రెండు ఎస్‌యూవీలను విడుదలకు సిద్దం చేస్తున్న మహీంద్రా

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెండు కొత్త ఎస్‌యూవీలను విడుదలకు సిద్దం చేస్తోంది. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో పట్టును పెంచుకునే క్రమంలో ఈ రెండు ప్రాజెక్టులను చేపట్టినట్లు తెలిస్తోంది. మహీంద్రా నుండి రానున్న రెండు ఎస్‌యూవీల గురించి పూర్తి వివరాలు...

మహీంద్రా నుండి రెండు కొత్త ఎస్‌యూవీలు

ఇండియన్ ఎస్‌యూవీ కెటగిరీలో అన్ని సెగ్మెంట్ల వారీగా వెహికల్స్‌ను విక్రయిస్తోంది. అందుకు ఉదాహరణగా, ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ మహీంద్రా కెయువి100(KUV100) మరియు హై ఎండ్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500(XUV500) లను చెప్పుకోవచ్చు.

మహీంద్రా నుండి రెండు కొత్త ఎస్‌యూవీలు

మహీంద్రా నిర్ణయించిన రెండు వెహికల్స్‌లో మొదటి ఎమ్‌పీవీ(మల్టీ పర్పస్ వెహికల్). యు321 కోడ్ పేరుతో టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు టాటా హెక్సా లకు పోటీగా అభివృద్ది చేస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ, " రానున్న రెండేళ్లలో విపణిలోకి రెండు కొత్త ఎస్‌యూవీలను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు."

మహీంద్రా నుండి రెండు కొత్త ఎస్‌యూవీలు

"అందులో మొదటి వెహికల్‌ను యు321 కోడ్ పేరుతో రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాడు. మహీంద్రా న్యూ గ్లోబల్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా డెట్రాయిట్‌లోని దీనిని డెవలప్ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాడు."

మహీంద్రా నుండి రెండు కొత్త ఎస్‌యూవీలు

మహీంద్రా ప్రణాళిక్లలో ఉన్న మరో ఎస్‌యూవీని ఎస్ 201 కోడ్ పేరుతో శాంగ్‌యాంగ్ టివోలి ఎస్‌యూవీ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేస్తోంది. దీనిని తరువాత ఆర్థిక సవత్సరం చివరి నాటికి విపణిలోకి విడుదల చేసే అవకాశం ఉంది. "టివోలి ఎస్‌యూవీ ఆధారంగా రూపొందిస్తున్న ఎస్‌యూవీని మహీంద్రా నెక్ట్స్ ఫైనాన్షియల్ ఇయర్ చివరి నాటికి సిద్దం చేయనుందని గోయంకా తెలిపాడు."

మహీంద్రా నుండి రెండు కొత్త ఎస్‌యూవీలు

ఈ రెండు ఎస్‌యూవీలను ముందుగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే, తరువాతే డిమాండ్ ఉన్న దేశాల్లో విడుదలకు ప్లాన్ చేయనుంది. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్‌లో 8 శాతం నిలకడైన ఫలితాలు సాధిస్తోంది. గత కొన్నేళ్లుగా ఇదే తరహా ఫలితాలు నమోదు చేస్తోంది.

మహీంద్రా నుండి రెండు కొత్త ఎస్‌యూవీలు

భవిష్యత్తులో విక్రయాలు పెంచుకోవాలన్నా, మార్కెట్లో సంస్థ విలువను పెంచాలన్నా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని గట్టిగా నమ్మే దేశీయ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా ఈ రెండు వాహనాలను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది.

మహీంద్రా నుండి రెండు కొత్త ఎస్‌యూవీలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత దేశపు బెస్ట్ ఎస్‌యూవీ సెల్లింగ్ కంపెనీగా ఉన్న మహీంద్రా మారుతి సుజుకి కారణంగా తన స్థానాన్ని కోల్పోయింది. ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేసే పునరాలోచించుకుని ఉత్తమ మోడల్స్‌ను ప్రవేశపెట్టడం మహీంద్రాకు మంచిది.

English summary
Read In Telugu: Mahindra To Launch Two New Vehicles In The Next Two Years
Story first published: Tuesday, July 18, 2017, 15:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark