ఇప్పటి వరకు ఎన్ని టాటా నెక్సాన్ ఎస్‌యూవీలు రోడ్డెక్కాయో తెలుసా...?

Written By:
Recommended Video - Watch Now!
నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ | Tata Nexon AMT Details, Specifications - DriveSpark

టాటా మోటార్స్ ఎన్నడూ ప్రయత్నించని కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి గత ఏడాది సరికొత్త నెక్సాన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించిన నెక్సాన్ టాటాకు మంచి ఫలితాలు సాధించిపెడుతోంది. టాటా యొక్క ఫాస్టెస్ సెల్లింగ్ ఎస్‌యూవీగా నెక్సాన్ మొదటి స్థానంలో నిలిచింది.

టాటా నెక్సాన్ రికార్డ్ సేల్స్

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి 25,000 యూనిట్ల నెక్సాన్ ఎస్‌యూవీలు రోడ్డెక్కాయి. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న మారుతి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 వాహనాలకు గట్టి పోటీనిస్తోంది.

టాటా నెక్సాన్ రికార్డ్ సేల్స్

పూనేకు సమీపంలో ఉన్న రంజన్‌గావ్‌లోని టాటా మోటార్స్ మరియు ఫియట్ ఉమ్మడి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. మార్కెట్లో ఉన్న ఉతర సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోల్చుకుంటే నెక్సాన్ అత్యంత సరసమైనది.

టాటా నెక్సాన్ రికార్డ్ సేల్స్

అత్యాధునిక ఇంటీరియర్ ఫీచర్లు మరియు అద్భుతమైన ఎక్ట్సీరియర్ స్టైలింగ్‌తో నెక్సాన్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. నెక్సాన్ రాకతో వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ సేల్స్ ఓ మోస్తారుగా మందగించాయి. అమెరికా దిగ్గజం ఫోర్డ్ మరియు ఇండో-జపనీస్ సంస్థ మారుతి సుజుకి కంపెనీలకు టాటా ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది.

టాటా నెక్సాన్ రికార్డ్ సేల్స్

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వెర్షన్‌లో లభ్యమవుతోంది. ఈ రెండు ఇంజన్ ఆప్షన్ల‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. టాటా ఇటీవల జరగిన ఆటో ఎక్స్‌పో 2018లో నెక్సాన్ ఆటోమేటిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. దీనిని అతి త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ చేయనుంది.

టాటా నెక్సాన్ రికార్డ్ సేల్స్

నెక్సాన్ ఎస్‌యూవీలోని 1.2-లీటర్ కెపాసిటి గల టుర్బోఛా‌ర్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా ఇందులోని 1.5-లీటర్ కెపాసిటి గల టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా నెక్సాన్ రికార్డ్ సేల్స్

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఎన్నో క్లాస్ లీడింగ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఉన్నాయి. లగ్జరీ కార్లలో వచ్చే అత్యంత అరుదైన మరియు విభిన్న టచ్ స్క్రీన్ ప్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ డ్యాష్‌బోర్డ్ మీద ఉంది. అదే విధంగా సెంటల్ కన్సోల్ మీద స్లైడింగ్ గ్రూవ్ బాక్స్ మరియు రోటరీ డయల్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ రికార్డ్ సేల్స్

హార్మన్ కంపెనీ నుండి సేకరించిన 12-స్పీకర్ల పవర్‌ఫుల్ స్టీరియో మ్యూజిక్ సిస్టమ్, పలు రకాల డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. పోటీదారులను ఎదుర్కొనేందుకు అత్యంత చాకచక్యంగా నెక్సాన్ ధరలను నిర్ణయించారు. నెక్సాన్ ధరల శ్రేణి రూ. 5.99 లక్షల నుండి రూ. 9.62 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

టాటా నెక్సాన్ రికార్డ్ సేల్స్

కొత్త స్విఫ్ట్ మరియు పాత స్విఫ్ట్ మధ్య తేడా ఏమిటి?

మారుతి వితారా బ్రిజాతో పోల్చితే నెక్సాన్ ఎంపిక సరైనదేనా...?

English summary
Read In Telugu: 25,000 Tata Nexon compact SUVs built in India
Story first published: Wednesday, February 28, 2018, 10:54 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark