టూరింగ్ స్పోర్ట్ ఇన్నోవా క్రిస్టాను విడుదలకు సిద్దం చేసిన టయోటా

Written By:

గత ఏడాది టయోటా మోటార్స్ విడుదల చేసిన ఇన్నోవా క్రిస్టా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. ఆ విజయంతో సరిపెట్టుకోని టయోటా మోటార్స్ ఇన్నోవా క్రిస్టా విజయానికి కొనసాగింపుగా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ ఎమ్‌పీవీ అభివృద్ది చేసింది. దీని విడుదల వివరాలు ఇప్పుడు వెల్లడయ్యాయి.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

టయోటా మోటార్స్ తమ సరికొత్త ఇన్నోవా క్రిస్టాను స్పెషల్ ఎడిషన్‌గా టూరింగ్ స్పోర్ట్ పేరుతో విడుదలకు సిద్దం చేసింది. దీనిని ఏప్రిల్ 2017లో విడుదల చేయనున్నట్లు ఆటోకార్ ఇండియా పేర్కొంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

టయోటా గతంలో జనవరి 2017 లో ఇండోనేషియా మార్కెట్లో ఇన్నోవా క్రిస్టా యొక్క టాప్ ఎండ్ వేరియంట్ ఆధారంగా అభివృద్ది చేసిన మోడల్‌ను వెంచురర్ పేరుతో విడుదల చేసింది. ఇందులో ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగా అధిక అప్‌డేట్స్ నిర్వహించింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ ఎడిషన్ ఎక్ట్సీరియర్ విషయానికి వస్తే, ఫ్రంట్ బంపర్, వీల్ అర్చెస్ మీద మరియు బాడీ సైడ్ స్కర్ట్స్ మీద బ్లాక్ కలర్ ప్లాస్టిక్ క్లాడింగ్ కలదు. సాధారణ క్రిస్టాతో పోల్చుకుంటే బోల్డ్ డిజైన్‌ శైలిలో ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

ఎక్ట్సీరియర్ డిజైన్‌లో క్రోమ్ సొబగులు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఫ్రంట్ గ్రిల్, సైడ్ క్లాడింగ్ మీద వెనుక వైపున కూడా క్రోమ్ పరికరాలు ఉన్నాయి. మరియు ఈ టూరింగ్ స్పోర్ట్ ఎడిషన్ ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు వైన్ రెడ్ ఎక్ట్సీరియర్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

ఇన్నోవా క్రిస్టా స్పోర్ట్ టూరింగ్ లో 16-అంగుళాల బ్లాక్ అల్లాయ్ చక్రాలు ఉన్నాయి. టైర్లు డ్యామేజ్ అవుతున్నాయని కస్టమర్ల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో ఇన్నోవా క్రిస్టాలో ఉన్న 17-అంగుళాల చక్రాలున్న వేరియంట్‌ను విపణి నుండి తొలగించింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

ప్రతి వేరియంట్‌కు అది ఏ మోడల్ అనే విషయాన్ని వాహనం వెనుక సూచిస్తారు. ఈ ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ వేరియంట్లో టాప్ ఎండ్ వేరియంట్ అని సూచిస్తూ జడ్ఎక్స్ అని ఉంది. ఇది 6-సీట్ లేఔట్లో కూడా లభిస్తోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టాలో లభిస్తున్న అవే ఇంజన్ వేరియంట్లను ఇందులో పరిచయం చేస్తున్నట్లు తెలిసింది. అయితే సరిగ్గా ఫలానా ఇంజన్ అనే విషయం టయోటా మోటార్స్ ధృవీకరించాల్సి ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

రెగ్యులర్ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీలో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ క్రిస్టాలో 164బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 2.7-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

డీజల్ ఇన్నోవా క్రిస్టాలో 2.4-లీటర్ మరియు 2.8-లీటర్ ఇంజన్ ఆప్షన్‌లలో లభించును. వీటిలో 2.4-లీటర్ ఇంజన్ గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 243ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 2.8-లీటర్ ఇంజన్ 172బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

ట్రాన్స్‌మిషన్ పరంగా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదంటే 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

ధర విషయానికి వస్తే, సాధారణ మోడళ్ల కన్నా దీని ధర స్వల్పంగా ఎక్కువ ఉండనుంది. టయోటా మోటార్స్ అధికారిక విడుదల వేదిక మీద దీని ధర వివరాలను వెల్లడించనుంది. మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాల కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌‌స్పార్క్.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

నాణ్యమైన ఉత్పత్తులకు టయోటా పేరుగాంచింది. అందుకు నిదర్శనం ఇన్నోవా క్రిస్టా మరియు సరికొత్త ఫార్చ్యూనర్ అమ్మకాలు. భారీ విక్రయాలు నమోదు చేసుకున్న ఇన్నోవా ఫార్చ్యూనర్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

 

English summary
Toyota Innova Crysta Touring Sport India Launch Date Revealed — The Perfect Innova?
Story first published: Monday, March 13, 2017, 15:20 [IST]
Please Wait while comments are loading...

Latest Photos