2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన టయోటా

టయోటా మోటార్ కార్పోరేషన్ తమ వియోస్ ఫేస్‌లిఫ్ట్ ను రూ. 11.76 లక్షల ప్రారంభ ధరతో నాలుగు వేరియంట్లలో విడుదల చేసింది.

By Anil

టయోటా మోటార్ కార్పోరేషన్ థాయిలాండ్ విభాగం, ఆ దేశ విపణిలోకి వియోస్ ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేసింది. నాలుగు వేరియంట్లలో విడుదల చేసిన ఈ 2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర టిహెచ్‌బి, 6,09,000 (దాదాపుగా 11.76 లక్షలు) మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర టిహెచ్‌బి, 7,89,000(దాదాపుగా రూ. 15.23 లక్షలుగా) లతో విడుదల చేసింది.

2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన టయోటా

2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ టయోటా నూతన డిజైన్ భాషలో పరిచయం అయ్యింది. రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్రోమ్ సొబగులు, నిలువుటాకారంలో ఉన్న పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఎక్కువ గాలిని గ్రహించే విధంగా ఉన్న లార్జ్ ఎయిక్ ఇంటేకర్, దీనికి ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన టయోటా

2017 వియోస్ వెనుక డిజైన్ విశయానికి వస్తే, క్రోమ్ పట్టీతో ఉన్న సరికొత్త టెయిల్ లైట్లు కలవు. ఇది మినహాయిస్తే మరే మార్పులు లేవు.

2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన టయోటా

టయోటా ఈ 2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ ఇంటీరియర్‌లో స్టాండర్డ్‌గా డ్యూయల్ టోన్ బీజి రంగులతో అలకరించింది, మరియు టాప్ ఎండ్ వేరియంట్ లో బ్లాక్ థీమ్‌ ఇంటీరియర్‌ కలదు.

2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన టయోటా

అంతే కాకుండా అప్‌డేట్ చేయబడిన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, నూతన 7-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి కూడా కలదు. క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ ఆధారిత ఆడియో కంట్రోల్స్ వంటివి ఉన్నాయి.

2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన టయోటా

సాంకేతికంగా 2017 వియోస్ సెడాన్ లో 1.5-లీటర్ సామర్థ్యం గల విటివిటి-ఐ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 106.5బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. అన్ని వేరియంట్లలో కూడా స్టాండర్డ్‌గా సివిటి గేర్‌బాక్స్ అనుసంధానం గల ట్రాన్స్‌మిషన్ కలదు.

2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన టయోటా

టయోటా మోటార్స్ ఈ 2017 వియోస్ ను 2018 నాటికి ఇండియన్ మార్కెట్లోకి కూడా విడుదల చేయాలని చూస్తోంది. ఇందు కోసం ఇప్పటికే పలుమార్లు రహస్యంగా దేశీయ రహదారుల మీద పరీక్షించింది.

2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన టయోటా

ఇది దేశీయ విపణిలోకి విడుదల అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా సిటి, మారుతి సుజుకి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి వాటికి గట్టి పోటీనివ్వనుంది.

2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన టయోటా

ఇండియన్ మార్కెట్ కోసం అభివృద్ది చేస్తున్న వియోస్ సెడాన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌ ఆప్షన్‌లు కూడా రానున్నాయి. ఇవి మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు రకాల ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానున్నాయి.

2017 వియోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన టయోటా

మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో తమ ఇగ్నిస్ క్రాసోవర్ ను విడుదల చేసింది. విడుదలయినప్పటి నుండి మంచి విక్రయాలు నమోదు చేసుకుంటోంది. మరి మీరు దీనిని కొనాలనుకుంటున్నారా....? అయితే కొనే ముందు ఓ సారి ఈ ఫోటోలను గమనించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 25, 2017, 9:00 [IST]
English summary
2017 Toyota Vios Facelift Launched In Thailand — India Launch Imminent?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+