టయోటా సి-హెచ్ఆర్ ఇండియాకు పర్ఫెక్ట్ ఎస్‌యూవీ

Written By:

టయోటా సి-హెచ్ఆర్ ఇప్పుడు ఇండియాలో పెద్ద న్యూస్‌గా సంచలనం సృష్టించనుంది. జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ దీనిని ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.సి-హెచ్ఆర్ కు నిర్వహించిన ప్రత్యేక క్రాష్ పరీక్షల్లో ఐదుకు గాను ఐదు స్టార్ల రేటింగ్ పొందింది.

టయోటా సి-హెచ్ఆర్ ఎస్‌యూవీ

ఆస్ట్రేలియన్ న్యూ కార్ అస్సెస్‌మెంట్ ప్రోగ్రామ్(ANCAP) నిర్వహించిన భద్రత పరీక్షల్లో టయోటా సి-హెచ్ఆర్ ఎస్‌యూవీ అన్ని అంశాల వారీగా అత్యుత్తమ రేటింగ్ పొందింది.

టయోటా సి-హెచ్ఆర్ ఎస్‌యూవీ

పెద్దల భద్రత పరంగా, 38కి గాను 33.18 పాయింట్లు, పిల్లల భద్రత పరంగా 49కి 38.03 పాట్లను సాధించింది.

టయోటా సి-హెచ్ఆర్ ఎస్‌యూవీ

టయోటా సి-హెచ్ఆర్ ఎస్‌యూవీ మీద నిర్వహించిన సేఫ్టీ అసిస్ట్ టెస్ట్‌లో సీట్ బెల్ట్ రిమైండర్, లేన్ సపోర్ట్ సిస్టమ్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఉత్తమ ఫలితాలను ఇచ్చాయి.

టయోటా సి-హెచ్ఆర్ ఎస్‌యూవీ

ఆస్ట్రేలియా స్టాండర్డ్ వేరియంట్ లోని సి-హెచ్ఆర్ ఎస్‌యూవీలో ఏడు ఎయిర్ బ్యాగులు, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ సపోర్ట్ సిస్టమ్స్, మరియు ప్రి-క్రాష్ సిస్టమ్స్ వంటివి ఇందులో ఉన్నాయి.

టయోటా సి-హెచ్ఆర్ ఎస్‌యూవీ

ఈ ఏడాది చివరిలో లేదా 2018 ప్రారంభం నాటికి ఇండియన్ మార్కెట్లోకి దీనిని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఆస్ట్రేలియన్ స్పెక్ మోడల్ నిజానికి ఇండియాకు వస్తుందా అంటే ? టయోటా భద్రత దృష్ట్యా అభివృద్ది చేసిన సి-హెచ్ఆర్ ను తప్పకుండా విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటి కార్లలో ఉండాల్సిన భద్రత ఫీచర్లను మరింత కఠినతరం చేయనుంది, కాబట్టి ఇది ఇండియా వచ్చే అవకాశం ఉంది.

టయోటా సి-హెచ్ఆర్ ఎస్‌యూవీ

టయోటా సి-హెచ్ఆర్ ఇంజన్ విశయానికి వస్తే, 114బిహెచ్‌పి పవర్ మరియు 185ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టర్బో చార్జ్‌డ్ ఇంజన్‌తో రానుంది.

టయోటా సి-హెచ్ఆర్ ఎస్‌యూవీ

ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్(సివిటి) గల ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో యురోపియన్ మార్కెట్‌కు పరిచయం కానుంది. మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్‌ను ఆప్షనల్‌గా అందివ్వనుంది.

ఆస్ట్రేలియన్ న్యూ కార్ అస్సెస్‌మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో టయోటా సి-హెచ్ఆర్ కు నిర్వహించిన క్రాష్ టెస్టును వీడియో ద్వారా వీక్షించగలరు....

టయోటా సి-హెచ్ఆర్ ఎస్‌యూవీ

ఇండియా స్పెక్ మోడల్ విషయానికి వస్తే, ఇదే పెట్రోల్‌తో పాటు డీజల్ వేరియంట్‌తో కూడా పరిచయం కానుంది. టయోటా దీనిని అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉంది. సి-హెచ్ఆర్ తాలూకు మరిన్ని ఫోటోలను వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.....

 
English summary
Toyota C-HR Scores Five Stars For Safety — The Perfect SUV For India?
Story first published: Friday, March 3, 2017, 18:23 [IST]
Please Wait while comments are loading...

Latest Photos