ఆడి క్యూ3 మరియు క్యూ7 డిజైన్ ఎడిషన్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ప్రత్యేకతలు

ఆడి ఇండియా విపణిలోకి రెండు లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీలను లాంచ్ చేసింది. క్యూ3 మరియు క్యూ7 ఎస్‌యూవీలను డిజైన్ ఎడిషన్‌లో విడుదల చేసి, ఇండియాలో తమ ఎస్‌యూవీల పరిధిని విస్తరించుకుంది.

By Anil Kumar

ఆడి క్యూ3 డిజైన్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 40.76 లక్షలు మరియు క్యూ7 డిజైన్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 82.37 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి. రెండు ఎస్‌యూవీల ఎక్ట్సీరియర్ డిజైన్‌లో పలు కాస్మొటిక్ మార్పులు చోటు చేసుకున్నాయి.

ఆడి క్యూ3 మరియు క్యూ7 డిజైన్ ఎడిషన్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ప్రత్యేకతలు

ఆడి క్యూ3 డిజైన్ ఎడిషన్‌లో ఫుల్ పెయింట్ ఫినిష్, రియర్ క్రిస్టల్ క్లియర్ టెయిల్ ల్యాంప్స్, క్వాట్రో ఎట్రీ లైట్లు, కీ కవర్ మ్యాచింగ్ కార్ బాడీ కలర్, నప్పా లెథర్ అప్‌హోల్‌స్ట్ర మరియు కోట్ హ్యాంగర్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

ఆడి క్యూ3 మరియు క్యూ7 డిజైన్ ఎడిషన్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ప్రత్యేకతలు

ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్‌ ఎస్‌యూవీలో కూడా అవే ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆడి కూల్ బ్యాగ్, డి-పిల్లర్ మీద ఆడి లోగో మరియు డార్క్ టింటెడ్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

ఆడి క్యూ3 మరియు క్యూ7 డిజైన్ ఎడిషన్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ప్రత్యేకతలు

ఈ సందర్భంగా ఆడి ఇండియా అధిపతి రాహిల్ అన్సారీ మాట్లాడుతూ, "సరికొత్త ఆడి క్యూ3 మరియు క్యూ7 డిజైన్ ఎడిషన్ విడుదలతో పాటు ఈ ఏడాదిలో ఇప్పటికే పలు విభిన్న మోడళ్లు విడుదలయ్యాయి. కస్టమర్లకు ఎప్పటికప్పుడు నూతన మరియు విభిన్న మోడళ్లను అందుబాటులో ఉంచే ఉద్దేశ్యంతో కొత్త ఉత్పత్తలును విడుదల చేస్తున్నట్లు చొప్పుకొచ్చాడు."

ఆడి క్యూ3 మరియు క్యూ7 డిజైన్ ఎడిషన్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ప్రత్యేకతలు

ఆడి క్యూ3 డిజైన్ ఎడిషన్‌లో ఉన్న 2.0-లీటర్ కెపాసిటి గల టిడిఐ క్వాట్రో 184బిహెచ్‌పి పవర్ మరియు 380ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్‌కు 7-స్పీడ్ ఎస్-ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

ఆడి క్యూ3 మరియు క్యూ7 డిజైన్ ఎడిషన్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ప్రత్యేకతలు

ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్‌ రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, 40 టిఎఫ్ఎస్ఐ మరియు 45 టిడిఐ. క్యూ7 40 టిఎఫ్ఎస్ఐ వేరియంట్లోని 2.0-లీటర్ క్వాట్రో ఇంజన్ 252బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఆడి క్యూ3 మరియు క్యూ7 డిజైన్ ఎడిషన్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ప్రత్యేకతలు

అదే విధంగా ఆడి క్యూ7 45 టిడిఐ వేరియంట్లోని 3.0-లీటర్ క్వాట్రో ఇంజన్ గరిష్టంగా 249బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లకు 8-స్పీడ్ టిప్‌ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

ఆడి క్యూ3 మరియు క్యూ7 డిజైన్ ఎడిషన్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ప్రత్యేకతలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆడి ఇండియా క్యూ3 మరియు క్యూ7 ఎస్‌యూవీల పరిధిని మరింత విస్తరించింది. రెండు మోడళ్లలో కూడా నూతన ఫీచర్లు మరియు పలు కాస్మొటిక్ అప్డేట్స్ చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆడి అధీకృత డీలర్ల వద్ద ఈ డిజైన్ ఎడిషన్ ఎస్‌యూవీలను బుక్ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 18, 2018, 10:40 [IST]
English summary
Read In Telugu: Audi Q3 And Q7 Design Edition Launched In India; Prices Start At Rs 40.76 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+