కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

దేశీయ ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో హోండా మోటార్స్ కన్నా అధిక కార్లను విక్రయించి, భారత దేశపు నాలుగవ అతి పెద్ద కార్ల తయారీ మరియు విక్రయ సంస్థగా టాటా మోటార్స్ నిలిచింది.

By Anil

ఇండియన్ ప్యాసింజర్ కార్ల సేల్స్‌లో జపాన్ సంస్థల ఆధిపత్యం దాటికి దేశీయ దిగ్గజం టాటా తీవ్రపోటీని ఎదుర్కుంటోంది. అయితే గత సంవత్సర కాలం నుండి నూతన డిజైన్ ఫిలాసఫీతో కొత్త ఉత్పత్తులను అభివృద్ది చేసి, విడుదల చేయడంతో ఆశించిన మేర ఫలితాలను సాధిస్తోంది.

గత నెల దేశీయ ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో హోండా మోటార్స్ కన్నా అధిక కార్లను విక్రయించి, భారత దేశపు నాలుగవ అతి పెద్ద కార్ల తయారీ మరియు విక్రయ సంస్థగా టాటా మోటార్స్ నిలిచింది.

కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

దేశీయంగా ప్యాసింజర్ కార్ల విక్రయాలు మే 2017 లో 8.963 శాతం వరకు పెరిగాయి. అయితే ఏప్రిల్ 2017లో నమోదైన విక్రయాలు 14.68 శాతముతో పోల్చుకుంటే ప్యాసింజర్ కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టినట్లు సియామ్ వెల్లడించింది.

కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

టాటా మరియు హోండా కార్ల విక్రయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా టాటా విడుదల చేసిన టియాగో, టిగోర్ మరియు హెక్సాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా హోండా మోటార్స్‌ను విక్రయాల పరంగా వెనక్కినెట్టి నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

సేల్స్ గణాంకాల మేరకు, గడిచిన మే 2017 లో టాటా మోటార్స్ 12,499 యూనిట్లను విక్రయించింది. అయితే ఇదే మాసంలో హోండా 11,278 యూనిట్లను విక్రయించింది. భారత దేశపు టాప్ 10 సెల్లింగ్ కార్ల తయారీ సంస్థల జాబితాలో హోండాను ఐదవ స్థానంలోకి నెట్టేసి, నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకుంది టాటా.

కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

ఈ ఏడాది హోండా సరికొత్త ఫేస్‌లిప్ట్ సిటి సెడాన్ మరియు డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ కార్లను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆశించిన మేర విక్రయాలు సాధించలేకపోయింది. భవిష్యత్తులో ప్రీమియమ్ ఉత్పత్తుల అభివృద్ది మరియు తయారీ మీద దృష్టి పెడతామని హోండా ఓ ప్రకటనలో పేర్కొంది.

కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

జపాన్ దిగ్గజం హోండా మోటార్స్ సిటి మీద 33,000 బుకింగ్స్ మరియు డబ్ల్యూఆర్-వి మీద 18,000 ల యూనిట్ల బుకింగ్స్ నమోదు చేసుకుంది. ఈ రెండు మోడళ్ల మీద వెయిటింగ్ పీరియడ్ రెండు నెలలుగా ఉంది.

కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

హోండా మోటార్స్ ఫలితాలను గమనించిన తరువాత దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో కొద్ది కొద్దిగా పట్టును కోల్పోతున్నట్లు కనబడుతోంది. డబ్ల్యూఆర్-వి మరియు సిటి సెడాన్‌లను మినహాయిస్తే మరే ఇతర మోడళ్లకు ఆశించిన డిమాండ్ లభించడం లేదు.

కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

టాటా మోటార్స్ విషయానికి వస్తే, ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో రాణించేందుకు ప్రణాళికలు పూర్తిగా మార్చేసింది. ఇంపాక్ట్ అనే డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా అభివృద్ది చేసిన కొత్త ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. మరియు ఇంపాక్ట్ డిజైన్ లక్షణాలతో ఉన్న కార్లకు డిమాండ్ అధికమవుతోంది.

కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

టాటా మోటార్స్ మొత్తం విజయంలో టియాగో హ్యాచ్‌బ్యాక్‌దే ఎక్కువ వాటా. టియాగో విడుదలతో మార్కెట్ చూపు టాటా మోటార్స్ పై పడింది. దీనికి తోడు అరియా ఎమ్‌పీవీని రీడిజైన్ చేసి ఎమ్‌పివి మరియు ఆఫ్ రోడింగ్ లక్షణాలు మరియు అద్బుతమైన ఫీచర్లతో హెక్సా ను విడుదల చేసింది. హెక్సా కూడా స్థిరమైన ఫలితాలు సాధిస్తోంది.

కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

టాటా మోటార్స్ చివరగా విడుదల చేసిన ఉత్పత్తి టాటా టిగోర్ సబ్ కాంపాక్ట్ సెడాన్. దేశీయ మార్కెట్లో సబ్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో విడుదల చేయడానికన్నా విభిన్నమైన డిజైన్ లక్షణాలతో అభివృద్ది చేయడం మీద దృష్టిసారించి స్టైల్ బ్యాక్ ట్యాగ్ లైన్‌తో విడుదల చేసింది.

కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

టియాగో, హెక్సా మరియు టిగోర్ రాకతో టాటా మోటార్స్ మంచి ఫలితాలను అందుకుంటోంది. పోటీ మార్కెట్లో మరింత నిలదొక్కుకునేందుకు ఇదే తరహా ఉత్పత్తులను తీసుకురావాలనే ఆలోచనలో ఉంది.

కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో చక్కగా రాణిస్తున్న సెగ్మెంట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 లకు పోటీగా నెక్సాన్ అనే కాంపాక్ట్ ఎస్‌యూవీని అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది.

కార్ల విక్రయాల్లో హోండా ను వెనక్కి నెట్టిన టాటా

చిన్న కార్లు, ప్రీమియమ్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న ప్యాసింజర్ అన్ని వాహన సెగ్మెంట్లలో తమ ఉత్పత్తులను సమిష్టిగా తీసుకురావడంలో టాటా విజయం సాధించింది. హోండా మోటార్స్ విషయానికి వస్తే, చిన్న కార్ల సెగ్మెంట్‌ను ప్రక్కనపెట్టి ప్రీమియమ్ కార్ల మీద ఎక్కువ శ్రద్ద చూపుతోంది.

Most Read Articles

English summary
Read In Telugu Tata Motors Overtakes Honda To Become 4th Largest Carmaker In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X