2017 లో మొదటి విడుదలకు సిద్దమైన టాటా మోటార్స్
టాటా మోటార్స్ నూతన ఏడాది వేదికగా తమ మొదటి ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది. 2017 జనవరి లోని మొదటి వారంలో జెనాన్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేయడానికి అన్ని విధాలుగా సమాయత్తమౌతోంది.
భారత దేశపు దిగ్గజ అగ్రగామి విభిన్న వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి నూతన ఏడాది వేదికగా మొదటి ఉత్పత్తిని విడుదల చేయడానికి సిద్దమవుతోంది. జనవరి 3, 2017 న తమ జెనాన్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయనుంది.

టాటా మోటార్స్ ఈ జెనాన్ వాహనాన్ని జెనాన్ యోధా పేరుతో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేసే ఆలోచనలో ఉంది. ముంబాయ్ వేదికగా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ డివిజన్ అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో దీనిని విడుదల చేయనున్నారు.

జెనాన్ యోధా పేస్‌లిఫ్ట్‌కు సంభందించిన ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్ వేదిక మీద సందడి చేసాయి.

సరికొత్త జెనాన్ యోధా స్పోర్ట్ వాహనానికి ముందు వైపున రీ డిజైన్ చేయబడిన బంపర్, సరికొత్త క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ఈ యుటిలిటి వాహనం యొక్క వెనుక భాగంలో అధునాతన టెయిల్ ల్యాంప్ క్లస్టర్ కలదు.

ఇంటీరియర్ విషయానికి వస్తే చాలా తక్కువ మార్పులకు గురయ్యే అవకాశం ఉంది. అయితే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్వల్ప అప్‌డేట్స్‌తో రానుంది.

సాంకేతికంగా టాటా జెనాన్ యోధా అదే 2.2-లీటర్ సామర్థ్యం గల వారికోర్400 డీజల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

టాటా మోటార్స్ ఇదే శక్తివంతమైన వారికోర్400 డీజల్ ఇంజన్‌ను టాటా అప్ కమింగ్ ఎస్‌యువి హెక్సా మరియు ఇప్పటికే అందుబాటులో ఉన్న సఫారీ స్టార్మ్ లలో అందించింది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది. అంతే కాకుండా ఇది ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా వచ్చే అవకాశం ఉంది.

జెనాన్ ఫేస్‌లిఫ్ట్ సాధారణ జెనాన్ కంటే 20,000 నుండి 30,000 రుపాయల అదనపు ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ప్రారంభ వేరియంట్ ధర సుమారుగా రూ. 9.96 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా అవకాశం ఉంది.

భారీగా పెరిగిన ఇంధన ధరలు: నూతన సంవత్సరంలో మొదటిరోజే పెట్రో బాధుడు


Click it and Unblock the Notifications