ఉబర్ ట్యాక్సీలో ప్రయాణించడం ఎంత వరకు సేఫ్!!

Written By:

స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా క్యాబ్ రైడ్‌ను సులభంగా, సౌకర్యవంతంగా క్షణాల్లో బుక్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ వినియోగంలోకి రావడంతో టాక్సీలను బుక్ చేసుకోవడం ఇప్పుడు ఎంతో తేలికైపోయింది. ఏదేమైనప్పటికీ భాద్యతారాహిత్యమైన క్యాబ్ డ్రైవర్లు ప్రముఖ అద్దె కార్ల సంస్థల విలువలను తుంగలోకి తొక్కుతున్నారు.

తాజాగా బెంగళూరులో ఓ కస్టమర్‌కు రియల్ టైమ్‌లో నరకమేంటో చూపించారు. ఆ వివరాలు మీ కోసం...

ఉబర్ ట్యాక్సీలో ప్రయాణం

ఉబర్‌లో క్యాబ్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అలాంటి ఓ డ్రైవర్‌ మీద DriveSpark మేనేజింగ్ డైరెక్టర్ "జోబో కురువిల్లా" ఉబర్ మరియు మీడియాకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉబర్‌కు చెందిన టయోటా ఎటియోస్ కారును బుక్ చేసుకుని జర్నీ ఆరభించాడు. అయితే, బూతులు మాట్లాడుతున్న డ్రైవర్‌తో విసిగిపోయి సగంలోనే క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు.

ఉబర్ ట్యాక్సీలో ప్రయాణం

ఉబర్ డ్రైవర్ తిమ్మన్న ఫోన్‌లో మాట్లాడుతుండగా, దీనికి గురించి కురువిల్లా గారు ప్రశ్నించడంతో ఆయనను దూషించడం మొదలుపెట్టాడు. లౌడ్ స్పీకర్ ఆన్ చేసి కారు నడుపుతున్న డ్రైవర్‌ను జోబో కురువిల్లా మరో మారు ప్రశ్నించగా, డ్రైవర్ పూర్తిగా స్పందించడం మానేశాడు.

ఉబర్ ట్యాక్సీలో ప్రయాణం

క్యాబ్ డ్రైవర్‌గా విధుల్ని ప్రక్కన తీవ్ర ఇబ్బందులు కలిగించడంతో, జర్నీ స్టార్ట్ అయిన పది నిమిషాలకే ఎయిర్ పోర్ట్ నుండి కొద్ది దూరంలోనే రైడ్ క్యాన్సిల్ చేసేశాడు. ఇలాంటి, అసురక్షితమైన మరియు సౌకర్యవంతంగానీ ఇబ్బందికరమైన 7 కిలోమీటర్ల ప్రయాణానికి ఉబర్ ఛార్జ్ చేసిన మొత్తం రూ. 451 లు. కారులో నుండి బయటకొచ్చి కోపంతో కారు మరియు డ్రైవర్ ఫోటోలు తీసుకున్నాడు.

ఉబర్ ట్యాక్సీలో ప్రయాణం

డిజిటల్ మీడియాలో భాగంగా ఉన్న జోబో కురువిల్లా గారు వెంటనే ట్విట్టర్ వేదికగా ఉబర్ ఇండియాకు జరిగిన తతంగాన్ని ట్వీట్ రూపంలో పోస్ట్ చేశాడు. దీనికి ఉబర్ స్పందిస్తూ... ఉబర్ అప్లికేషన్‌లోని హెల్ప్ సెక్షన్‌లో మీ ఫిర్యాదును నమోదు చేయాలని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చింది.

ఉబర్ ట్యాక్సీలో ప్రయాణం

మీడియా భాగమైన ఒక వ్యక్తికి ఉబర్ ఇలాంటి సమాధానం ఇచ్చిందంటే, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి...? మీడియాకు చెందిన వ్యక్తి కాబట్టి ఆన్‌లైన్ మరియు సామాజిక మాధ్యమాల వేదికగా ఉబర్ ఇండియాకు డైరక్టుగా కంప్లైంట్ చేశాడు. ఇదే సందర్భంలో మన ఫ్యామిలీ ఉంటే వారికే ఇలాంటి సంఘటన ఎదురైతే వీరికి కూడా ఉబర్ ఇండియా అప్లికేషన్ ద్వారా హెల్ప్ సెక్షన్‌లో కంప్లైంట్ చేయమనే చెబుతుంది కదా...?

ఉబర్ ట్యాక్సీలో ప్రయాణం

ఇక్కడ మరో లొసుగు ఉంది. నిజానికి డ్రైవర్ పేరు తిమ్మన్న కాదు. ఉబర్ అప్లికేషన్‌లో తిమ్మన్న పేరుతో ఉన్నది ఒకరైతే, కారు నడిపింది మరొకరు. ఇద్దరూ వేర్వేరు పైనున్న ఫోటో ద్వారా తేడా గమనించవచ్చు. ఒకే పేరుతో ఇద్దరు డ్రైవర్లు కారును నడుపుతుంటే ఉబర్ ఇండియాకు ఇవేమీ పట్టడం లేదా...? ఉబర్ ఇండియా ఇలాంటి వాటిని ఎలా నివారిస్తుంది మరియు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.

ఉబర్ ట్యాక్సీలో ప్రయాణం

నిజానికి, ఈ రచ్చ అంతా ఒక వ్యక్తి గురించి కాదు. ప్రతినిత్యం కొన్ని వేల మంది ఉబర్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులు భద్రత మరియు సౌకర్యం పట్ల క్యాబులు మరియు డ్రైవర్ల మీద ఉబర్ చర్యలు తీసుకున్నట్లు ఎలాంటి దాఖలాలు లేవు. అయితే, గతంలో సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించారని కస్టమర్లు కంప్లైంట్ ఇవ్వడంతో 20 మంది డ్రైవర్ల మీద ఉబర్ వేటు వేసింది.

ఉబర్ ట్యాక్సీలో ప్రయాణం

ఈ మధ్య కాలంలో ఉబర్ నుండి ప్రయాణికుల సమాచారం హ్యాక్ అవ్వడంతో ఉబర్ హ్యాకర్లకు 100,000 డాలర్లను చెల్లించింది. ప్రపంచ దిగ్గజమైన ఉబర్ నుండి హ్యాకర్లు డాటా కొల్లగొట్టడమేంటనే సందేహాలు చాలా ఉన్నాయి. హ్యాకర్లు కోరిన డబ్బును ఉబర్ చెల్లించనప్పటికీ ప్రజల డేటా మొత్తం లీక్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

ఉబర్ ట్యాక్సీలో ప్రయాణం

అంతర్జాతీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఉబర్ సంస్థకు ఇప్పుడు ఇండియాలో కూడా కస్టమర్ల నుండి వ్యతిరేకత వస్తోంది. కొంత మంది డ్రైవర్లు అధికారికంగా ఉబర్‌తో రిజిస్టర్ చేయించుకోకుండా, కారులో ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ పబ్లిక్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి విశయమై ఇప్పటి వరకు ఎంతో మందు ఉబర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు.

ఉబర్ ట్యాక్సీలో ప్రయాణం

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మెట్రో నగరాల్లో రోజూ కొన్ని వేల మంది ప్యాసింజర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అద్దె క్యాబుల్లో ప్రయాణిస్తున్నారు. దురుసుగా ప్రవర్తించే డ్రైవర్ల వలన మహిళలు మరియు ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రపంచ దిగ్గజ సంస్థల పరువుతో పాటు ఎంతో సౌకర్యవంతమైన అప్లికేషన్లు కూడా నిరుపయోగం అని చెప్పవచ్చు.

ఉబర్ ట్యాక్సీలో ప్రయాణం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇవాల జోబో కురువిల్లా రేపు మరొకరు, ఎవరైనా సరే... ప్రశ్నించడం తప్పనిసరి. అప్పుడు నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక పేరుతో క్యాబ్ రిజిస్టర్ చేసుకోవడం, మరో పేరున్న డ్రైవర్ క్యాబ్ నడుపుకోవడం. ఏదైనా జరిగితే భాద్యులు ఎవరు. క్యాబ్ అసలు డ్రైవర్‌దా... తాత్కాలికంగా నడుపుతున్న డ్రైవర్‌దా... లేదంటే క్యాబ్ సర్వీసులు నిర్వహిస్తున్న సంస్థదా...? జరగరాని నష్టం జరిగితే ఎప్పటికైనా భాదపడాల్సింది అందులో ప్రయాణించవారే.

కాబట్టి, ఉబర్ తిమ్మన మరియు ఆయన పేరుతో కారు నడుపుతున్న వ్యక్తి మీద కఠినమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. మరియు కస్టమర్ల భద్రత పట్ల సరికొత్త పాలసీలు మెరుగైన సేవల అందించాల్సిన భాద్యత ఉబర్ సంస్థ తీసుకోవాల్సిందే.

English summary
Read In Telugu: How Safe Is Uber India? This Driver Fraud Incident Might Give You An Insight

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark