అత్యంత సరసమైన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కారు: టాటా టియాగో

Written By:

టాటా మోటార్స్ తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ టియాగో కారును ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎక్స్‌జడ్(XZ) వేరియంట్లో మార్చి 2017 లో విడుదల చేసింది. అయితే ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే లభ్యమయ్యేది, డీజల్ వేరియంట్లో ఆటోమేటిక్ లభించేది కాదు.

టాటా టియాగో ఆటోమేటిక్

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో హ్యాచ్‌బ్యాక్ కారును ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో, టాటా తమ టియాగోలోని ఎంట్రీ లెవల్ వేరియంట్ ఎక్స్‌టి(XT)లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందివ్వనుంది. అయితే టియాగో టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌జడ్(XZ) లోని ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను తొలగించనుంది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
టాటా టియాగో ఆటోమేటిక్

టాటా ఎక్స్‌టి(XT) వేరియంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించి టియాగో ఎక్స్‌టిఎ(XTA) వేరియంట్‌ను సెప్టెంబర్ 2017 లో విపణిలోకి విడుదల చేయనుంది. టాటా మోటార్స్ ఆగష్టులో 300 యూనిట్ల టియాగో ఎక్స్‌టిఎ(XTA) కార్లను ఉత్పత్తి చేసి, తరువాత నెల నుండి 500 యూనిట్ల చెప్పున ఎక్స్‌టిఎ(XTA) మోడళ్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.

టాటా టియాగో ఆటోమేటిక్

ఇది వరకు లభించే టాటా టియాగో ఎక్స్‌జడ్ఎ(XZA) ఆటోమేటిక్ వేరియంట్లో స్టీరింగ్ వీల్ ఆధారిత ఆడియో మరియు ఫోన్ కంట్రోల్స్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నరింగ్ స్టెబిలిటి కంట్రోల్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, రియర్ వైపర్, డీఫాగర్, ఎల్ఇడి టర్న్ సిగ్నల్స్ ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి.

టాటా టియాగో ఆటోమేటిక్

అయితే, ప్రస్తుతం టాటా విడుదల చేయాలని భావిస్తున్న టియాగో ఎక్స్‌టి ఆటోమేటిక్ వేరియంట్లో పైన పేర్కొన్న ఫీచర్లు రావడం లేదు. ఇందుకు కారణం, ఎక్స్‌జడ్ఎ టాప్ ఎండ్ వేరియంట్ కావడం మరియు ఎక్స్‌టి ఎంట్రీ లెవల్ వేరియంట్ కావడం. అయితే ఎక్స్‌టి ఆటోమేటిక్ విడుదలైతే, అత్యంత చౌకైన ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్‌ కారుగా నిలవడం ఖాయం.

టాటా టియాగో ఆటోమేటిక్

టియాగో ఎక్స్‌జడ్(XZ) వేరియంట్ కన్నా టియాగో ఎక్స్‌జడ్ఎ(XZA) ధర 30 వేల వరకు అధికంగా ఉండేది. కాబట్టి, టియాగో ఎక్స్‌టి స్టాండర్డ్ వేరియంట్ ధర కన్నా టియాగో ఎక్స్‌టిఎ(XTA) ఆటోమేటిక్ ధర రూ. 25 నుండి 30 వేల వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది.

టాటా టియాగో ఆటోమేటిక్

టాటా టియాగో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించును. ఇందులోని 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ 83బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. అదే విధంగా ఇందులోని 1.05-లీటర్ సామర్థ్యం ఉన్న రివోటార్క్ డీజల్ ఇంజన్ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా టియాగో ఆటోమేటిక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇప్పటి వరకు విపణిలోకి విడుదలైన దాదాపు అన్ని ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలోని టాప్ ఎండ్ వేరియంట్లు మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించేవి. అయితే తక్కువ ధరతో లభించే ఎంట్రీ లెవల్ వేరియంట్లను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని టాటా తమ టాప్ ఎండ్ వేరియంట్ టియాగోలో ఏఎమ్‌టి తొలగించి, ఎంట్రీ లెవల్ టియాగోలో ఏఎమ్‌టిని అందివ్వనుంది.

English summary
Read In Telugu: Tata Tiago AMT To Become More Affordable

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark