విడుదలైన ఏడాది కాలంలో 85,000 ఇన్నోవా క్రిస్టాలను విక్రయించిన టయోటా
టయోటా మోటార్స్ మార్కెట్లోకి విడుదలై ఏడాదయ్యింది. అయితే ఈ కేటగిరీలో 85,000 ల యూనిట్లకు పైగా అమ్ముడుపోయి టయోటా బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.
జపాన్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ఇండియా విభాగం కేవలం 12 నెలల్లోనే 85,000 లకు పైగా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీ వాహనాలను విక్రయించింది. 43.17శాతం వృద్దిని సాధించింది.

జపాన్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ఇండియా విభాగం కేవలం 12 నెలల్లోనే 85,000 లకు పైగా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీ వాహనాలను విక్రయించింది. 43.17శాతం వృద్దిని సాధించింది.

ఇప్పుడు అనేక మంది ఇండియన్స్‌కు ఫేవరెట్ వెహికల్‌గా నిలిచింది. అంతేనా... టయోటాకు మంచి అమ్మకాలు తెచ్చిపెడుతున్న మోడల్ కూడా ఇదే. దీంతో టయోటా ఇండియా లైనప్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.

గతంలో ఉన్న ఇన్నోవా ఎమ్‌పీవీ మోడల్‌కు ప్రీమియమ్ ఫీల్ టచ్ చేస్తూ, అనేక ఫీచర్లను అందించి, లగ్జరీ మోడల్ తరహాలో భారీ ధరతో ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే టయోటా కూడా ఊహించని రీతిలో దీనికి ఆదరణ లభిస్తోంది.

టయోటా మోటార్స్ ఇన్నోవా క్రిస్టా ప్రారంభ వేరియంట్‌ను రూ. 13.83 లక్షల ఎక్స్-షోరూమ్ (ముంబాయ్) ధరతో విడుదల చేసింది.

ఇప్పుడు ఇన్నోవా క్రిస్టాకు కొనసాగింపుగా మరో నాలుగు వేరియంట్లను ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ మోడల్ క్రింద విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ. 17.79 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అవి,
- 2.7-లీటర్ పెట్రోల్,
- 2.4-లీటర్ డీజల్,
- 2.8-లీటర్ డీజల్.

సాంకేతికంగా 2.4-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్ గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 343ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

ఇందులోని మరొక డీజల్ వేరియంట్ 2.8-లీటర్ ఇంజన్ 172బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభిస్తోంది.

ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీలోని 2.7-లీటర్ పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 164బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








