అత్యంత సరసమైన కార్లను విడుదల చేయనున్న ఆడి ఇండియా

Written By:

ఒకాదానితో ఒకటి మిళితమై ఉన్న నాలుగు రింగుల లోగో గల ఆడి కార్లంటే ఇష్టపడని వారుండరు. సామాన్యులంతా ఆడి కార్ల గురించి కలలు కనాల్సింది తప్పిందే కొనే అవకాశాలు దాదాపు శూన్యమే. అయితే, ప్రతి సామాన్యుడి కలను నెరవేర్చడానికి ఆడి ఇండియా అత్యంత సరసమైన లగ్జరీ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది.

అత్యంత సరసమైన ఆడి కార్లు

భారత్‌లోని లగ్జరీ కార్ల పరిశ్రమలో మెర్సిడెస్ బెంజ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ కారణంగా ఆడి ఇండియా తమ అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో విపణిలో ఉన్న మోడళ్ల మార్పులు చేర్పులు మరియు నూతన ఉత్పత్తుల విడుదల మీద దృష్టిసారించింది.

అత్యంత సరసమైన ఆడి కార్లు

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, విపణిలోకి అత్యంత సరసమైన కార్లను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆడి ప్లాన్ చేస్తున్న అత్యంత సరసమైన లగ్జరీ కార్లు ఏ3 మరియు క్యూ3 కార్ల క్రింది స్థానాన్ని భర్తీ చేయనున్నాయి.

అత్యంత సరసమైన ఆడి కార్లు

ఆడి ఇండియా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం మేరకు, తమ నూతన ఉత్పత్తుల జాబితాలో ఆడి క్యూ2 క్రాసోవర్ కూడా ఉండే అవకాశం ఉంది. ఆడి తమ చీపెస్ట్ కార్లను రానున్న రెండు నుండి మూడేళ్లలోపు మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అన్ని రకాల సెగ్మెంట్ల ద్వారా అన్ని రకాల కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎస్‌యూవీ, సెడాన్ మరియు హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఒక్కో మోడల్‌ను పరిచయం చేయనుంది.

అత్యంత సరసమైన ఆడి కార్లు

ఆడి ఇండియా విభాగాధ్యక్షుడు రాహిల్ అన్సారీ మాట్లాడుతూ, "ప్రస్తుతం విపణిలో ఉన్న మోడళ్ల పర్యవేక్షణ, వాటి కొనసాగింపు మరియు నూతన ఉత్పత్తుల పరిచయం గురించి గత కొంత కాలంగా తీరిక లేకుండా ఉన్నాను. ఇప్పుడు, మార్కెట్లో ఉన్న బడ్జెట్ ప్రియులైన కస్టమర్లను ఆకట్టుకోవడానికి కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాము. అధిక సంఖ్యలో సేల్స్ ఆశిస్తుండటంతో రానున్న రెండు లేదా మూడేళ్లలోపు ఏ3 మరియు క్యూ3 కంటే క్రింది స్థాయిలో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు."

అత్యంత సరసమైన ఆడి కార్లు

పరిశ్రమ నిపుణుల అభిప్రాయం మేరకు, ఆడి భారత్‌లో తమ పూర్వ వైభవాన్ని సాధించుకోవడానికి రూ. 22 లక్షల నుండి రూ. 25 లక్షల ధరల శ్రేణిలో నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు చెబుతున్నారు. 2018 నుండి భారత్‌లోకి ప్రతి ఏడాది కొత్త మోడళ్లను విడుదల చేసి రెండంకెల వృద్దిని సాధించే లక్ష్యంతో ఉన్నట్లు అన్సారీ పేర్కొన్నాడు.

అత్యంత సరసమైన ఆడి కార్లు

ఆడి క్యూ2 విషయానికి వస్తే, క్యూ2 క్రాసోవర్ నాలుగు మీటర్ల కంటే కొంచెం ఎక్కువ పొడవు ఉంటుంది. ఇందులో సింగిల్ ఫ్రేమ్ ఆక్టాగోనల్ గ్రిల్ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో సులభంగా డ్రైవ్ చేయడానికి అనువైన కొలతల్లో క్యూ2 కారును నిర్మించనున్నారు.

అత్యంత సరసమైన ఆడి కార్లు

సాంకేతికంగా ఆడి క్యూ2 క్రాసోవర్ కారులో రెండు రకాలుగా పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేసే 2-.లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ రానుంది. అన్ని రకాల కస్టమర్లను ఆకట్టుకోవడానికి క్యూ2 క్రాసోవర్‌లో పెట్రోల్ ఇంజన్ కూడా పరిచయం చేయనుంది. ట్రాన్స్‌మిషన్ పరంగా 7-స్పీడ్ ఎస్-ట్రోనిక్ గేర్‌బాక్స్ రానుంది.

అత్యంత సరసమైన ఆడి కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆడి అంటే లగ్జరీ కార్లకు పెట్టింది పేరు. అలాంటిది, మెర్సిడెస్ బెంజ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ నుండి వస్తున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు అత్యంత సరసమైన కార్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. లగ్జరీ మరియు సేఫ్టీ పరంగా రాజీపడని ఫీచర్లతో అత్యుత్తమ నిర్మాణ నాణ్యతో రూ. 30 లక్షల ధరల శ్రేణిలో ఆడి తమ కొత్త కార్లను విపణిలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఆడి నుండి అత్యంత సరసమైన కార్లు

1.హ్యుందాయ్ క్రెటాకు పోటీని సిద్దం చేసిన మహీంద్రా

2.టాటా హెచ్5ఎక్స్‌ ఎస్‌యూవీకి మళ్లీ రహదారి పరీక్షలు: విడుదలకు సర్వం సిద్దం

3.హీరో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకు విడుదల ఖరారు

4.ఫార్చ్యూనర్ మరియు ఎండీవర్‌లకు పోటీగా మహీంద్రా సిద్దం చేసిన ఎస్‌యూవీ

5.2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ రివ్యూ: 42 ఏళ్లుగా కొనసాగుతున్న రాజసం

Read more on: #audi #ఆడి
English summary
Read In Telugu: Audi To Launch Affordable Cars In India — To be Slotted Below A3 And Q3

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark