ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ విడుదల చేసిన టయోటా: ఇంజన్, ధర, ఫీచర్లు...

టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్(Etios Cross X Edition) ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది.

By Anil

టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్(Etios Cross X Edition) ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. సరికొత్త ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 6.8 లక్షలు ఎక్స్-షోరూమ్(కలకత్తా)గా ఉన్నట్లు టయోటా ప్రతినిధులు పేర్కొన్నారు.

టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ విడుదల

టయోటా విడుదల చేసిన స్పెషల్ ఎడిషన్ ఎటియోస్ క్రాస్ ఎక్స్ హ్యాచ్‌బ్యాక్ కారులో సరికొత్త కాస్మొటిక్ అప్‌గ్రేడ్స్ మరియు ప్రధానంగా గుర్తించబడిన క్వార్ట్జ్ బ్రౌన్ బాడీ కలర్ వంటివి ఉన్నాయి.

Recommended Video

Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ విడుదల

ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్‌ కారులో ఫ్రంట్ గ్రిల్ మీద పెద్ద పరిమాణంలో ఉన్న బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, బ్లాక్ సరౌండింగ్ గల ఫాగ్ ల్యాంప్స్, బాడీ కలర్‌లో ఉన్న సైడ్ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు సి-పిలర్ మీద ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ బ్యాడ్జి అందివ్వడంతో మరింత ఆకర్షణీయంగా ఉంది.

టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ విడుదల

ఎక్ట్సీరియర్ మీద అదనంగా స్పోర్టీ అల్లాయ్ వీల్స్, బ్వాక్ రూఫ్ రెయిల్స్ మరియు క్రోమ్ ఫినిషింగ్ గల డోర్ హ్యాండిల్స్ మరియు ఇతర ఫీచర్లు ఉన్నాయి.

టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ విడుదల

ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ ఇంటీరియర్‌లో సరికొత్త బ్లాక్ థీమ్ మరియు ఫైబర్ ఫినిషింగ్‌లో ఉన్న డ్యాష్ బోర్డ్ మరియు డోర్ ప్యానెల్స్ గల ఇంటీరియర్ కలదు. ఫ్యాబ్రిక్ సీట్ కవర్లు, 6.8-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు పార్కింగ్ కెమెరా డిస్ల్పే వంటి ఫీచర్లు ఉన్నాయి.

టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ విడుదల

టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ ధరలు

  • ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ పెట్రోల్ ధర రూ. 6.79 లక్షలు
  • ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ డీజల్ ధర రూ. 8.23 లక్షలు
  • రెండు ధరలు ఎక్స్-షోరూమ్ కలకత్తాగా ఉన్నాయి.
    టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ విడుదల

    భద్రత పరంగా టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ కారులో భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, డ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఐఎస్ఒ ఫిక్స్ యాంకర్ పాయింట్లు ఉన్నాయి.

    టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ విడుదల

    ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్‌లోని 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ 79బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా ఇందులోని 1.5-పెట్రోల్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 132ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

    టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ విడుదల

    ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్‌లోని 1.4-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమవుతున్నాయి.

    టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ విడుదల

    ఏఆర్ఏఐ ప్రకారం, టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ మైలేజ్ వివరాలు

    • 1.2-లీటర్ పెట్రోల్ మైలేజ్ 18.16 కిమీ/లీ
    • 1.5-లీటర్ పెట్రోల్ మైలేజ్ 16.78కిమీ/లీ
    • 1.4-లీటర్ డీజల్ మైలేజ్ 23.59కిమీ/లీ
    • టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ విడుదల

      డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

      పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు టయోటా మోటార్స్ ఎటియోస్ క్రాస్ హ్యాచ్‌బ్యాక్‌లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ అప్‌డేట్స్ నిర్వహించి క్రాస్ ఎక్స్ ఎడిషన్‌లో విడుదల చేసింది.

      టయోటా ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్ విడుదల

      నిజానికి ఎటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్‌లో ఉన్న 1.5-లీటర్ ఇంజన్, ఎటియోస్ క్రాస్ మరియు ఎటియోస్ లివా కార్లలో కూడా ఉంది. వీటిలో డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు ఎటియోస్ క్రాస్‌కు టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. ఎటియోస్ క్రాస్‌ రివ్యూ ద్వారా పూర్తి టెస్ట్ డ్రైవ్ వివరాలు....

More from DriveSpark

Article Published On: Tuesday, September 19, 2017, 19:07 [IST]
English summary
Read In Telugu: Toyota etios cross x edition launched in india launch price specifications images
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+