బ్రిజా, ఎకోస్పోర్ట్ లకు పోటీగా వస్తున్న టాటా నెక్సాన్ మైలేజ్ 24-26కిమీ/లీ!

Written By:

టాటా మోటార్స్ తమ తరువాత ఉత్పత్తి నెక్సాన్ ఎస్‌యూవీ దేశీయ విడుదలకు సర్వం సిద్దం చేసుకుంది. అయితే విడుదలకు ముందే నెక్సాన్ లోని బేస్ వేరియంట్‌ను పరీక్షించింది. దీనికి చెందిన ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్లతో పాటు విడుదలకు సంభందించిన పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో....

టాటా నెక్సాన్ కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఎస్‌యూవీని లోని ప్రారంభ వేరియంట్‌ను పబ్లిక్ రోడ్ల మీద పరీక్షించింది. ఈ ఫోటోలను గమనిస్తే చివరి దశ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నెక్సాన్ ఇంటీరియర్ ఫోటోలను ఆటో మొబైల్ మీడియా క్లిక్ మనిపించింది.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ

అనుమతుల కోసం వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వద్దకు కొన్ని వాహనాలను పంపినట్లు తెలిసింది. నెక్సాన్ ఎస్‌యూవీని పరీక్షించిన డ్రైవర్ తెలిపిన వివరాల మేరకు ఇది లీటర్‌కు 24 నుండి 26 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చిందని పేర్కొన్నాడు.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ

అయితే పరీక్షించిన మోడల్‌‌ బ్యానెట్ క్రింద పెట్రోల్ ఇంజన్ ఉందా, లేదంటే డీజల్ ఇంజన్ ఉందా అనే విషయం తెలియరాలేదు. ఫోటోల ప్రకారం, ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాకుండా ప్రారంభ వేరియంట్ అనే విషయం స్పష్టంగా గుర్తించవచ్చు.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ

ఎంట్రీ లెవల్ టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో స్టీల్ వీల్స్ ఉన్నాయి. నెక్సాన్ రూఫ్ టాప్ మీద పదునైన, చిన్నగా ఉన్న యాంటెన్నా కలదు.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ

బేస్ వేరియంట్ నెక్సాన్ ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ థీమ్ కలదు. రహస్యంగా లభించిన ఇంటీరియర్ ఫోటోల మేరకు, ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ కలదు. సిటి, ఎకో మరియు స్పోర్ట్ అనే మూడు విభిన్నమైన డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ

ఇంజన్ పరంగా టాటా నుండి ఎలాంటి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ఇందులో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లు రానున్నాయి.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ ఈ ఏడాదిలో రెండు మోడళ్ల(హెక్సా మరియు టిగోర్ )ను విపణిలోకి విడుదల చేయనుంది. కాబట్టి ఈ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్లోకి విడుదల చేయనుంది.

టాటా నెక్సాన్ కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ

దేశీయ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మంచి ఫలితాలు సాధిస్తున్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియూవీ300 లకు గట్టి పోటీనివ్వనుంది. టాటా మోటార్స్‌తో పాటు అన్ని ఆటోమొబైల్ వార్తల కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు....

English summary
Read In Telugu Tata Nexon Base Variant Interior Leaked
Story first published: Tuesday, June 13, 2017, 10:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark