డిజైర్ తరహాలో మరో ప్రమాదం: పరీక్షిస్తుండగా ప్రమాదానికి గురైన టాటా నెక్సాన్
టాటా మోటార్స్ తమ అప్‌కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్‌కు రహదారి పరీక్షలు నిర్వహిస్తుండగా అపశ్రుతి చోటు చేసుకుంది. టెస్టింగ్ సమయంలో నెక్సాన్ ఓ ట్రాక్టర్‌ను బలంగా ఢీ కొట్టింది.
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగూరి నగరంలో టాటా వారి అప్ కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్‌ను పరీక్షిస్తుండగా ఓ ట్రాక్టర్‌ను ఢీ కొని ప్రమాదానికి గురయ్యింది. టాటా దీనిని త్వరలో విడుదల చేయనుంది. అందుకు కోసం పరీక్షిస్తుండగా ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం.

సిలిగూరి టైమ్స్ అనే మీడియా కథనం మేరకు, ప్రచారణలో భాగంగా కంపెనీ ఈ కారును సిలిగూరికి తీసుకొచ్చారు. అయితే ఇదే నగరంలో ఇసుక లోడుతో వస్తోన్న ట్రాక్టర్ నెక్సాన్ కారును ఢీకొట్టింది.

కుర్లకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పీప్రితాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘనటలో కారు ముందు భాగంలో ఉన్న బ్యానెట్ పాక్షికంగా దెబ్బతింది.

ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన వారిని సమీపంలోని థాకుర్ గంజ్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రాంతీయ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ట్రాక్టర్ నెక్సాన్‌ను ఎదురుగా ఢీకొనగా కారుకు ఎడమవైపు ఉన్న టైరు వంగిపోయి, బయటకు చొచ్చుకొచ్చింది. దీనిని బట్టి చూస్తే రియర్ యాక్సిల్ మరియు వీల్ కలిసే భాగంలో కట్ అయినట్లు తెలుస్తోంది.

టాటా మోటార్స్ తరువాత విడుదల చేయనున్న మోడల్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇది సాంకేతికంగా 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లతో రానుంది.


Click it and Unblock the Notifications








