బస్సు లారీ మధ్య నలిగిపోయిన ఆ కారులో అందరూ సేఫ్: ఇంతకీ అది ఏ కారో తెలుసా...?

లారీ మరియు బస్సు మద్య ఓ కారు నలిగిపోయి నుజ్జు నుజ్జుయిపోయింది. అయితే అదృష్టవశాత్తు మరియు వెహికల్ నిర్మాణ నాణ్యత కారణంగా అందరూ బ్రతికి బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు డ్పైవ్‌స్పార్క్ తెలుగ

By Anil

వెహికల్ సేఫ్టీ దాని బాడీ రూపంలోనో... అందులోని ఫీచర్ల ద్వారా కనబడదు. ప్రమాదంలో మనల్ని ఎంత వరకు రక్షించగలదో అది వెహికల్ సేఫ్టీ. పెద్ద ప్రమాదాలు జరిగినా కూడా చాలా మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇందుకు కారణం ఇండియాలో చాలా అదృష్టం అంటారు. కాని అదృష్టం మాత్రమే కాదు వెహికల్ సేఫ్టీ కూడా ఓ ప్రధానం కారణం.

టయోటా ఫార్చ్యూనర్ ప్రమాదం

ఈ కథనాన్ని నిజమని నిరూపించింది ఓ ఘోర రోడ్డు ప్రమాదం. లారీ మరియు బస్సు మద్య ఓ కారు నలిగిపోయి నుజ్జు నుజ్జుయిపోయింది. అయితే అదృష్టవశాత్తు మరియు వెహికల్ నిర్మాణ నాణ్యత కారణంగా అందరూ బ్రతికి బయటపడ్డారు. ఇంతకీ ఈ ప్రమాదం ఇక్కడ జరిగింది? ప్రమాదానికి గురైన కారు ఏదో? చూద్దాం రండి...

టయోటా ఫార్చ్యూనర్ ప్రమాదం

ట్యాంక్ తరహా నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అనగానే గుర్తొచ్చే ఎస్‌యూవీ టయోటా ఇన్నోవా ఫార్చ్యూనర్. ఈ సెగ్మెంట్లో అత్యుత్తమ విక్రయాలతో ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.

టయోటా ఫార్చ్యూనర్ ప్రమాదం

తాజాగ జరిగిన రోడ్డు ప్రమాదంలో తన నిర్మాణ నాణ్యత, సేఫ్టీ స్ట్రక్చర్, ఇండియన్ రోడ్ల మీద అత్యుత్తమ ఫుల్ సైజ్ ఎస్‌యూవీగా టయోటా ఫార్చ్యూనర్ నిరూపించుకుంది. ఈ ప్రమాదం డెహ్రాడూన్‍లో చోటు చేసుకుంది.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టయోటా ఫార్చ్యూనర్ ప్రమాదం

డెహ్రాడూన్‌లో ఆర్‌టిఎస్ బస్సును ఫాలో అవుతున్న ఫార్చ్యూనర్ వెనుక నుండి బలంగా బస్సును ఢీకొట్టింది. వేగంగా వెళుతున్న బస్సు సడెన్‌గా బ్రేకులు వేయడంతో వేగాన్ని అదుపు చేయలేని ఫార్చ్యూనర్ డ్రైవర్ ఉన్న ఫలంగా బ్రేకులు వేశాడు.

టయోటా ఫార్చ్యూనర్ ప్రమాదం

అయితే, అప్పటికే ముందు భాగం బస్సులోకి చొచ్చుకుపోయింది. అదే సమయంలో పార్చ్యూనర్‌కు వెనుక వైపున వస్తున్న కారు మరియు ట్రక్కు బ్రేకులు వేయలేకపోవడంతో అవి కూడా వచ్చి ఫార్చ్యూనర్‌ను ఢీకొన్నాయి.

Trending On DriveSpark Telugu:

టయోటా ఫార్చ్యూనర్ ప్రమాదం

నిజానికి వెనుక వస్తున్న ట్రక్కు ఫెయిల్ అయినట్లు తెలిసింది. దీంతో ముందు వెళుతున్న చిన్న హ్యాచ్‌బ్యాక్ కారును ఢీకొని డివైడర్‌ను తాకి ప్రక్కనే వస్తున్న ఫార్చ్యూనర్‌ ముందు భాగాన్ని ఢీకొట్టింది. దీంతో ఫార్చ్యూనర్‌ ముందు వెళుతున్న బస్సును బలంగా ఢీకొంది.

టయోటా ఫార్చ్యూనర్ ప్రమాదం

ఫోటోలు పరిశీలిస్తే, ట్రక్కు పరిమితికి మించిన వేగంతో ప్రయాణించినట్లు తెలుస్తోంది. మరియు ఫార్చ్యూనర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఫార్చ్యూనర్‌లో ఉన్న నలుగురు ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

టయోటా ఫార్చ్యూనర్ ప్రమాదం

ఈ ప్రమాదం నుండి చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు తప్పించుకుంది. లేకపోతే బస్సు, ట్రక్కు, చిన్న కారు మరియు ఫార్చ్యూనర్ అన్నీ కలిసి పెద్ద భీబత్సమే సృష్టించేవి. ఈ ప్రమాదంలో తీవ్రంగా నుజ్జు నుజ్జయిన ఫార్చ్యూనర్ ఇప్పుడు విక్రయాల్లో లేదు, దీని స్థానంలోకి సరికొత్త ఫార్చ్యూనర్‌ను టయోటా ప్రవేశపెట్టింది.

టయోటా ఫార్చ్యూనర్ ప్రమాదం

టయోటా సరికొత్త 7-సీటర్ కొత్త తరం ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇందులో 177బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 2.8-లీటర్ డీజల్ ఇంజన్ , 164బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు.

టయోటా ఫార్చ్యూనర్ ప్రమాదం

రెండు ఇంజన్‌లను ఆటోమేటిక్ లేదా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో ఎంచుకోవచ్చు. అన్నింటిలో రియర్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్‌గా ఉంది. అయితే, 2.8-లీటర్ డీజల్ ఇంజన్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో కూడా లభించును.

More from DriveSpark

Article Published On: Wednesday, October 18, 2017, 18:13 [IST]
English summary
Read In Telugu: Toyota Fortuner passengers survive after getting sandwiched between bus and truck
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+