GST ఎఫెక్ట్ తో అనుకున్న సమయానికి ముందే విడుదలవుతున్న టాటా నెక్సాన్

ప్రణాళిక ప్రకారం నెక్సాన్ రానున్న దీపావళి నాటికి మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకున్న సమయానికన్నా ముందే విడుదలవుతున్నట్లు స్పష్టమైంది.

By Anil

టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తమ నెక్సాన్ ను విడుదల చేయడానికి ముందస్తు ప్రణాళికలు వేసుకుంది. ప్రణాళిక ప్రకారం నెక్సాన్ రానున్న దీపావళి నాటికి మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకున్న సమయానికన్నా ముందే విడుదలవుతున్నట్లు స్పష్టమైంది.

టాటా నెక్సాన్ విడుదల

ఇలా జరగడానికి బిఎస్‌టి ప్రధానం కారణం అని ఏవరైనా ఊహించారా..? బహుశా టాటా కూడా ఆలోచించి ఉండదు. జిఎస్‌టి అమలు కావడంతో దాదాపు అన్ని కార్ల మీద ట్యాక్స్ తగ్గి, ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి కొనుగోలుదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న కార్లకు గిరాకీ మరింత పెరిగింది.

టాటా నెక్సాన్ విడుదల

ఇలా మార్కెట్ వాతావరణాన్ని పసిగట్టిన టాటా మోటార్స్, దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి, అవకాశాలు ఉన్నప్పుడే వీలైనన్ని ఎక్కువ కార్లు అమ్మేసుకోవాలనే ఉద్దేశ్యంతో సంవత్సరాంతంలో వచ్చే పండుగ సీజన్ నాటికి కాకుండా ఈ ఆగష్టులోనే తమ నెక్సాన్ ను విడుదల చేసి మంచి విక్రయాలు రాబట్టాలని చూస్తోంది.

టాటా నెక్సాన్ విడుదల

టాటా మోటార్స్ నెక్సాన్ విడుదల చేయాలనుకున్న సమయానికన్నా రెండు నెలల ముందుగానే విడుదల చేయనుంది. నూతన ట్యాక్స్ విధానంతో ప్రస్తుతం చిన్న చిన్న కార్ల నుండి ఎస్‌యూవీల వరకు 3 నుండి 14 శాతం వరకు ధరలు తగ్గుముఖం పట్టాయి.

టాటా నెక్సాన్ విడుదల

టాటా నెక్సాన్ విషయానికి వస్తే - టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని రూపొందించింది. ఇంపాక్ట్ డిజైన్ లక్షణాలతో ఇది వరకే విడుదలైన టియాగో, హెక్సా మరియు టిగోర్ లకు మంచి డిమాండ్ లభిస్తోంది.

టాటా నెక్సాన్ విడుదల

దేశీయంగా ఎస్‌యూవీలకు డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతుండటంతో నెక్సాన్ ఎస్‌యూవీ భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం. నెక్సాన్ విలువలకు తగ్గ ధరలతో విడుదలైతే మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 లకు గట్టిపోటీనిస్తుంది.

టాటా నెక్సాన్ విడుదల

నెక్సాన్‌లో సాంకేతికంగా 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో తొలుత 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో విడుదలయ్యి, తరువాత ఆలస్యంగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభించే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ విడుదల

టాటా మోటార్స్ 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద నెక్సాన్ ఎస్‌యూవీని కాన్సెప్ట్ దశలో ప్రదర్శించింది. పలుమార్లు రహదారి పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రొడక్షన్ దశకు చేరుకున్న నెక్సాన్‌ను విడుదలకు పూర్తి స్థాయిలో సిద్దం చేసింది.

టాటా నెక్సాన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జిఎస్‌టి ట్యాక్స్ విధానానికి ప్రజలు చూపుతున్న సానుకూల స్పందనను అనుకూలంగా మలుచుకుని, సరైన ధరల శ్రేణిలో నెక్సాన్‌ను విడుదల చేసి, కొనుగోలుదారులను ఆకర్షించాలని చూస్తోంది టాటా మోటార్స్. టాటా నెక్సాన్ ప్రారంభ ధర రూ. 6.5 నుండి 7 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, July 7, 2017, 17:04 [IST]
English summary
Read In Telugu: Tata Nexon India Launch Sooner Than Expected
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+