అంతర్జాతీయ ఆవిష్కరణకు సిద్దమవుతున్న కొత్త తరం హోండా బ్రియా
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ ఆగష్టు 2 నుండి 12 మధ్య ఇండోనేషియాలో జరుగుతున్న 2018 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (GIIAS) వేదికగా తమ కొత్త తరం బ్రియో హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ ఆగష్టు 2 నుండి 12 మధ్య ఇండోనేషియాలో జరుగుతున్న 2018 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (GIIAS) వేదికగా తమ కొత్త తరం బ్రియో హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించడానికి సిద్దమైంది. దీనిని తొలుత ఇండోనేషియాలో ప్రవేశపెట్టిన తరువాత ఎక్కువ పాపులారిటీ దక్కించుకున్న దక్షిణాసియా మార్కెట్లలో పరిచయం చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.

హోండా దిగ్గజానికి అత్యంత కీలకమైన ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా మరియు ఇండియాతో పాటు పలు ఇతర ఆసియన్ మార్కెట్లలో కొత్త తరం బ్రియో కారును లాంచ్ చేయాలని భావించింది.

అంతే కాకుండా బ్రియో కారుతో 2018 ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షో వేదికగా మీద ఆవిష్కరించిన బ్రియో ఆధారిత స్మాల్ ఆర్ఎస్ కాన్సెప్ట్ కారును కూడా ఇదే 2018 GIIAS ఆటో షోలో ప్రదర్శించినుంది.

ఇండియన్ రోడ్ల మీద హ్యాచ్‌బ్యాక్ కార్ల మధ్య ఉన్న పోటీతో పోల్చుకుంటే... బ్రియో ఆధారిత స్మాల్ ఆర్ఎస్ కాన్సెప్ట్ వాలుగా ఉన్న ఫ్రంట్ ప్రొఫైల్, అట్రాక్టివ్ ఫ్రంట్ గ్రిల్, పదునైన హెడ్ ల్యాంప్స్ మరియు వీటన్నింటి మధ్యలో హోండా బ్యాడ్జ్ అందించారు. పర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్‌లో అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్ మరియు విశాలమైన ఎయిర్ ఇంటేకర్ ఉన్నాయి.

ఎల్ఇడి ఫాగ్ ల్యాంప్స్ హౌసింగ్ చుట్టూ బ్లాక్ ఫినిషింగ్ ఉంది. రియర్ డిజైన్‌లో కారు వెడల్పు మొత్తాన్ని కవర్ చేస్తూ స్పోర్టివ్ స్పాయిలర్ ఉంది. అదే విధంగా విండో లైన్స్ మరియు బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న పిల్లర్లు, స్పోర్టివ్ మరియు స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

రియర్ బంపర్‍లో ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు డిఫ్యూసర్ ఉన్నాయి. హోండ్ మోటార్స్ ఈ బ్రియో హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెడితే ఇతర మోడళ్లకు గట్టి పోటీనివ్వడం ఖాయం.

స్మాల్ ఆర్ కాన్సెప్ట్ ఆధారంతో వస్తోన్న కొత్త తరం హోండా బ్రియోకు సంభందించిన సాంకేతిక వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఆగష్టు 2 నుండి 12 మధ్య జరగబోయే 2018 గైకిండ్ ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో వెల్లడించే అవకాశం ఉంది.

మరిన్ని తాజా ఆటోమొబైల్ వార్తల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి....
మీ నగరంలో పెట్రోల్ ధరలు కనుక్కోండి...
మీ నగరంలో ఇవాళ్టి డీజల్ ధరలు కనుక్కోండి...
మీకు నచ్చిన కార్లు మరియు బైకుల ఫోటోల కోసం...
మీ నగరంలో అన్ని కొత్త కార్ల ఆన్-రోడ్ మరియు ఎక్స్-షోరూమ్ ధరల కోసం...


Click it and Unblock the Notifications








