నాలుగవ తరం ప్రియస్ హైబ్రిడ్ సెడాన్ విడుదల చేసిన టయోటా

టయోటా మోటార్స్ నాలుగవ తరానికి చెందిన ప్రియస్ హైబ్రిడ్ సెడాన్ ను విపణిలోకి విడుదల చేసింది. ధర, ఇంజన్, మైలేజ్ మరియు ఫీచర్లకు సంభందించిన పూర్తి వివరాల కోసం.

By Anil

టయోటా మోటార్స్ నాలుగవ తరానికి చెందిన 2017 ప్రియస్ హైబ్రిడ్ సెడాన్ ను దేశీయంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 38.96 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు టయోటా తెలిపింది. జడ్8 అనే వేరియంట్లో మాత్రమే ఈ 2017 ప్రియస్ అందుబాటులో ఉంది.

2017 టయోటా ప్రియస్ హైబ్రిడ్ సెడాన్

సాంకేతికంగా 2017 ప్రియస్ హైబ్రిడ్ సెడాన్‌లో 1.8-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం కలదు. ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ యొక్క అనుసంధానాన్ని హైబ్రిడ్ అని పిలుస్తారు.

2017 టయోటా ప్రియస్ హైబ్రిడ్ సెడాన్

ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సంయుక్తంగా 132బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. మరియు ఈ 2017 ప్రియస్ హైబ్రిడ్ గరిష్టంగా లీటర్‌కు 26.27 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు సివిటి గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

2017 టయోటా ప్రియస్ హైబ్రిడ్ సెడాన్

2017 టయోటా ప్రియస్ సెడాన్ టయోటా యొక్క న్యూ జనరేషన్ ఆర్కిటెక్చర్ వేదిక ఆధారంగా డిజైన్ చేయబడింది. ముందు వైపు హెడ్ ల్యాంప్ సెక్షన్ మరియు వెనుక వైపున టెయిల్ ల్యాంప్ సెక్షన్లను పదునైన రీతిలో డిజైన్ చేయడం జరిగింది.

2017 టయోటా ప్రియస్ హైబ్రిడ్ సెడాన్

ఫీచర్ల పరంగా లెథర్ అప్‌హోల్‌స్ట్రే, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10-స్పీకర్లు గల జెబిఎల్ ఆడియో సిస్టమ్, హెడ్స్ అప్ డిస్ల్పే మరియు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

2017 టయోటా ప్రియస్ హైబ్రిడ్ సెడాన్

టయోటా ఇందులో భద్రత పరంగా ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్టెబిలిటి కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లున్నాయి.

2017 టయోటా ప్రియస్ హైబ్రిడ్ సెడాన్

సరికొత్త 2017 హైబ్రిడ్ ప్రియస్ సెడాన్ ప్రస్తుతం దేశీయంగా ఉన్న హోండా అకార్డ్ హైబ్రిడ్ సెడాన్‌కు గట్టి పోటీనివ్వనుంది. సాధారణ పెట్రోల్ లేదా డీజల్ వాహనాలతో పోల్చితే హైబ్రిడ్ వాహనాలను తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి.

2017 టయోటా ప్రియస్ హైబ్రిడ్ సెడాన్

ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న హైబ్రిడ్ కార్లు

.

  • భారత్ కు క్వాడ్-కాప్టర్ ఇక ఓలా, ఉబర్ కాలం ముగిసినట్లే
  • మారుతికి అతి వృష్టిగా పరిణమించిన వితారా బ్రిజా
  • .

    మారుతి నుండి రూ. 7.85 లక్షలకు మరో లిమిటెడ్ ఎడిషన్

    2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ విడుదల: ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు

More from DriveSpark

Article Published On: Friday, February 17, 2017, 17:35 [IST]
English summary
2017 Toyota Prius Launched In India; Priced At Rs 38.96 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+