ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్ ఇండియా లాంచ్ ఖరారు

ఆడి ఇండియా విభాగం ఈ ఏడాది జనవరిలో సెకండ్ జనరేషన్ క్యూ5 ఎస్‌యూవీని దేశీయ విపణిలోకి లాంచ్ చేసింది. క్యూ 5 ఎస్‌యూవీని తొలుత డీజల్ వేరియంట్లో మాత్రమే విడుదల చేసిన ఆడి ఇప్పుడు పెట్రోల్ వేరియంట్లో పరిచయం చే

By Anil Kumar

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి ఇండియా విభాగం ఈ ఏడాది జనవరిలో సెకండ్ జనరేషన్ క్యూ5 ఎస్‌యూవీని దేశీయ విపణిలోకి లాంచ్ చేసింది. క్యూ 5 ఎస్‌యూవీని తొలుత డీజల్ వేరియంట్లో మాత్రమే విడుదల చేసిన ఆడి ఇప్పుడు పెట్రోల్ వేరియంట్లో పరిచయం చేయడానికి సిద్దమైంది.

ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్‌ను జూన్ 28, 2018 న ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్ ఇండియా లాంచ్ ఖరారు

ఆడి తమ క్యూ7 ఎస్‌యూవీని గత ఏడాదే పెట్రోల్ వేరియంట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు, మరిన్ని పెట్రోల్ వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో క్యూ5 పెట్రోల్ ఎస్‌యూవీని సిద్దం చేసింది. ఈ సెకండ్ జనరేషన్ క్యూ5 మిడ్ సైజ్ ఎస్‌యూవీ 2011లో విడుదలైన ఫస్ట్ జనరేషన్ క్యూ5 స్థానాన్ని భర్తీ చేస్తుంది.

ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్ ఇండియా లాంచ్ ఖరారు

రెండవ తరానికి చెందిన క్యూ5 మిడ్ సైజ్ లగ్జరీ ఎస్‌యూవీని కంపెనీకి చెందిన ఫ్లెక్సిబుల్ ఎమ్ఎల్‌బీ ఎవో ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. మరియు మునుపటి క్యూ5తో పోల్చుకుంటే దీని బరువు సుమారుగా 100కిలోల వరకు తగ్గిపోయింది.

ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్ ఇండియా లాంచ్ ఖరారు

సరికొత్త క్యూ5 వీల్ బేస్ మరియు ఎత్తు గణనీయంగా పెరిగింది. అంతే కాకుండా ఓవరాల్ డిజైన్ అత్యంత పదునుగా ఉంది. సింగల్ ఫ్రేమ్ గ్రిల్, మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్స్ మరియు స్పోర్టివ్ బానెట్ ప్రధాన హైలెట్స్‌గా చెప్పుకోవచ్చు.

ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్ ఇండియా లాంచ్ ఖరారు

కొత్త తరం ఆడి క్యూ5 ఇంటీరియర్‌లో 12.3-అంగుళాల పరిమాణంలో ఉన్న ఆడి వర్చువల్ కాక్‌పిట్ డిస్ల్పే, 8.3-అంగుళాల పరిమాణంలో ఉన్న ఎమ్ఎమ్ఐ డిస్ల్పే, హెడ్స్‌అప్ డిస్ల్పే, వైర్ లెస్ ఛార్జింగ్ గల ఆడి ఫోన్ బాక్స్, త్రీజోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, లెథర్ అప్‌హోల్‌స్ట్రే మరియు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ లెథర్ సీట్లు ఉన్నాయి.

ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్ ఇండియా లాంచ్ ఖరారు

భద్రత పరంగా ఆడి క్యూ5 మిడ్ సైజ్ లగ్జరీ ఎస్‌యూవీలో ఎనిమిది ఎయిర్ బ్యాగులు, యాక్టివ్ లేన్ అసిస్ట్, పార్క్ అసిస్ట్, కొల్లిషన్ అవాయిడ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, రియర్ వ్యూవ్ కెమెరా గల ఆడి పార్కింగ్ సిస్టమ్ ప్లస్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్ ఇండియా లాంచ్ ఖరారు

ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్లో సాంకేతికంగా 249బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 2-లీటర్ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో మరియు ఆడి క్యాట్రో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది. అయితే, క్యూ5 పెట్రోల్ వేరియంట్ గురించి ఆడి ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఆడి క్యూ5 పెట్రోల్ వేరియంట్ ఇండియా లాంచ్ ఖరారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆడి ఇండియా ఏడాది ప్రారంభంలో సెకండ్ జనరేషన్ క్యూ5 ఎస్‌యూవీని సరికొత్త డిజైన్ శైలిలో డీజల్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. అయితే, పెట్రోల్ ప్రియుల కోసం క్యూ5 ఎస్‌యూవీని జూన్ 28 న మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఆడి క్యూ5 పెట్రోల్ వెర్షన్ విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సి, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ మరియు లెక్సస్ ఎన్ఎక్స్ 300హెచ్ మోడళ్లకు గట్టిపోటీనిస్తుంది.

Most Read Articles

Read more on: #audi #ఆడి
English summary
Read In Telugu: Audi Q5 Petrol India Launch Details Revealed
Story first published: Saturday, June 23, 2018, 13:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X