టయోటా ఇన్నోవా క్రిస్టా వెంచురర్ విడుదల
టయోటా మోటార్స్ ఇండోనేషియా మార్కెట్లో తమ ఇన్నోవా క్రిస్టా వెంచురర్ వాహనాన్ని విడుదల చేసింది.
జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండోనేషియా మార్కెట్లోకి ఇన్నోవా క్రిస్టా వెంచురర్ ఎమ్‌పివి ని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర ఐడిఆర్ 386.3 మిలియన్లుగా నిర్ణయించింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ. 19.69 లక్షలుగా ఉంది. అయితే దీని విడుదలకంటే ముందుగా వెంచురర్ రహస్య ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి.

ఇన్నోవా క్రిస్టా వెంచురర్ ముందు వైపున నల్లటి రంగులో ఉన్న బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, బాడీ క్లాడింగ్ మరియు ఎక్ట్సీరియర్ మీద క్రోమ్ సొబగులతో ఉన్న పరికరాలను గుర్తించవచ్చు.

ముందు వైపు డిజైన్ లో క్రోమ్ వివరణాత్మక టెయిల్ గేట్, ఎగ్జాస్ట్, రిఫ్లెక్టర్ హౌసింగ్, ఫాగ్ ల్యాంప్స్, ఎయిర్ డ్యామ్, ఫ్రంట్ స్ల్పిట్టర్, ప్రక్క వైపున బాడీకి అంటుకొని ఉన్న గుమ్మాలు, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మీద కప్పులు కలవు.

గన్ మెటల్ ఫినిషింగ్ రూపొందించబడిన నూతన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. ఇప్పుడు వెంచురర్ లోని టాప్ ఎండ్ వేరియంట్ ఇండోనేషియా మార్కెట్లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా వెంచురర్ కేవలం 6-సీటింగ్ సామర్థ్యంతో లభ్యమవుతోంది. ఈ న్యూ మోడల్ ఇంటీరియర్‌లో 4.2 అంగుళాల పరిమాణం గల టిఎఫ్‌టి మిని ఇంస్ట్రుమెంట్ డిస్ల్పే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీ లెస్ ఎంట్రీ మరియు 7-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

భద్రత పరంగా ఇన్నోవా వెంచురర్ లో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్ మరియు ఐఎస్ఒఫిక్స్ సీట్లు కలవు.

సాంకేతికంగా ఈ ఎమ్‌పివి 2.4-లీటర్ డీజల్ మరియు 2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ వేరియంట్లు కలవు. ఈ రెండు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను స్టాండర్డ్‌గా మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఆప్షనల్‌గా అందిస్తోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి ఫోటోలు.....


Click it and Unblock the Notifications








