2017 లో హోండా మోటార్స్ విడుదల చేయనున్న కార్ల జాబితా

హోండా మోటార్స్ ఈ ఏడాదిలో కొన్ని కొత్త ఉత్పత్తుల విడుదలతో తమ లైనప్‌లో అందుబాటులో ఉండే మోడళ్ల సంఖ్యను పెంచుకోనుంది. హోండా నూతన కార్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, అంచనాగా విడుదల మరియు ధరల వివరాలు కోసం....

By Anil

హోండా మోటార్స్ 2017 ఏడాదిలో కొన్ని కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ప్రణాళికలను సిద్దం చేసుకుంది. టాప్ 10 కార్ల తయారీ సంస్థల జాబితాలో ఉత్తమ స్థానం సంపాదించుకునేందుకు పోరాడుతున్న హోండాకు ఈ నూతన విడుదళ్లు కొద్ది మేర కలిసిరానున్నాయి. సుజుకి మరియు హ్యుందాయ్ తరువాత దేశీయంగా మంచి విజయం సాధించిన అంతర్జాతీయ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థల్లో హోండా మోటార్స్ మూడవ స్థానంలో ఉంది.

2017 లో హోండా మోటార్స్ విడుదల చేయనున్న కొత్త కార్లు

హోండా మోటార్స్‌కు అత్యుత్తమ విక్రయాలు సాధించిపెడుతన్న మోడల్ సిటి సెడాన్. తొలిసారిగా 1997లో సిటి సెడాన్‌ను పరిచయం చేయడం జరిగింది. ఇందులో లభించే ఫీచర్లు మరియు దీని అద్వితీయమైన డిజైన్ లక్షణాలతో ప్రీమియమ్ సెడాన్ అనే ఒక కొత్త సెగ్మెంట్‌నే సృష్టించింది.

దేశీయంగా 2017 లో హోండా విడుదల చేయనున్న కొత్త కార్ల జాబితా...

హోండా డబ్ల్యూఆర్-వి

హోండా డబ్ల్యూఆర్-వి

దేశీయంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్ వృద్ది చెందుతోందనడానికి ఉత్తమ ఉదాహరణ హోండా విడుదల చేయనున్న డబ్ల్యూఆర్-వి. జపాన్ దిగ్గజం ఈ క్రాసోవర్ ప్యాసింజర్ వాహనాన్ని తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ జాజ్ ఆధారంతో రూపొందించినది. అధునాతన ఇంటీరియర్, ప్లాస్టిక్ బాడీ మరియు వీల్ ఆర్చ్ క్లాడింగ్, ముందు మరియు వెనుక వైపు బంపర్లకు ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు కలవు.

2017 లో హోండా మోటార్స్ విడుదల చేయనున్న కొత్త కార్లు

మధ్యలో అందించిన హోండా బ్యాడ్జింగ్ పేరు గుండా వెళ్లిన మందమైన క్రోమ్ స్ట్రిప్ రెండు హెడ్ ల్యాంప్స్‌ను అనుసంధానం చేస్తోంది. జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే డబ్ల్యూఆర్-వి లోని ముందు మరియు వెనుక వైపు బంపర్ అత్యంత కోణీయంగా మరింత పదునుగా తీర్చిదిద్దబడింది. ఎస్‌యూవీ థీమ్‌ను రుచింపచేసేలా జాజ్ ఇంటీరియర్‌కు సొబగులద్ది డబ్ల్యూఆర్-విలో అందించారు.

2017 లో హోండా మోటార్స్ విడుదల చేయనున్న కొత్త కార్లు

సాంకేతికంగా హోండా డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-విటిఇసి పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్ వేరియంట్లతో రానుంది.

  • విడుదల అంచనా: మార్చి 2007
  • ధర అంచనా రూ. 7 నుండి 10 లక్షల మధ్య
  • హోండా సిఆర్-వి

    హోండా సిఆర్-వి

    సిటి సెడాన్‌కు ఎంత ప్రాధాన్యత ఉందో అదే స్థాయిలో సిఆర్-వి కూడా ప్రాధాన్యతను కలిగి ఉంది. ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో సిఆర్-వి మంచి విజయాన్ని ఆనందిస్తోంది. అయితే ఇది కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. పోటీదారులతో పోల్చుకుంటే డీజల్ వేరియంట్ మైలేజ్ ఆశించిన స్థాయిలో లేనందును డీజల్ వేరియంట్ సిఆర్-వికి స్వస్తి పలకడం జరిగింది.

    2017 లో హోండా మోటార్స్ విడుదల చేయనున్న కొత్త కార్లు

    హోండా మోటార్స్ ఈ మధ్యనే కొన్ని అంతర్జాతీయ విపణుల్లో తరువాత తరం సిఆర్-వి ను విడుదల చేసింది. దీనిని ఇప్పుడు ఇండియాలో కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. సరికొత్త సిఆర్-వి పగటి పూట వెలిగే లైట్ల ఇముడింపుతో ఉన్న నూతన మరియు పదునైన హెడ్ ల్యాంప్స్, నూతన ఎల్ఇడి టెయిల్ లైట్లు మరియు మునుపటి మోడల్ ఫ్రంట్ డిజైన్ కన్నా చాలా విభిన్నంగా రానుంది.

    2017 లో హోండా మోటార్స్ విడుదల చేయనున్న కొత్త కార్లు

    హోండా తమ నూతన సిఆర్-వి లో 2.4-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లను అందించే అవకాశం ఉంది. రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటిఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే అవకాశం ఉంది.

    • విడుదల అంచనా: 2007 చివరి నాటికి
    • ధర అంచనా రూ. 20 నుండి 25 లక్షల మధ్య
    • హోండా సివిక్

      హోండా సివిక్

      సివిక్ ప్రేమికుల్లో సరికొత్త హోండా సివిక్ విడుదల మరింత ఉత్సుకతను నింపుతోంది. అత్యుద్భుతమైన పనితీరు మరియు ప్రీమియమ్ ఫీచర్లకు సివిక్ సుపరిచితం. దేశీయంగా పడల్ గేర్ షిఫ్టర్ ఫీచర్‌ను హోండా సివిక్ తొలిసారిగా పరిచయం చేయనున్న మోడల్.

      2017 లో హోండా మోటార్స్ విడుదల చేయనున్న కొత్త కార్లు

      అధునాతన సివిక్ లో పదునైన ఎల్ఇడి టెయిల్ లైట్లు, స్పోర్టివ్ శైలిలో బంపర్లు, పొడవాటి ఫ్రంట్ బ్యానెట్ మరియు ఆంగ్లపు హెచ్ ఆకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ కలదు. స్పోర్టివ్ సెడాన్ మరియు హ్యాచ్‌బ్యాక్ ప్రేమికులకు దీని విడుదల పండగే అని చెప్పాలి.

      2017 లో హోండా మోటార్స్ విడుదల చేయనున్న కొత్త కార్లు

      పనితీరులో దీనికిదే సాటి, సరికొత్త హోండా సివిక్ స్పోర్టివ్ సెడాన్ 145బిహెచ్‌పి పవర్ మరియు 210ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ అదే విధంగా 125బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌లతో రానుంది. రెండు వేరియంట్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి ట్రాన్స్‌మిషన్ వచ్చే అవకాశం ఉంది.

      • విడుదల అంచనా: 2007 మధ్య భాగానికి
      • ధర అంచనా రూ. 15 నుండి 22 లక్షల మధ్య
      • 2017 లో హోండా మోటార్స్ విడుదల చేయనున్న కొత్త కార్లు

        హోండా ఈ మధ్యనే 2017 సిటి సెడాన్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని గురించి పూర్తి వివరాలు కోసం..... 2017 హోండా సిటి నూతన ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

Most Read Articles

English summary
Upcoming Honda Cars In India In 2017 — Take Your Pick!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X