టాటా టిగోర్ ఎక్స్ఎమ్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్ల కోసం...

Written By:

టాటా మోటార్స్ టిగోర్ కాంపాక్ట్ సెడాన్‌ను కారును ఎక్స్ఎమ్(XM) వేరియంట్లో విడుదల చేసింది. టాటా టిగోర్ ఎక్స్ఎమ్ కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ వెర్షన్ ధర రూ. 4.99 లక్షలు మరియు టిగోర్ ఎక్స్ఎమ్ వేరియంట్ డీజల్ వెర్షన్ ధర రూ. 5.80 లక్షలు, రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

టాటా టిగోర్ ఎక్స్ఎమ్ విడుదల

ప్రస్తుతం టాటా టిగోర్‌లో ఉన్న ఎక్స్ఇ మరియు ఎక్స్‌టి వేరియంట్ల మధ్య స్థానాన్ని ఈ ఎక్స్ఎమ్ వేరియంట్ భర్తీ చేయనుంది. టాటా మోటార్స్ టిగోర్ ఎక్స్ఎమ్ వేరియంట్లో తొమ్మిది అతి ముఖ్యమైన ఫీచర్లను అందించింది.

టాటా టిగోర్ ఎక్స్ఎమ్ విడుదల

టాటా టిగోర్ బేస్ వేరియంట్‌కు పై స్థానంలో నిలవనున్న ఎక్స్ఎమ్ వేరియంట్ టిగోర్, కీ ద్వారా మ్యాన్యువల్ సెంట్రల్ లాకింగ్, నాలుగు డోర్లకు పవర్ విండోలు, ఫాలో మి హోం ల్యాంప్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్, ఎల్ఇడి ఫ్యూయల్ గేజ్, ఫ్యాబ్రిక్ సీట్లు మరియు అప్‌హోల్‌స్ట్రే‌తో పాటు థియేటర్ డిమ్మింగ్ ఇంటీరియర్ లైట్లు మరియు ఫుల్ వీల్ కవర్స్ ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Tata Tiago XTA AMT Variant Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టాటా టిగోర్ ఎక్స్ఎమ్ విడుదల

టాటా టిగోర్ ఎక్స్ఎమ్ ఇంటీరియర్‌లో హార్మన్ కంపెనీ వారి ఎనిమిది స్పీకర్ల జోడింపుతో ఉన్న కనెక్ట్‌‌నెక్ట్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ ఆరు విభిన్న రంగుల్లో లభించును. అవి,

  • కాపర్ డాజిల్,
  • ఎస్‌ప్రెస్సో బ్రౌన్,
  • పియర్ల్‌సెంట్ వైట్,
  • ప్లాటినమ్ సిల్వర్,
  • స్ట్రైకర్ బ్లూ మరియు
  • బెర్రీ రెడ్
టాటా టిగోర్ ఎక్స్ఎమ్ విడుదల

టాటా టిగోర్ ఎక్స్ఎమ్ సెడాన్ సాంకేతికంగా పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఇందులో 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.-లీటర్ పెట్రోల్ అదే విధంగా 69బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.05-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. రెండు ఇంజన్ వేరియంట్లు కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి.

టాటా టిగోర్ ఎక్స్ఎమ్ విడుదల

సరికొత్త టిగోర్ ఎక్స్ఎమ్ వేరియంట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టాటా మోటార్స్ విక్రయ కేంద్రాలలో సెప్టెంబర్ 15, 2017 నుండి తొలి విడతగా అందుబాటులో ఉంచనుంది.

టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు హోండా అమేజ్ కార్లతో పోటిపడుతోంది.

టాటా టిగోర్ ఎక్స్ఎమ్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమైనందున టాటా మోటార్స్ తమ టిగోర్ కాంపాక్ట్ సెడాన్ కారును మరో కొత్త వేరియంట్లో విడుదల చేసింది. టిగోర్ బేస్ వేరియంట్ ఎక్స్ఇ కన్నా ఒక మెట్టు పై స్థానంలో ఇది నిలిచింది.

డ్రైవ్‌స్పార్క్ ఇదివరకే టాటా టిగోర్ సెడాన్‍కు టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. పూర్తి స్థాయి డ్రైవింగ్ అనుభవం టిగోర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూలో....

టాటా టిగోర్ ఎక్స్ఎమ్ విడుదల

టాటా మోటార్స్ తమ మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్‌ను వచ్చే సెప్టెంబర్ 21, 2017 న ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. తాజా ఆటోమొబైల్ వార్తల కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు...

English summary
Read In Telugu: Tata Tigor XM Launched In India; Prices Start At Rs 4.99 Lakh
Story first published: Saturday, September 9, 2017, 17:43 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark