టామో రేస్‌మో స్పోర్ట్స్ కారును ఆవిష్కరించిన టాటా మోటార్స్

Written By:

2017 జెనీవా మోటార్ షో వేదికగా టాటా టామో బృందం రేస్‌మో స్పోర్ట్స్ కూపే కారును ఆవిష్కరించింది. టాటా మోటార్స్ లోని టామో మొబైలిటి డివిజన్ యొక్క మొదటి కారు ఇది. ప్రపంచ ప్రదర్శనకు తీసుకొచ్చిన ఈ ఆవిష్కరణతో అంతర్జాతీయ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

టాటా సరికొత్త టామె రేస్‌మో స్పోర్ట్స్ కూపే కారులో 1.2-లీటర్ సామర్థ్యం గల టుర్బో ఛార్జ్‌డ్ మిజ్ మౌంటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ గరిష్టంగా 186బిహెచ్‌పి పవర్ మరియు 210ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

పెడల్ షిఫ్టర్స్ అనుసంధానంతో ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. ఇది కేవలం ఆరు సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

రేస్‌మో డిజైన్ మొత్తాన్ని ఇటలీలోని టూరిన్‌లో ఉన్న టాటా మోటార్స్ డిజైన్ స్టూడియోలో డిజైన్ చేయబడింది. ఈ డిజైన్‌లో చిన్న పరిమాణంలో ఉన్న హెడ్ లైట్లు, సీతాకోక చిలుక తరహాలో డోర్లు, తక్కువ ఎత్తు ఉన్న రూఫ్ మరియు అన్ని ఎక్ట్సీరియర్ విడి భాగాల మీద డిజైన్ గీతలున్నాయి.

టాటా టామో బృందం ఈ రేస్‌మో స్పోర్ట్స్ కూపేను రెండు రూపాల్లో ఎంచుకోవచ్చు. అవి, సాధారణం రేస్‌మో మరియు రేస్ ట్రాక్ ఫోకస్ రేస్‌మో. ఫోర్జా హారిజాన్ అనే డిజిటల్ ప్రపంచంలో వీటిని అందుబాటులో ఉంచారు. పోర్జా సిరీస్‌లో ఉన్న మొదటి ఇండియన్ కారు ఇదే.

టామో రేస్‌మో ఆవిష్కరణ వేదిక మీద టాటా మోటార్స్ ఎమ్‌డి మాట్లాడుతూ, టాటా టామో డివిజన్ యొక్క తొలి ఆవిష్కరణ ఇది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టాటా టామో బృందం ఉద్వేగభరితమైన మరియు ఊహించినటువంటి అత్యుద్భుత మోడల్ అని వివరించాడు.

టాటా టామో కుంటుంబం నుండి ఇలాంటివి ఎన్నో స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి. వాటిలో ఇది మొదటి మోడల్ మాత్రమే. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాబోయే మరిన్ని మోడల్స్ ప్రపంచ స్పోర్ట్స్ కార్ల జాబితాలో నిలవనుంది.

లిమిటెడ్ ప్రొడక్షన్‌గా టాటా టామో డివిజన్ వచ్చే ఏడాది నాటికి రేస్‌మో స్పోర్ట్స్ కూపే కారును పూర్తి స్థాయిలో అమ్మకాలకు సిద్దం చేస్తోంది.

టాటా టామో రేస్‌మో స్పోర్ట్స్ కూపే కారులో టియాగో హ్యాచ్‌బ్యాక్ యొక్క 1.2-లీటర్ ఇంజన్‌నే టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్‌తో అందుబాటులో ఉంచింది.

ప్రతి ఒక్కరూ వీక్షించాల్సిన టాటా హెక్సా ఎస్‌యూవీ ఫోటో గ్యాలరీ....

English summary
2017 Geneva Motor Show: Tata Tamo Racemo Sports Coupe Unveiled
Please Wait while comments are loading...

Latest Photos