టాటా విడుదల చేసిన ఆ సంచళనాత్మక కారు ధర రూ. 4,70,000లు మాత్రమే

Written By:

డ్రైవ్‌స్పార్క్ తెలుగు పాఠక మహాశయులకు శ్రీ హేవలంబినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు:

ఇండియన్ మార్కెట్లో విడుదలకు ఎంతో కాలంగా నిరీక్షించిన టిగోర్ కాంపాక్ట్ సెడాన్ స్టైల్ బ్యాక్ కారును టాటా మోటార్స్ విపణిలోకి విడుదల చేసింది. సెడాన్ మరియు కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లకు పునఃనిర్వచనమిస్తూ టాటా మోటార్స్ తమ టిగోర్ కాంపాక్ట్ సెడాన్ కారును స్టైల్ బ్యాక్ సెగ్మెంట్లోకి విడుదల చేసింది. ప్రపంచపు మొట్టమొదటి స్టైల్ బ్యాక్ కారు ఇదే. రూ. 4.7 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన టిగోర్ గురించి పూర్తి వివరాలు....

టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ విడుదల

ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో రూపొందిస్తున్న కార్లు టాటా మోటార్స్‌కు మంచి విజయాన్ని సాధించిపెడుతున్నాయి. టియాగో మరియు హెక్సా ఎస్‌యూవీలే ఇందుకు నిదర్శనం. భారీ విజయం సాధించిన టియాగో హ్యాచ్‌బ్యాక్‌కు కొనసాగింపుగా సెడాన్ సెగ్మెంట్లోకి స్టైల్ బ్యాక్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది.

టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ విడుదల

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తొలుత కైట్ 5 పేరుతో కాన్సెప్ట్‌ రూపంలో ప్రదర్శించింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా విక్రయాలకు సిద్దం చేసింది. ఇంజన్, ఫీచర్లు, ధర మరియు పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి....

డిజైన్

డిజైన్

టిగోర్ ముందు వైపు డిజైన్ టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను పోలి ఉంది. ముందు వైపు డిజైన్‌లో పొగచూరిన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ కలవు. ప్రస్తుతం కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో మరే ఇతర మోడల్‌లో కూడా పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపు గల ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ లేవు. టిగోర్‌లో మాత్రమే ఉన్నాయి.

 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

టిగోర్ ఇంటీరియర్‌లో హార్మన్ కంపెనీకి చెందిన తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎనిమిది స్పీకర్లు కలవు. ఏయుఎక్స్, యుఎస్‌బి మరియు బ్లూటూత్ కనెక్టివిటి లతో పాటు, అదనంగా స్మార్ట్ ఫోన్ ఆధారిత న్యావిగేషన్ సిస్టమ్‌ మరియు స్టీరింగ్ వీల్ ఆధారిత ఆడియో కంట్రోల్స్ కలవు.

టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ విడుదల

టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్‌లో ఎలక్ట్రానిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్, టిల్ట్ స్టీరింగ్ వీల్, డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ పవర్ విండో, డిలే ఫంక్షన్ మరియు ఇంకా ఎన్నో ఫీచర్లున్నాయి.

టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ విడుదల

టాటా టిగోర్ ఇంటీరియర్ చూడ్డానికి పూర్తిగా టియాగో ఇంటీరియర్‌నే పోలి ఉంటుంది. పూర్తి స్థాయిలో బ్లాక్ ఫినిష్ క్యాబిన్, మూడు స్పోక్స్ గల ఎలక్ట్రికల్లీ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్, సీట్లు మరియు ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే కలదు. నలుపు రంగులో ఉన్న డోర్ హ్యాండిల్స్ మరియు ఎక్ట్సీరియర్ కలర్‌లో ఉన్నఏ/సి వెంట్స్ అదే విధంగా 419లీటర్ సామర్థ్యపు స్టోరేజ్ సామర్థ్యం కలదు.

టాటా టిగోర్ కొలతలు

టాటా టిగోర్ కొలతలు

టాటా టిగోర్ కొలతల పరంగా సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి చేరింది. టిగోర్ పొడవు 3992ఎమ్ఎమ్, వెడల్పు 1677ఎమ్ఎమ్, ఎత్తు 1537ఎమ్ఎమ్, వీల్ బేస్ 2450ఎమ్ఎమ్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 170ఎమ్ఎమ్ గా ఉంది.

టిగోర్ పెట్రోల్ ఇంజన్ వివరాలు

టిగోర్ పెట్రోల్ ఇంజన్ వివరాలు

టాటా మోటార్స్ తయ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో అందించిన అదే 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 83బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

టిగోర్ డీజల్ ఇంజన్ వివరాలు

టిగోర్ డీజల్ ఇంజన్ వివరాలు

టాటా మోటార్స్ టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ కారులో 1.05-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల రివోటార్క్ డీజల్ ఇంజన్ అందించింది. ఇందులోని శక్తివంతమైన ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 69బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

వేరియంట్లు మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

వేరియంట్లు మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

టాటా తమ స్టైల్ బ్యాక్ సెడాన్ కారును ఎక్స్, ఎక్స్‌టి, ఎక్స్‌జడ్, ఎక్స్‌జడ్(ఒ) అనే వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజల్ ఇంధన ఆప్షన్లలో ఎంచుకోవచ్చు. అన్ని ఇంధన మరియు వేరియంట్లను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభించును.

పెట్రోల్ టిగోర్ వేరియంట్ల ధరలు

పెట్రోల్ టిగోర్ వేరియంట్ల ధరలు

  • ఎక్స్ఇ ధర రూ. 4,70,000 లు
  • ఎక్స్‌టి ధర రూ. 5,41,000 లు
  • ఎక్స్‌జడ్ ధర రూ. 5,90,000 లు
  • ఎక్స్‌జడ్(ఒ) ధర రూ. 6,19,000 లు

 డీజల్ టిగోర్ వేరియంట్ల ధరలు

డీజల్ టిగోర్ వేరియంట్ల ధరలు

  • ఎక్స్ఇ ధర రూ. 5,60,000 లు
  • ఎక్స్‌టి ధర రూ. 6,31,000 లు
  • ఎక్స్‌జడ్ ధర రూ. 6,80,000 లు
  • ఎక్స్‌జడ్(ఒ) ధర రూ. 7,09,000 లు
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.
టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ విడుదల

అత్యంత పోటీగా ఉన్న దేశీయ కాంపాక్ట్ సెడాన్‌లోకి టిగోర్ చేరింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఎక్సెంట్, ఫోర్డ్ ఆస్పైర్ మరియు వోక్స్‌వ్యాగన్ అమియో వంటి వాటి సరసన పోటీకి సిద్దమైంది.

సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్లు

టిగోర్ లోని ఫ్రంట్ వీల్స్‌కు డిస్క్ బ్రేకులు మరియు రియర్ వీల్స్‌కు డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. అంతే కాకుండా ఈ టిగోర్ సెడాన్‌లో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 3-పాయింట్ సీట్ బెల్ట్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, సెట్రల్ లాక్ మరియు స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఫీచర్లు ఉన్నాయి.

 
English summary
[Read In Telugu]Tata Tigor Launched In India: Launch Price, Mileage And More Details

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark