TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన టయోటా మోటార్స్
జపాన్ ప్యాసింజర్ కార్ల కంపెనీ టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. టయోటా వారి యారిస్ ఏటివ్ సెడాన్ ఫ్రంట్ డిజైన్‌ను పోలిన లక్షణాలతో యారిస్ హ్యాచ్‌బ్యాక్‌ను థాయిలాండ్‌లో టయోటా ఆవిష్కరించింది.
ఫ్రంట్ డిజైన్ క్రింది భాగంలో పెద్ద ఫ్రంట్ గ్రిల్, టాప్ స్పెక్ మోడల్‌లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, టయోటా వి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. యారిస్ లోని టాప్ ఎండ్ మోడల్ జి వేరియంట్లో ప్రొజెక్టర్ ఎల్ఇడి హెడ్ లైట్లు ఉన్నాయి.
యారిస్ ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రక్క డిజైన్‌లో బ్లాక్ కలర్‌లో ఉన్న బి మరియు సి-పిల్లర్లు ఉన్నాయి. దీనికి తోడుగా ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్ కలదు. టయోటా లోగో ను బాడీతో అనుసంధానం చేస్తూ, లోగో చుట్టూ బాడీ కలర్ సరౌండింగ్ కలదు.
యారిస్ ఆధారిత సెడాన్‌లో ఉన్న ఇంటీరియర్‌ను ఇది కలిగి ఉంది. అయితే, కొన్ని ఫీచర్లు ఇందులో మిస్సయ్యాయి. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రాలేదు. అయితే, ప్రీమియమ్ ఫీల్ కలిగించే ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, డిజిటల్ ఏసి ప్యానల్ మరియు స్టీరింగ్ ఆధారిత నియంత్రికలు ఉన్నాయి.


భద్రత పరంగా టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్‌లో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, స్టెబిలిటి కంట్రోల్, మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి అన్ని సేఫ్టీ ఫీచర్లు యారిస్ లభించే అన్ని వేరియంట్లలో ఉన్నాయి.
సాంకేతికంగా యారిస్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 84.8బిహెచ్‌పి పవర్ మరియు 108ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అన్ని వేరియంట్లు కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషమన్‌తో మాత్రమే లభిస్తున్నాయి. కనీసం బేస్ వేరియంట్లో కూడా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లభించలేదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఫేస్‌లిఫ్ట్‌లో వచ్చిన యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. యారిస్ ఏటివ్ సెడాన్ ఆధారంతో ఫేస్‌లిఫ్ట్ యారిస్ హ్యాచ్‌బ్యాక్‌ను టయోటా ఆవిష్కరించింది. ఇది అతి త్వరలో థాయిలాండ్ మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే, ఇండియాలో దీని విడుదల గురించి టయోటా ఎలాంటి ప్రకటన చేయలేదు.