87వ జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా టిగోర్ సెడాన్

Written By:

ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమ ఇప్పుడు ఎంతగానో ఎదురుచూస్తున్న విడుదల, టాటా టిగోర్ సెడాన్. టాటా మోటార్స్‌కు అత్యంత ముఖ్యమైన ఉత్పత్తి టిగోర్ విడుదల కోసం యావత్ భారత పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అధికారిక విడుదల అతి త్వరలో ఉండగా ప్రపంచ వాహన ప్రదర్శనకు పేరుగాంచిన జెనీవా మోటార్ షో వేదిక మీద టిగోర్ సెడాన్‌ను టాటా ప్రతినిధులు ఆవిష్కరించారు.

2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా టిగోర్ ప్రదర్శన

ప్రస్తుతం టాటా లైనప్‌ జెస్ట్ కు క్రింది స్థానం నిలవనున్న టిగోర్ సెడాన్‌ను, టాటా యొక్క అత్యంత విజయవంతమైన టియాగో ప్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేయబడింది. టాటా మోటార్స్‌కు మూడవ అతి ముఖ్యమైన టిగారో సెడాన్‌ను స్టైల్ బ్యాక్ సెగ్మెంట్ పేరుతో అంతర్జాతీయ ప్రదర్శనిచ్చింది.

2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా టిగోర్ ప్రదర్శన

జెనీవా మోటార్ షో లోని ప్రత్యేక జెనీవా ఎడిషన్ మోడల్ వేదిక మీద ప్రదర్శించారు. మునుపటి టిగోర్ తరహాలోనే ఇక్కడ ప్రదర్శించిన మోడల్‌లో రెండు హెడ్ లైట్లను కలిపుతూ పోయే ఫ్రంట్ గ్రిల్ కలదు.

2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా టిగోర్ ప్రదర్శన

టిగోర్ సెడాన్ లోని వెనుక డిజైన్‌లో స్పోర్టివ్ లక్షణాలను కలిగి ఉంది. ఇందులో ఎల్ఇడి టెయిల్ లైట్లు, కూపే తరహా శైలిలో ఉన్న డిక్కీ విభాగం ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. మొత్తానికి టాటా మోటార్స్ ఈ సెడాన్‌ను స్టైల్ బ్యాక్ అనే సెగ్మెంట్ పేరుతో ఉచ్చరిస్తోంది.

2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా టిగోర్ ప్రదర్శన

టిగోర్ ఇంటీరియర్ విషయానికి వస్తే, దాదాపు టియాగో హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్‌ను పోలి ఉంది. అయితే ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫీచర్లు వచ్చాయి.

2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా టిగోర్ ప్రదర్శన

టిగారో సబ్ కాంపాక్ట్ సెడాన్‌లో 8-స్పీకర్లు గల హార్మాన్ కంపెనీకి చెందిన ఆడియో సిస్టమ్ కలదు. స్టీరింగ్ మీద అందించిన విభిన్న కంట్రోల్స్, రియర్ వ్యూవ్ కెమెరా మరియు స్మార్ట్ ఫోన్ అనుసంధానం గల కంట్రోల్స్ వంటివి వాటిని పరిచయం చేయడం జరిగింది.

2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా టిగోర్ ప్రదర్శన

87వ 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా మోటార్స్ ప్రదర్శించిన టిగోర్ సబ్ కాంపాక్ట్ సెడాన్ స్టైల్ బ్యాక్ లో 85బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ కలదు. దీనిని టియాగో హ్యాచ్‌బ్యాక్ నుండి సేకరించడం జరిగింది.

2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా టిగోర్ ప్రదర్శన

అంతే కాకుండా టిగోర్ సెడాన్ 70బిహెచ్‌పి వరకు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న 1.05-లీటర్ రివోటార్క్ మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్‌తో కూడా మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా టిగోర్ ప్రదర్శన

టిగోర్ లోని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే అవకాశం ఉంది.

2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా టిగోర్ ప్రదర్శన

పాఠకులారా! టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ టిగోర్ సబ్ కాంపాక్ట్ సెడాన్ కారును మార్చి 29, 2017 అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాబట్టి టిగోర్ విడుదల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డ్రైవ్‌స్పార్క్ తో కలిసి ఉండండి...

2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా టిగోర్ ప్రదర్శన

ప్రస్తుతం మార్కెట్ వర్గాల అంచనా మేరకు, టాటా దీనిని కేవలం 3.75 లక్షల ప్రారంభ ధరతో ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా విడుదల చేయనున్నట్లు సమాచారం. మరియు ఇది షెవర్లే వారి బీట్ ఆధారిత కాంపాక్ట్ సెడాన్ ఎసెన్షియాకు పోటీనివ్వనుంది.

2017 జెనీవా మోటార్ షో వేదిక మీద టాటా టిగోర్ ప్రదర్శన

ఇండియన్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ విడుదలతో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. మెజారిటీ అమ్మకాలతో దూసుకుపోతున్న మారుతి ఇపుడు మార్కెట్‌ను పూర్తిగా తన వశం చేసుకునేందుకు విపణిలోకి 2017 స్విఫ్ట్ అప్‌గ్రేడెడ్ మోడల్‍‌‌కు శ్రీకారం చుట్టుంది. మీకు కూడా దీని మీద ఆసక్తి పెరుగుతోందా... అయితే క్రింది గ్యాలరీలోని ఫోటోలను తప్పకుండా చూడాల్సిందే....

 
English summary
2017 Geneva Motor Show: Tata Tigor Showcased
Story first published: Wednesday, March 8, 2017, 12:42 [IST]
Please Wait while comments are loading...

Latest Photos