డిసెంబర్‌లో ఆఫర్లు... జనవరిలో ధరల పెంపు: టయోటా కార్లను కొనడానికి ఏ ఇయర్ బెస్ట్
2018 నుండి ప్రతి కారు మీద సుమారుగా 3 శాతం వరకు ధరలు పెంచే ఆలోచనలో ఉంది. ముడిసరుకు దిగుమతి మరియు పెట్టుబడి వ్యయం పెరిగిన కారణంగా ధరల పెంపు అనివార్యం కానుంది.
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ఇండియా విభాగం దేశీయంగా ఉన్న తమ కార్ల ధరలను పెంచడానికి సిద్దమైంది. జనవరి 2018 నుండి ధరల పెంపు అనంతరం కొత్త ధరలతో టయోటా ఇండియా తమ కార్లను విక్రయించనుంది.

2018 నుండి ప్రతి కారు మీద సుమారుగా 3 శాతం వరకు ధరలు పెంచే ఆలోచనలో ఉంది. ముడిసరుకు దిగుమతి మరియు పెట్టుబడి వ్యయం పెరిగిన కారణంగా ధరల పెంపు అనివార్యం కానుంది.
Recommended Video


ప్రస్తుతం టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా లైనప్‌లో ఎటియోస్ లివా, ఎటియోస్ సెడాన్, కరోలా ఆల్టిస్, క్యామ్రీ హైబ్రిడ్, ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ, ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీ, ల్యాండ్ క్రూయిజర్ రేంజ్ మరియు ప్రియస్ హైబ్రిడ్ వంటి కార్లు ఉన్నాయి.

జనవరి 2018 నుండి అమల్లోకి రానున్న 3 శాతం ధరల పెంపుతో ఎంట్రీ లెవల్ కార్లయిన ఎటియోస్ లివా మీద రూ. 16,000 లు మరియు ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ మీద గరిష్టంగా రూ. 81,000 ల వరకు ధర పెరగనుంది.

అయితే, ఈ ధరల పెంపు నుండి తప్పించుకోవాలంటే ఇందుకొక చక్కటి మార్గం ఉంది. ప్రస్తుతం టయోటా ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. టయోటా నిర్వహిస్తున్న రిమెంబర్ డిసెంబర్ క్యాంపెయిన్‌లో భాగంగా ఏదేని టయోటా కారును ఎంచుకుంటే ప్రస్తుతం ఉన్న ధర మీదే ఇంకా తగ్గింపుతో పాటు ఎన్నో ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.

100శాతం బుుణ సదుపాయం, 4.99శాతం ప్రత్యేకమైన వడ్డీ రేటు మరియు ప్రత్యేకమైన సులభ వాయిదా పద్దతిని టయోటా తమ డిసెంబర్ రిమెంబర్ క్యాంపెయిన్ ద్వారా అందిస్తోంది. ఈ డిసెంబరులో టయోటా కారును కొన్నట్లయితే, వచ్చే ఏడాది పెరగనున్న ధరల భారాన్ని తప్పించుకోవచ్చు.

ప్రస్తుతం డిసెంబర్ ఆఫర్లలో వివిధ రకాల మోడళ్ల మీద రూ. 40,000 ల నుండి రూ. 90,000 ల వరకు లాభాలను అందిస్తోంది. ప్రభుత్వం మరియు కార్పోరేట్ ఉద్యోగులకు డిసెంబర్ 31, 2017 వరకు మరెన్నో ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది.
Trending On DriveSpark Telugu:

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
2018 నుండి ధరల పెంపు చేపట్టాలని నిర్ణయం తీసుకున్న కంపెనీల్లో టయోటో మాత్రమే కాదు స్కోడా, ఇసుజు మరియు హోండా మోటార్స్ వంటి కార్ల సంస్థలు ఇప్పటికే ధరల పెంపుపై తమ నిర్ణయాన్ని వెల్లడించాయి. ఇవే కాకుండా మరికొన్ని కార్ల సంస్థలు కూడా జనవరి 2018 నుండి తమ కార్ల మీద ధరలు పెంచనుంది. కాబట్టి పెద్ద మొత్తంలో ఆదా కోరుకునేవారు ఈ డిసెంబరులోనే మీకు నచ్చిన కారును ఆఫర్ల మరియు డిస్కౌంట్లతో ఎంచుకోండి.


Click it and Unblock the Notifications








