వరదలను సైతం లెక్కచేయని టాటా టిగోర్

Written By:

ముంబాయ్ వరదల్లో సుమారుగా ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయిన రోడ్డు మీద ఓ వ్యక్తి తన టాటా టిగోర్ కారు ద్వారా నీటి ప్రవాహాన్ని జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వరద ప్రవాహానికి కారు దాదాపు మునిగిపోయింది. అయినప్పటికి అద్బుతమైన పనితీరును కనబరచడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరింది.

ముంబాయ్ వరదల్లో టాటా టిగోర్ కారు

ముంబాయ్‌లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ దాదాపు జలమయమయ్యాయి. దాదాపు ఐదు అడుగుల వరకు వరద నీరు రోడ్లన్నింటిని ముంచెత్తింది. ఎన్నో కార్లు ఈ వరదల్లో చిక్కుకున్నాయి. చాలా మంది తమ కార్లను వరదల్లోనే వదిలేసి ప్రాణాలు దగ్గించుకున్నారు.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
ముంబాయ్ వరదల్లో టాటా టిగోర్ కారు

అయితే టాటా టిగోర్ కారులో వరదలో చిక్కుకొన్న ఓ వ్యక్తి మాత్రం మాత్రం అధైర్యపడకుండా కారును అలాగే ముందుకుపోనిచ్చి, తీవ్ర ప్రవాహం ఉన్న ఐదు అడుగుల వరద నుండి బయటకు వచ్చేశాడు.

ముంబాయ్ వరదల్లో టాటా టిగోర్ కారు

భారీ వరదను దాటడానికి ఎవరూ సాహసించలేదు, అయితే టాటా టిగోర్ కారును నడుపుతున్న వ్యక్తి కారును నమ్ముకుని ముందుకు వచ్చాడు. ఒకానొక దశలో వరద నీరు కారు మొత్తాన్ని ముంచేసింది. అయితే, తాను నమ్మినట్లుగానే వరదను ఎదురించి ప్రవాహాన్ని దాటేసింది.

ముంబాయ్ వరదల్లో టాటా టిగోర్ కారు

టాటా టిగోర్ కారు అంత లోతులో కూడా అద్బుతమైన పనితీరును ప్రదర్శించింది. వరద నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో, కారు మొత్తం మునిగిపోయినప్పటకీ అక్కడ నుండి బయటపడేందుకు కారు చాలా చక్కటి పనితీరును కనబరిచింది.

ముంబాయ్ వరదల్లో టాటా టిగోర్ కారు

టాటా టిగోర్ వరదను ఎదురించి ముందుకు వచ్చాక, టయోటా ఎటియోస్ సెడాన్ కారును దాటుకుని ముందుకెళ్లిపోయింది. నిజానికి టిగోర్ తో పోల్చితే ఎటియోస్ కారులోని శక్తివంతమైన ఇంజన్ కలదు, కానీ వరదలో ముందుకెళ్లే నమ్మకం లేకపోవడంతో ఎటియోస్ డ్రైవర్ అక్కడే నిలిపివేసాడు.

టాటా కార్లు అత్యుత్తమ నాణ్యతకు మరియు శక్తివంతమైన ఇంజన్ పనితీరుకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇందుకు ఈ కథనంలోని వీడియోనే నిదర్శనం. టిగోర్ కారు ఐదు అడుగుల వరద నీటిలో, దాదాపు మునిగిపోయినప్పటికీ బయటకు వచ్చింది. ఎటియోస్‌తో పోల్చుకుంటే టిగోర్ శక్తివంతమైనదని వీడియో తీసిన స్థానికులు విమర్శించారు.

ముంబాయ్ వరదల్లో టాటా టిగోర్ కారు

టాటా మోటార్స్ గత ఏడాది విపణిలోకి ప్రవేశపెట్టిన టియాగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో ఈ యేడు టిగోర్ సెడాన్ కారును విడుదల చేసింది. ఇందులో శక్తివంతమైన పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి.

ముంబాయ్ వరదల్లో టాటా టిగోర్ కారు

టాటా టిగోర్‌లోని 1.2-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 85బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 1.05-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ 70బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించును.

English summary
Read In Telugu: Tata Tigor Through Mumbai Floods
Story first published: Friday, September 1, 2017, 14:56 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark