ఆడి మరియు బిఎమ్‍‌‌డబ్ల్యూ మధ్య ప్రకటనల యుద్ధం

జర్మనీకి చెందిన రెండు దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు ఆడి మరియు బిఎమ్‍‌‌డబ్ల్యూ యుఎస్ఎ కంపెనీల మధ్య ట్విట్టర్ వేదికగా ఓ చిన్నపాటి యుద్దం జరిగింది. ఇరు సంస్థల మధ్య సరాసరిగా జరిగిన మాటల యుద్దాన్ని ఫన్

By Anil Kumar

జర్మనీకి చెందిన రెండు దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు ఆడి మరియు బిఎమ్‍‌‌డబ్ల్యూ యుఎస్ఎ కంపెనీల మధ్య ట్విట్టర్ వేదికగా ఓ చిన్నపాటి యుద్దం జరిగింది. ఇరు సంస్థల మధ్య సరాసరిగా జరిగిన మాటల యుద్దాన్ని ఫన్నీ ఫైట్ అని చెప్పవచ్చు.

ఆడి మరియు బిఎమ్‍‌‌డబ్ల్యూ మధ్య ప్రకటనల యుద్ధం

కోపంగానైనా... ఫన్నీగానైనా... ట్విట్టర్ వేదికగా జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ ఈ చిన్నపాటి యుద్దం బిఎమ్‌డబ్ల్యూ మరియు ఆడి ఇరు కంపెనీల ఔత్సాహికులకు మంచి వినోదాన్ని పంచింది. అసలేం జరిగిందో చూద్దాం రండి...!!

ఆడి మరియు బిఎమ్‍‌‌డబ్ల్యూ మధ్య ప్రకటనల యుద్ధం

బిఎమ్‌డబ్ల్యూ గత వారంలో తమ F82 M4 కారు ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అద్భుతమైన ఈ ఫోటో బ్యాగ్రౌండ్‌లో నిప్పురవ్వలు మరియు ఫైర్ వర్క్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. మరియు ఈ ట్వీట్‌కు మంచి స్పందన లభించింది.

బిఎమ్‌డబ్ల్యూ అదే రోజున ఆడి ట్వీట్‌కు బదులుగా, "వెనుక వైపున అప్పుడప్పుడు చూస్తాము, కొన్ని సార్లు రియర్ వ్యూవ్ మిర్రర్‌లో ఈ రింగులు కనబడుతుంటాయి." అంటూ కౌంటర్ ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇరు కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన ట్విట్టర్ వాదన నడిచింది. ఈ రెండింటి మధ్య సాగిన సంభాషణను ఆ యా కంపెనీల ఔత్సాహికులు మరో స్థాయికి తీసుకెళ్లారు.

ఆడి మరియు బిఎమ్‍‌‌డబ్ల్యూ మధ్య ప్రకటనల యుద్ధం

ఆడి మరియు బిఎమ్‌డబ్ల్యూ ఒకరినొకరు బహిరంగంగా ఎగతాళి చేసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. మార్కెట్లో తమ గుర్తింపును చాటుకోవడానికి ఇరు కంపెనీలు కూడా పలుమార్లు ఒకదాని మీద ఒకటి విమర్శలు చేసుకున్నాయి.

ఆడి మరియు బిఎమ్‍‌‌డబ్ల్యూ మధ్య ప్రకటనల యుద్ధం

అమెరికాలోని కాలిఫోర్నియాలో గల శాంటా మోనికాలో "బిఎమ్‌డబ్ల్యూ ఇప్పుడు నీ వంతు" అని ఆడి సరికొత్త ఏ4 సెడాన్ కారు ప్రకటన బోర్డును ఏర్పాటు చేసింది. అయితే, కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఆడి ప్రకటనకు పక్కనే, "చెక్‌మేట్" అనే సమాధానంతో బిఎమ్‌డబ్ల్యూ భారీ ప్రకటన బోర్డును ఏర్పాటు చేసింది.

ఆడి మరియు బిఎమ్‍‌‌డబ్ల్యూ మధ్య ప్రకటనల యుద్ధం

అంతటి ఆగని పోరు, కొన్ని రోజులకు మరో భారీ హోర్డింగ్ ఏర్పాటు చేసేందుకు దారితీసింది. ఆడి తమ ఆర్8 సూపర్ కారు గల భారీ హోర్డింగ్‌ను బిఎమ్‌డబ్ల్యూ కంటే పెద్ద బోర్డును దాని పక్కనే ఏర్పాటు చేసి, "మీ బంటుతో మా రాజుకి పోలికేంటి" అని కౌంటర్‌ ఇచ్చింది.

ఆడి మరియు బిఎమ్‍‌‌డబ్ల్యూ మధ్య ప్రకటనల యుద్ధం

ఇరు కంపెనీల మధ్య ప్రకటనల పోరు చిలికి చిలికి గాలివానలా మారింది. ఆడి సంస్థకు సమాధానంగా, భారీ పరిమాణంలో విమానం ఆకృతిలో ఉండే గాలి బుడగ మీద బిఎమ్‌డబ్ల్యూ తమ ఫార్ములా 1 రేస్ కారును ప్రింట్ చేసి, "గేమ్ ఓవర్ (ఆట ముగిసింది)" చివరి కౌంటర్ విసిరింది.

ఆడి మరియు బిఎమ్‍‌‌డబ్ల్యూ మధ్య ప్రకటనల యుద్ధం

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

ఆడి మరియు బిఎమ్‌డబ్ల్యూ సంస్థలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ అభిమానాలు ఉన్నారు. తాజాగా జరిగిన ట్విట్టర్ సంభాషణతో సోషల్ మీడియా వేదికగా అందరి దృష్టినీ ఆకర్షించింది. రెండు జర్మన్ దిగ్గజాల మధ్య జరిగిన వాదనలు ఒకానొక దశలో తారాస్థాయికి చేరుకుని మాటల్లో వేడిని పుట్టించాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 27, 2018, 13:32 [IST]
English summary
Read In Telugu: Audi And BMW Engage In A Small Twitter Fight — Ad Wars Are Back!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+