టాటా టియాగో విజ్ ఎడిషన్ ఫీచర్లు లీక్

Written By:

దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ విజ్ ఎడిషన్ టియాగో కారును అభివృద్ది చేస్తోంది. బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచిన టియాగో ను ఈ పండుగ సీజన్ నాటికి సరికొత్త విజ్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలో టియాగో విజ్ ఎడిషన్‌లోని ఫీచర్లు లీక్ అయ్యాయి...

టాటా టియాగో విజ్ ఎడిషన్ ఫీచర్లు

టాటా ప్రొడక్షన్ ప్లాంటు నుండి టియాగో విజ్ ఎడిషన్ ఫోటోలు లీక్ అయిన సంఘటన మరువక ముందే, టియాగో విజ్ ఎడిషన్ ఫీచర్లను తెలిపే ఫోటోలు తాజాగా ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి.

Recommended Video - Watch Now!
Tata Tiago XTA AMT Variant Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టాటా టియాగో విజ్ ఎడిషన్ ఫీచర్లు

లీక్ అయిన ఫోటోల ప్రకారం, విజ్ ఎడిషన్ టియాగోలో మునుపు లభించే అవే 1.2-లీటర్ రివట్రాన్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ రివోటార్క్ డీజల్ ఇంజన్‌లతో రానుంది. పెట్రోల్ వేరియంట్ 83బిహెచ్‌పి పవర్ మరియు డీజల్ వేరియంట్ 68బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తాయి. రెండు వేరియంట్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానున్నాయి.

టాటా టియాగో విజ్ ఎడిషన్ ఫీచర్లు

టియాగో విజ్ ఎడిషన్ ఎక్ట్సీరియర్ మీద డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్ కలదు. బ్లాక్ కలర్‌లో ఉన్న రూఫ్ టాప్, స్పాయిలర్, బి-పిల్లర్, మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మీద ఉన్న కప్స్ నలుపు రంగులో ఉన్నాయి. మరియు విజ్ ఎడిషన్ సూచించే బ్యాడ్జింగ్ కూడా కలదు.

టాటా టియాగో విజ్ ఎడిషన్ ఫీచర్లు

టియాగో విజ్ ఎడిషన్ ఇంటీరియర్‌లో పియానో బ్లాక్ ఫినిష్ డ్యాష్ బోర్డ్ మరియు ఎరుపు రంగులో ఉన్న తొడుగులతో పాటు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ ఉంది. సరికొత్త ప్యాట్రన్‌లో ఉన్న ఫ్యాబ్రిక్ సీట్లు, హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జూక్ కార్ యాప్ మరియు బ్లూటూత్ కనెక్టివిటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా టియాగో విజ్ ఎడిషన్ ఫీచర్లు

అంతే కాకుండా, టియాగో విజ్ ఎడిషన్ ముందు మరియు వెనుక వైపున పవర్ విండోలు, రిమోట్ సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, డిస్ల్పే మరియు 22 రకాల స్టోరేజ్ స్పేస్ వంటి ఫీచర్స్ కలవు.

టాటా టియాగో విజ్ ఎడిషన్ ఫీచర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టియాగో హ్యాచ్‌బ్యాక్ టాటా మోటార్స్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం దేశీయంగా ఉన్న లిమిటెడ్ ఎడిషన్ ట్రెండ్‌కు అనుగుణంగా పండుగ సీజన్‌ను అవకాశంగా మలుచుకుని నూతన ఫీచర్లు మరియు ఎక్ట్సీరియర్ సొబగుల జోడింపుతో విజ్ ఎడిషన్ ను అతి త్వరలో విడుదల చేయనుంది.

English summary
Read In Telugu: Tata Tiago Wizz Limited Edition Features Leaked
Story first published: Tuesday, August 29, 2017, 18:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark