సియాజ్, సిటి, వెర్నా కార్లకు సాటిలేని పోటీగా టయోటా యారిస్ యాటివ్
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎటియోస్ స్థానంలోకి సరికొత్త మిడ్ సైజ్ సెడాన్ కారును విడుదలకు సిద్దం చేసింది.
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎటియోస్ స్థానంలోకి సరికొత్త మిడ్ సైజ్ సెడాన్ కారును విడుదలకు సిద్దం చేసింది. మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న సిటి, సియాజ్ మరియు వెర్నా కార్లకు ఇది గట్టి పోటీనివ్వనుంది.

తాజాగా అందిన సమాచారం మేరకు, టయోటా తమ సరికొత్త యారిస్ యాటివ్ సెడాన్ కారును ఎటియోస్ స్థానాన్ని భర్తీ చేస్తూ విపణిలోకి ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. అంతే కాకుండా టయోటా అభివృద్ది చేస్తున్న సెకండ్ జనరేషన్ ఎటియోస్ కారును 2020 నాటికి విడుదల చేయనున్నట్లు తెలిసింది.

మార్కెట్లోకి తరచుగా కొన్ని కొత్త కాంపాక్ట్ సెడాన్ కార్లు విడుదలవుతుండటంతో టయోటా ఎటియోస్ కొద్ది కొద్దిగా తన ప్రాబల్యాన్ని కోల్పోతోంది. దీంతో, టయోటా ఇప్పటి వరకు ప్రవేశించని మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో సరికొత్త కారును పరిచయం చేయడానికి సిద్దమైంది.

టయోటా అంతర్జాతీయ విపణిలో ఉన్న వియోస్ సెడాన్ కారును దేశీయంగా పరిచయం చేసే అవకాశాలు లేవు. ప్రస్తుతం థాయిలాండ్‌లో అత్యంత సరసమైన సెడాన్ కారుగా అమ్ముడవుతున్న యారిస్ యాటివ్ సెడాన్ మన మార్కెట్లో ఉన్న నిస్సాన్ సన్నీ, హోండా సిటి, మారుతి సుజుకి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నా కార్లకు అత్యుత్తమ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు.

టయోటా ఇండియన్ మార్కెట్లో ఇదే ప్రణాళికను అనుసరిస్తే సెడాన్ కార్ల కొనుగోలుదారులను బాగా ఆకట్టుకోవచ్చు. యారిస్ యాటివ్ చూడానికి ఎంతో ఆకర్షణీయంగా మరియు అత్యుత్తమ ఇంటీరియర్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

థాయిలాండ్‌లో లభించే టయోటా యారిస్ యాటివ్ సెడాన్‌లో 86బిహెచ్‌పి పవర్ మరియు 108ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇందులోని శక్తివంతమైన ఇంజన్ కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టయోటా కిర్లోస్కర్ చిన్న కార్ల సెగ్మెంట్లో ఏమాత్రం రాణించలేకపోతోంది. అయితే, ఖరీదైన ఎస్‌యూవీలను విపరీతంగానే విక్రయిస్తోంది. దీంతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లో నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో భాగంగా ఆశించిన ఫలితాలను సాధించని కార్ల స్థానంలో కొత్త కార్లను విడుదల చేయాలని చూస్తోంది.

ప్రస్తుతం మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎటియోస్ సెడాన్ స్థానంలోకి యారిస్ యాటివ్ మిడ్ సైజ్ సెడాన్ కారును విడుదలకు సిద్దం చేస్తోంది. ఫ్రెష్ డిజైన్, నూతన ఇంటీరియర్ ఆఫర్లతో యారిస్ యాటివ్ ఇండియన్ కస్టమర్లను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఈ గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సులో మాతో పంచుకోండి...


Click it and Unblock the Notifications








