టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు విడుదల: అమెరికాలో దీని ధర 22.45 లక్షలు మాత్రమే

Written By:

టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అత్యంత సరసమైన మోడల్ 3 కారును 35,000 అమెరికన్ డాలర్ల ధరతో విడుదల చేసింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ. 22.45 లక్షలుగా ఉంది.

టెస్లా మోడల్ 3 విడుదల

మెడల్ 3 కారును చిన్నగా, సింపుల్‌గా మరియు అత్యంత సరసమైన ధరతోనే అందుబాటులోకి తెచ్చినట్లు టెస్లా తెలిపింది. ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో భారీ సంఖ్యలో మోడల్ 3 కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం టెస్లాకు కలదు.

Recommended Video - Watch Now!
2017 Mercedes New GLA Launch In Telugu - DriveSpark తెలుగు
టెస్లా మోడల్ 3 విడుదల

టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారులోని సాంకేతిక వివరాలు...

టెస్లా మోడల్ 3 లో 220 మైళ్ల (335కిలోమీటర్ల) పరిధి మేర ప్రయాణించే బ్యాటరీని అందించింది. అయితే మోడల్ 3 లో అధిక దూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్న వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 500కిలోమీటర్లు ప్రయాణించే మోడల్ 3 కారు ధరను 28.22 లక్షలు(44 వేల డాలర్లు)గా నిర్ణయించింది.

టెస్లా మోడల్ 3 విడుదల

టెస్లా మోడల్ 3 లోని స్టాండర్డ్ బ్యాటరీ వేరియంట్ కేవలం 5.6 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 210కిలోమీటర్లుగా ఉంది. 500కిలోమీటర్ల రేంజ్ గల మోడల్ 3 కేవలం 5.1 సెకండ్ల వ్యవధిలో 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 225కిలోమీటర్లుగా ఉంది.

టెస్లా మోడల్ 3 విడుదల

టెస్లా మోడల్ 3 కొలతలు మరియు స్పెసిఫికేషన్స్

టెస్లా మోడల్ 3 పొడవు 4,694ఎమ్ఎమ్, వెడల్పు 1,849ఎమ్ఎమ్, ఎత్తు 1,443ఎమ్ఎమ్, వీల్ బేస్ 2,875ఎమ్ఎమ్‌గా ఉంది మరియు దీని బరువు 1,610కిలోలుగా ఉంది. టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు 1,475కిలోల బరువున్న బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్‌కు పోటీనిస్తుంది.

టెస్లా మోడల్ 3 విడుదల

టెస్లా మోడల్ 3 లో ఎలక్ట్రిక్ మోటార్లు ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు అందుతుంది. రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో మాత్రమే మోడల్ 3 లభిస్తోంది. అయితే ఆల్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేస్తున్నట్లు టెస్లా ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది.

టెస్లా మోడల్ 3 విడుదల

టెస్లా మోడల్ 3 లోని ఫీచర్లు

మోడల్ 3 కారులో ప్రాథమిక ఫీచర్లనే అందించింది. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, 15.4-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వై-ఫై ఇంటర్నెట్ కనెక్టివిటి, స్మార్ట్ ఫోన్ లేదా కార్డ్ స్టైల్ కీ ద్వారా కీ లెస్ ఎంట్రీ, వాయిస్ ఆధారిత కంట్రోల్స్ మరియు సెన్సార్లతో పాటు అటానమస్ డ్రైవింగ్ వ్యవస్థ కూడా కలదు.

టెస్లా మోడల్ 3 విడుదల

ఐదు వేల డాలర్లు(3.20 లక్షలు) వెచ్చించి ప్రీమియమ్ ప్యాక్ ద్వారా మోడల్ 3 కారులోని స్పెసిఫికేషన్లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రీమియమ్ ప్యాక్ ద్వారా క్యాబిన్‌లో వుడ్-వెనీర్ డ్యాష్ బోర్డ్, 12-రకాలుగా ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకునే సీట్లు, 12-స్పీకర్లు మ్యూజిక్ సిస్టమ్, హీటెడ్ రియర్ సీట్స్ మరియు రెండు ఇండక్టివ్ ఫోన్ ఛార్జర్లు ఉన్నాయి.

టెస్లా మోడల్ 3 విడుదల

ఐదు వేల డాలర్లు(3.20 లక్షలు) వెచ్చించి ప్రీమియమ్ ప్యాక్ ద్వారా మోడల్ 3 కారులోని స్పెసిఫికేషన్లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రీమియమ్ ప్యాక్ ద్వారా క్యాబిన్‌లో వుడ్-వెనీర్ డ్యాష్ బోర్డ్, 12-రకాలుగా ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకునే సీట్లు, 12-స్పీకర్లు మ్యూజిక్ సిస్టమ్, హీటెడ్ రియర్ సీట్స్ మరియు రెండు ఇండక్టివ్ ఫోన్ ఛార్జర్లు ఉన్నాయి.

టెస్లా మోడల్ 3 విడుదల

టెస్లా మోడల్ 3 హార్డ్‌వేర్‌లో ఎనిమిది కెమెరాలు, 12 అల్ట్రాసోనిక్ సెన్సార్లు మరియు ముందు వైపు రాడార్లు మరియు వీటన్నింటి నుండి వచ్చే డాటాను ప్రాసెస్ చేసే వ్యవస్థ కలదు. ఏదేమైనప్పటికీ ఆటోపైలట్ ఫీచర్ కోసం 5,000 డాలర్లు అదనంగా చెల్లించాలి మరియు పూర్తి స్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్ కోసం అదనంగా మరో 3,000 డాలర్లు వెచ్చించాలి.

టెస్లా మోడల్ 3 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తయ్యే శకానికి టెస్లా సంస్థ తమ మోడల్ 3 కారుతో విడుదలతో నాంది పలికిందని చెప్పవచ్చు. కేవలం 35,000 డాలర్ల ధరతో విడుదలైన మోడల్ 3 ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో సంచలనాలు సృష్టించడం ఖాయం!

English summary
Read In Telugu: tesla-model-3-launched-price-specifications
Story first published: Saturday, July 29, 2017, 17:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark