టాటా మోటార్స్ నుండి రెండు కొత్త ఎస్‌యూవీలు
నెక్సాన్ ఎస్‌యూవీతో సక్సెస్ అందుకున్న టాటా మోటార్స్ ఇప్పుడు ఇదే జోరు అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీని అభివృద్ది చేస్తోంది. టాటా మోటార్స్ భాగస్వామ్యపు సంస్థ ల్యాండ్ రోవర్‌కు చెందిన డిస్కవరీ స్పోర్ట్ ఆధా
నెక్సాన్ ఎస్‌యూవీతో సక్సెస్ అందుకున్న టాటా మోటార్స్ ఇప్పుడు ఇదే జోరు అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీని అభివృద్ది చేస్తోంది. టాటా మోటార్స్ భాగస్వామ్యపు సంస్థ ల్యాండ్ రోవర్‌కు చెందిన డిస్కవరీ స్పోర్ట్ ఆధారంతో రెండు కొత్త మోడళ్లను డెవలప్ చేస్తోంది.

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, రెండు ఎస్‌యూవీలలో ఒకటి అత్యంత ఖరీదైనది కాగా, మరొకటి ప్రీమియమ్ ఎస్‌యూవీ. ఈ మిడ్ సైజ్ ప్రీమియమ్ ఎస్‌యూవీ టాటా లైనప్‌లో ఉన్న నెక్సాన్ మరియు హెక్సా మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది.

ప్రస్తుతం మిడ్ సైజ్ ఎస్‌యూవీని క్యూ501 పేరుతో టాటా బృందం డెవలప్ చేస్తోంది. 2018 నాటికి పూర్తి స్థాయిలో విడుదల కానున్న ఇది హ్యుందాయ్ క్రెటా, రెనో క్యాప్చర్ మరియు 5-సీటింగ్ కెపాసిటి ఉన్న ఇతర మోడళ్లకు ధీటైన పోటీనివ్వనుంది.

మిడ్ సైజ్ మరియు ప్రీమియమ్ ఎస్‌యూవీ రెండింటినీ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్‌ను నిర్మించిన ఎల్550 ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించనుంది. ప్రీమియమ్ ఎస్‌యూవీకి క్యూ502 కోడ్ పేరును ఖరారు చేసింది.

ప్రస్తుతం ఈ రెండు మోడళ్లు కూడా డిజైన్ మరియు డెవలప్‌మెంట్ పరంగా కాన్సెప్ట్ దశలోనే ఉన్నాయి. టాటా మోటార్స్ ప్రోటోటైప్ మోడళ్లను ఇప్పటికే పలుమార్లు రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది.

రెండు కొత్త ఎస్‌యూవీలలో ఫియట్ నుండి సేకరిస్తున్న 2-లీటర్ మల్టీజెట్-II డీజల్ ఇంజన్‌ను అందివ్వనున్నారు. వీటిని ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ వారి రంజన్‌గావ్‌లో ఉన్న ప్రొడక్షన్ ప్లాంటు ద్వారా ఉత్పత్తి చేసి టాటా మోటార్స్‌కు సరఫరా చేయనుంది. ప్రస్తుతం ఇదే ఇంజన్ జీప్ కంపాస్‌లో ఉంది, అయితే టాటా కోసం తయారు చేసే ఇంజన్‌లు మరింత ఎక్కువ పవర్ ఉత్పత్తి చేయనున్నాయి.

5-సీటింగ్ కెపాసిటీతో రానున్న ఎస్‌యూవీ గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. మరియు 7-సీటర్ ఎస్‌యూవీ 170బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేయనుంది. ఈ రెండు ఎస్‌యూవీలను ఒకే ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తున్నప్పటికీ ఇంజన్ మరియు రెండు ఎస్‌యూవీలు చూడటానికి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.

డిజైన్ విషయానికి వస్తే, టిగోర్, టియాగో, హెక్సా మరియు నెక్సాన్ ఎస్‌యూవీలను నిర్మించిన ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగానే వీటిని డిజైన్ చేయనుంది. ఇంటీరియర్ ఫీచర్లు మాత్రం టాటా బృందంతో పాటు టాటా భాగస్వామ్యపు బృందాలు కూడా పనిచేయనున్నాయి. రెండు మోడళ్లు టూ-వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్స్‌లో లభించనున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఇండియన్ ప్యాసింజర్ వెహికల్ విభాగంలో ఎస్‌యూవీ సెగ్మెంట్ శరవేగంగా అభివృద్ది చెందుతోంది. అయితే, ధరలు పోటీనిదారులను ఎదుర్కొనేలా నిర్ణయిస్తే మంచి సక్సెస్ ఖాయం. ఎస్‌యూవీ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే భాగంలోనే మంచి ఆదరణ లభిస్తున్న మోడళ్లకు గట్టిపోటీనిచ్చేలా తమ రెండు వాహనాలను టాటా సిద్దం చేస్తోంది.
వీటిలో జీప్ కంపాస్‌కు గట్టి పోటీనివ్వనున్న ఎస్‌యూవీని 2019లో మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








