2018 ఎడిషన్ నిస్సాన్ మైక్రా విడుదల: ధర, ఇంజన్, మైలేజ్ మరియు ఫీచర్లు

నిస్సాన్ నేడు విపణిలోకి సరికొత్త 2018 మైక్రా మరియు మైక్రా యాక్టివ్ హ్యాచ్‌బ్యాక్ కార్లను విడుదల చేసింది. పలు అధునాతన ఇంటీరియర్, సేఫ్టీ ఫీచర్లు మరియు అప్‌డేట్స్‌లో మైక్రా హ్యాచ్‌బ్యాక్ కార్లను రీలాంచ్

By Anil Kumar

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ నేడు విపణిలోకి సరికొత్త 2018 మైక్రా మరియు మైక్రా యాక్టివ్ హ్యాచ్‌బ్యాక్ కార్లను విడుదల చేసింది. పలు అధునాతన ఇంటీరియర్, సేఫ్టీ ఫీచర్లు మరియు అప్‌డేట్స్‌లో మైక్రా హ్యాచ్‌బ్యాక్ కార్లను రీలాంచ్ చేసింది.

నిస్సాన్ మైక్రా ఎడిషన్ విడుదల

అతి త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మైక్రా మరియు మైక్రా యాక్టివ్ మోడళ్లను అప్‌‌డేటెడ్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. 2018 నిస్సాన్ మైక్రా ప్రారంభం ధర రూ. 5.02 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

నిస్సాన్ మైక్రా ఎడిషన్ విడుదల

2018 ఎడిషన్ నిస్సాన్ మైక్రా టాప్ ఎండ్ వేరియంట్లో 6.2-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది మరియు మైక్రా అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ మరియు డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా వచ్చాయి.

నిస్సాన్ మైక్రా ఎడిషన్ విడుదల

అదనంగా, నిస్సాన్ మైక్రాలో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా, ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, లీడ్ మి టు కార్, ఇంటెలిజెంట్ కీ ద్వారా పుష్ బటన్-స్టార్ట్-స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

నిస్సాన్ మైక్రా ఎడిషన్ విడుదల

ఎక్ట్సీరియర్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు, చూడటానికి రెగ్యులర్ వెర్షన్ మైక్రానే పోలి ఉంటుంది. అయితే, ఇంటీయర్‌లో సీట్లు, డ్యాష్‌బోర్డ్ మరియు ఆర్మ్ రెస్ట్ వంటి ప్రదేశాల్లో ఆరేంజ్ కలర్ మేళవింపులు ఉన్నాయి.

నిస్సాన్ మైక్రా ఎడిషన్ విడుదల

నిస్సాన్ మైక్రా సాంకేతికంగా అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. వరుసగా, ఇవి 75బిహెచ్‌పి-104ఎన్ఎమ్ మరియు 65బిహెచ్‌పి-160ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

నిస్సాన్ మైక్రా ఎడిషన్ విడుదల

నిస్సాన్ మైక్రా పెట్రోల్ సీవీటీ గేర్‌బాక్స్ మరియు డీజల్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభిస్తోంది. మైక్రా డీజల్ మైలేజ్ 23.08 కిమీ/లీ, మైక్రా పెట్రోల్ మ్యాన్యువల్ మైలేజ్ 19.49 కిమీ/లీ అదే విధంగా పెట్రోల్ ఆటోమేటిక్ 19.34 కిమీ/లీ మైలేజ్ ఇస్తాయి (ఏఆర్ఏఐ మేరకు).

నిస్సాన్ మైక్రా ఎడిషన్ విడుదల

ఈ సందర్భంగా నిస్సాన్ ఇండియా మాట్లాడుతూ, " జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో మరియు యూరోపియన్ స్టైలింగ్ ప్యాకేజీతో మైక్రా కారును ప్రీమియం అర్బన్ హ్యాచ్‌బ్యాక్ కారుగా అత్యంత ఆకర్షణీయమైన ధరల శ్రేణిలో తీసుకొచ్చాము. అత్యుత్తమ డ్రైవింగ్ అనుభవాన్నిచ్చే సరికొత్త మైక్రా అధునాతన ఫీచర్లతో యువ కొనుగోలుదారులను ఖచ్చతంగా ఆకట్టుకుంటుందని పేర్కొంది."

నిస్సాన్ మైక్రా ఎడిషన్ విడుదల

నిస్సాన్ ఇండియా మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారును సుమారుగా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. నిస్సాన్ మైక్రా మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి అంతర్జాతీయంగా 60 లక్షలకు పైగా అమ్ముడయ్యింది.

నిస్సాన్ మైక్రా ఎడిషన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నిస్సాన్ ఇండియా విభాగం, తమ ఏకైక్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ మైక్రా కారును పలు మార్పులు చేర్పులతో 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసింది. ఇండియన్ హ్యాచ్‌బ్యాక్ కెటగిరీలో మారుతి స్విఫ్ట్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మోడళ్లు బాగా రాణిస్తున్నాయి. 2018 నిస్సాన్ మైక్రా ఈ రెండు మోడళ్ల నుండి గట్టి పోటీని ఎదుర్కోవడం ఖాయం.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Nissan Micra launched in India
Story first published: Wednesday, August 8, 2018, 18:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X