టియాగో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదలకు సిద్దం చేస్తున్న టాటా మోటార్స్

Written By:

టాటా మోటార్స్ టియాగో ద్వారా విజయాన్ని రుచించింది. దీంతో ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీలో వచ్చిన టియాగో హ్యాచ్‌‌బ్యాక్‌ను సరికొత్త ఎడిషన్‌లో విడుదల చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే పలుమార్లు రహస్యంగా టియాగో లిమిటెడ్ ఎడిషన్ కారును పరీక్షించింది. దీని గురించి మరింత సమాచారం....

టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్

ప్రస్తుతం టాటా మోటార్స్‌లో లైనప్‌లో రెగ్యులర్ వెర్షన్ టియాగో మాత్రమే అందుబాటులో ఉంది. వీలైనంత వరకు ఎక్కువ విక్రయాలు జరిపేందుకు టియాగోను లిమిటెడ్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టడానికి సిద్దమైంది.

Recommended Video
Tata Nexon Review: Specs
టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్

టియాగోలో ప్రస్తుతం ఉన్న ఎక్స్‌టి వేరియంట్‌ను మత్రమే లిమిటెడ్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. టియాగో టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌జడ్‌లో లిమిటెడ్ ఎడిషన్ రావడం లేదని తేలింది. ఏదేమైనప్పటికీ, లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ బ్లాక్ రూఫ్ టాప్ మరియు గ్లాస్ బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ కవర్లు ఉన్నాయి.

టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్

ప్రస్తుతం పరీక్షించబడుతున్న టియాగో లిమిటెడ్ ఎడిషన్‌లో 13-అంగుళాల వీల్స్ ఉన్నాయి. అయితే రెగ్యులర్ వెర్షన్ టియాగోలో 14-అంగుళాల వీల్స్ ఉన్నాయి. లిమిటెడ్ ఎడిషన్ టియాగోను ఎక్స్‌టి బ్యాడ్జ్ పేరుతో కాకుండా విజ్(wizz) బ్యాడ్జ్‌తో అందివ్వనుంది.

టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్

లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌లోని సరికొత్త డ్యాష్ బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ పియనో బ్లాక్ కలర్ ఆప్షన్‌లో రానుంది. అంతే కాకుండా స్పెషల్ ఎడిషన్ పేరుతో సరికొత్త ఫ్యాబ్రిక్ సీట్లు, మెకానికల్‌గా లోపలి నుండి అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లను అడ్జెసుకునే ఫీచర్లతో రానుంది.

టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్

లిమిటెడ్ ఎడిషన్ టియాగోలో సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్న అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు యథావిధిగా కొనసాగనున్నాయి. 83బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ పెట్రోల్ మరియు 68బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.05-లీటర్ డీజల్ ఇంజన్‌లు కలవు. వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్‌కు టియాగో ద్వారా వచ్చిన పాపులారిటీని అవకాశంగా మలుచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే విభిన్నమైన కస్టమర్లను చేరేందుకు లిమిటెడ్ ఎడిషన్ టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను సిద్దం చేస్తోంది. వచ్చే పండుగ సీజన్ నాటికి ఇది విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Spy Pics: Tata Tiago Special Edition Spotted Testing In India
Story first published: Wednesday, August 9, 2017, 17:11 [IST]
Please Wait while comments are loading...

Latest Photos