వోక్స్‌వ్యాగన్ పోలో టాప్ రేంజ్ పోలో హైలైన్ ప్లస్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు
సరికొత్త పోలో హైలైన్ ప్లస్ టాప్ రేంజ్ హ్యాచ్‌బ్యాక్ ఎన్నో అదనపు ఫీచర్లతో వచ్చింది. వోక్స్‌వ్యాగన్ పోలో హైలైన్ ప్లస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఇండియా) వేరియంట్ ధర రూ. 7.24 లక్షలుగా ఉంది.
వోక్స్‌వ్యాగన్ ఇండియా విపణలోకి పోలో హైలైన్ ప్లస్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. సరికొత్త పోలో హైలైన్ ప్లస్ టాప్ రేంజ్ హ్యాచ్‌బ్యాక్ ఎన్నో అదనపు ఫీచర్లతో వచ్చింది. వోక్స్‌వ్యాగన్ పోలో హైలైన్ ప్లస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఇండియా) వేరియంట్ ధర రూ. 7.24 లక్షలుగా ఉంది.

మునుపటి టాప్ ఎండ్ వేరియంట్‌తో పోల్చుకుంటే వోక్స్‌వ్యాగన్ పోలో ప్లస్ వేరియంట్లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. పోలో ప్లస్ హైలైన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో సుమారుగా రూ. 24,000 ల విలువైన అదనపు ఫీచర్లను అందించింది.
Recommended Video


వోక్స్‌వ్యాగన్ పోలో హైలైన్ ప్లస్ వేరియంట్ల ధరలు
| పోలో హైలైన్ ప్లస్ | ధర |
| పెట్రోల్ | రూ. 7.24 లక్షలు |
| డీజల్ | రూ. 8.78 లక్షలు |

వోక్స్‌వ్యాగన్ పోలో హైలైన్ ప్లస్ వేరియంట్లలోని అదనపు ఫీచర్లు
- 195/ఆర్16 కొలతల్లో ఉన్న టైర్లు గల 16-అంగుళాల అల్లాయ్ వీల్స్.
- డార్క్ థీమ్ బ్లాక్ మరియు గ్రే ఇంటీరియర్
- ఎక్స్‌క్లూజివ్ ఫ్యాబ్రిక్ మరియు లెథర్ అప్‌హోల్‌స్ట్రే
- రెయిన్ సెన్సింగ్ వైపర్లు
- ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్ వ్యూవ్ మిర్రర్
- రియర్ ఎయిర్ వెంట్స్ గల ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్

పైన పేర్కొన్న ఫీచర్లతో పాటు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులను, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటి-పించ్ పవర్ విండోస్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో ఆటో ఏ/సి, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఇతర కనెక్టివిటి ఫీచర్లు గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

సాంకేతికంగా వోక్స్‍వ్యాగన్ పోలో హైలైన్ ప్లస్ వేరియంట్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అవి, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.2-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు 1.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్.

ఇందులోని శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా, డీజల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు ఇంజన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును నిరంతరం అప్‌డేట్ చేస్తూనే ఉంది. స్వల్ప ధరల వ్యత్యాసంలోనే ఎన్నో కొత్త ఫీచర్లను అందించి, పోటీగా ఉన్న మోడళ్లను ఎదుర్కునే ప్రయత్నం చేస్తోంది. పోలో హైలైన్ ప్లస్ వేరియంట్ అడ్వాన్స్‌డ్ అండ్ అప్‌డేటెడ్ స్టైల్‌తో ఫ్రెష్‌లుక్ సొంతం చేసుకుంది.
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








