ప్రొడక్షన్ వెర్షన్ 2018 ఫోర్డ్ ఆస్పైర్‌కు తుది పరీక్షలు
ఫోర్డ్ ఇండియా ఫేస్‌లిఫ్ట్ వర్షన్ ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ కారును ఈ ఏడాది విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
ఫోర్డ్ ఇండియా ఫేస్‌లిఫ్ట్ వర్షన్ ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ కారును ఈ ఏడాది విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఫోర్డ్ ఆస్పైర్ కారును ఈ జూన్‌లోనే ఆవిష్కరిస్తున్నట్లు తెలిసింది. తాజాగా, తుది పరీక్షల్లో ఉన్న ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ ఫోటో ఒకటి ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతోంది.

టెస్ట్ నిర్వహిస్తున్న మోడల్‌ను రహస్యంగా కాకుండా, పబ్లిక్ రోడ్ల మీద పరీక్షించడంతో రియర్ డిజైన్‌లో జరిగిన మార్పులన్నీ రివీల్ అయ్యాయి. 2018 ఫోర్డ్ ఆస్పైర్ రియర్ డిజైన్‌లో అధునాతన బంపర్, ఇరువైపులా ఫాక్స్ వెంట్స్ మరియు టెయిల్ ల్యాంప్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

అయితే, ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ ఎక్ట్సీరియర్‌లోని డిక్కీ మీద, డోర్ హ్యాండిల్స్, వీల్ కవర్స్ వంటి ప్రదేశాల్లో క్రోమ్ హైలెట్స్ రాలేదు. బహుశా ఇది ఆస్పైర్ ఎంట్రీ లెవల్ వేరియంట్ కావచ్చేమోనని అనుమానం.

గతంలో రివీల్ రహస్య ఫోటోల్లో ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్‌లో నూతన ఫ్రంట్ బంపర్, అధునాతన మెష్ గ్రిల్ మరియు రీడిజైన్ చేయబడిన హెడ్ ల్యాంప్ క్లస్టర్ మరియు ఫాగ్ ల్యాంప్స్ గుర్తించడం జరిగింది.

2018 ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ కోసం ఈ ఏడాది మార్చిలో తమ గుజరాత్ ప్లాంటులో మునుపటి తరానికి చెందిన ఆస్పైర్ ప్రొడక్షన్‌ను నిలిపేసింది. కొత్త తరం ఆస్పైర్ ఉత్పత్తిని త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది.

2018 ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్‌లో సాంకేతికంగా మునుపటి 1.2-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ స్థానంలో ఫోర్డ్ ఫ్రీస్టైల్‌లో అందించిన 3-సిలిండర్ల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందించే అవకాశం ఉంది. 1.5-లీటర్ డీజల్ ఇంజన్ యథావిధిగా కొనసాగనుంది.

ఫోర్డ్ ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ సెడాన్ పూర్తి స్థాయిలో విడుదలైతే, మార్కెట్లోకి ఇటీవల విడుదలైన హోండా అమేజ్‌తో పాటు మారుతి డిజైర్, వోక్స్‌వ్యాగన్ అమియో, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు టాటా టిగోర్ వంటి మోడళ్లతో గట్టిపోటీని ఎదుర్కోనుంది.
Source: Auto Adrenalin


Click it and Unblock the Notifications








