ జీప్ కంపాస్‌కు పోటీనివ్వనుంది.
Recommended Video


5-సీటర్ ఎస్‌యూవీ ధర రూ. 13 లక్షల మరియు కంపాస్‌కు పోటీగా వస్తున్న మోడల్ 7-సీటర్ ధర 15 లక్షల నుండి ప్రారంభం కానుంది. రెండు ఎస్‌యూవీలను కూడా ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యూవీ ఆధారంగా ఎల్550 ఫ్లాట్‌ఫామ్ మీద డెవలప్ చేయనుంది.

బాడీ డిజైన్ పరంగా ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ నుండి ఎన్నో సొబగులతో రానుంది. అయితే టాటా మోటార్స్ ప్లాన్ చేసిన రెండు ఎస్‌యూవీలు డిజైన్ మరియు ఇంజన్ అంశాల వారీగా చూస్తే వేరు వేరుగా ఉంటాయి. మరియు మార్కెట్లో ఇది వరకు లేని రూపంలో ఇవి రానున్నాయి.

టాటా మోటార్స్ తమ అప్‌కమింగ్ 5-సీటర్ మరియు 7-సీటర్ ఎస్‌యూవీలలో ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ అభివృద్ది చేసిన 2.0-లీటర్ మల్టీ జెట్ II ఇంజన్‌ను వినియోగించనుంది. 5-సీటర్ మోడల్‌లో ఇది 138బిహెచ్‌పి పవర్ మరియు 7-సీటర్ ఎస్‌యూవీలో 167బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా-ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ సంస్థలు ఉమ్మడి భాగస్వామ్యంతో పూనేలోని రంజన్‌గావ్ ప్రొడక్షన్ ప్లాంటులో ఈ 2.0-లీటర్ ఇంజన్‌లు తయారవుతున్నాయి. మరియు జీప్ ఈ మధ్య విపణిలోకి విడుదల చేసిన కంపాస్‌లో కూడా ఇదే ఇంజన్ కలదు.

అమెరికన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం జీప్ విడుదల చేసిన కంపాస్‌ను ఎదుర్కునేందుకు టాటా తమ 5-సీటర్ మరియు 7-సీటర్ ఎస్‌యూవీలలో 2-వీల్ డ్రైవ్ మరియు 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కూడా అందివ్వనుంది.


Click it and Unblock the Notifications








