రహస్యంగా పరీక్షించబడుతూ, డ్రైవ్‌స్పార్క్ చేతికి చిక్కిన టాటా నెక్సాన్

Written By:

ఇండియన్ ఆటోమోటివ్ దిగ్గజం, టాటా మోటార్స్ తమ క్రాసోవర్ ఎస్‌యూవీ నెక్సాన్‌ను మరోసారి రహస్యంగా పరీక్షించింది. దీనిని గుర్తించిన డ్రైవ్‌స్పార్క్ తన కెమెరాతో ఫోటోలను క్లిక్‌మనిపించింది. మారుతి సుజుకి వితారా బ్రిజా ఎస్‌యూవీకి ఇది గట్టి పోటీనివ్వనుంది.

టాటా నెక్సాన్‌కు టెస్టింగ్

ఈ ప్రోటోటైప్ మోడల్‌ ఎప్పటిలాగే నలుపు మరియు తెలుపు చారలున్న పేపర్‌తో కప్పబడింది. 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద టాటా కాన్సెప్ట్ దశలో ప్రదర్శించిన నెక్సాన్ మోడల్‌ నుండి అనేక డిజైన్ లక్షణాలను పొందింది.

టాటా నెక్సాన్‌కు టెస్టింగ్

టాటా ప్రస్తుతం ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా కొత్త ఉత్పత్తులను అభివృద్ది చేస్తోంది. ఈ నెక్సాన్ టాటా ఇంపాక్ట్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంతో వస్తున్న వరుసగా నాలుగవ మోడల్ (టియాగో, హెక్సా మరియు టిగోర్).

టాటా నెక్సాన్‌కు టెస్టింగ్

సాంకేతికంగా నెక్సాన్ ఎస్‌యూవీ టిగోర్ కాంపాక్ట్ సెడాన్‌లో అందించిన 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న రివట్రోన్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో రానుంది. రెండు ఇంజన్ ఆప్షన్‌లలో తొలుత మ్యాన్యువల్ గేర్‌బాక్స్, కాస్త ఆలస్యంగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పరిచయం చేయనున్నారు.

టాటా నెక్సాన్‌కు టెస్టింగ్

నెక్సాన్ డ్యూయల్ టోన్ థీమ్ ఇంటీరియర్ మరియు డిస్ల్పే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లతో రానుంది. ఆధునిక కాలంలో దాదాపు అన్ని ప్యాసింజర్ వెహికల్స్‌లో వస్తోన్న సెలక్టివ్ డ్రైవ్ మోడ్‌ ఇందులో కూడా కలదు. నెక్సాన్‌ను సిటి, స్పోర్ట్ మరియు ఎకో అనే మూడు డ్రైవింగ్ మోడల్‌లో డ్రైవ్ చేయవచ్చు.

టాటా నెక్సాన్‌కు టెస్టింగ్

ఈ ఏడాది ముగిసేనాటికి నెక్సాన్ విపణిలోకి రానుంది. కాని, ఆధారం లేని కథనాల మేరకు దసరా లేదా దీపావళి నాటికి మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 లకు పోటీగా విడుదల కానుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా అనుసరిస్తున్న నూతన ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంతో వచ్చిన ఉత్పత్తులు టియాగో మరియు టిగోర్ టాటాకు మంచి విజయాన్నిసాధించిపెట్టాయి. అయితే విభిన్న శైలిలో వస్తున్న నెక్సాన్ తరహాలో మరే మోడల్ ఇండియన్ మార్కెట్లో లేకపోవడంతో నెక్సాన్ మంచి విజయాన్ని అందించే అవకాశం ఉంది.

English summary
Read In Telugu Spy Pics: Tata Nexon Spotted Testing
Story first published: Monday, June 19, 2017, 10:20 [IST]
Please Wait while comments are loading...

Latest Photos