భారత్‌కు అల్ఫార్డ్ లగ్జరీ ఎమ్‌పీవీని ఖరారు చేసిన టయోటా

Written By:
Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా మోటార్స్ రేపటి నుండి ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌‌పో 2018 వేదిక మీద తమ సరికొత్త అల్ఫార్డ్ లగ్జరీ వ్యాన్ ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

టయోటా అల్ఫార్డ్ లగ్జరీ ఎమ్‌పీవీ

టయోటా కంపెనీ యొక్క అతి ముఖ్యమైన అల్ఫార్డ్ ఎమ్‌పీవీ లగ్జరీ వ్యాన్‌లో 7 మంది ప్రయాణించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులు ఈ టయోటా అల్ఫార్డ్ లగ్జరీ ఎమ్‌పీవీని బిజినెస్ ట్రిప్స్ కోసం వినియోగిస్తారు.

టయోటా అల్ఫార్డ్ లగ్జరీ ఎమ్‌పీవీ

అల్ఫార్డ్ లగ్జరీ వ్యాన్ ఆవిష్కరణతో ఇండియన్ మార్కెట్లో తమ లగ్జరీ వ్యాన్ ప్రవేశపెట్టడం పట్ల ఉన్న సానుకూలతలను అధ్యయనం చేయనుంది. టయోటా నిజంగానే అల్ఫార్డ్ లగ్జరీ వ్యాన్‌ను విడుదల చేస్తే టయోటా ఇన్నోవా క్రిస్టా కంటే ఖరీదైన మోడల్‌గా నిలవనుంది.

టయోటా అల్ఫార్డ్ లగ్జరీ ఎమ్‌పీవీ

అంతర్జాతీయ మార్కెట్లో టయోటా అల్ఫార్డ్ రెండు పెట్రోల్ ఇంజన్‌లు మరియు ఒక హైబ్రిడ్ ఇంజన్‌లో లభ్యమవుతోంది. ఇందులోని 2.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 179బిహెచ్‌పి పవర్ మరియు 235ఎమ్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టయోటా అల్ఫార్డ్ లగ్జరీ ఎమ్‌పీవీ

టయోటా అల్ఫార్డ్‌లోని శక్తివంతమైన వెర్షన్‌వో 3.5-లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 297బిహెచ్‌పి పవర్ మరియు 361ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టయోటా అల్ఫార్డ్ లగ్జరీ ఎమ్‌పీవీ

టయోటా అల్ఫార్డ్ హైబ్రిడ్ వెర్షన్‌లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు మరియు 2.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. టయోటా మోటార్స్ దాదాపు ఈ హైబ్రిడ్ వెర్షన్ అల్ఫార్డ్ ఎమ్‌పీవీనే ఆటో ఎక్స్‌పో 2018లో ప్రదర్శించే అవకాశం ఉంది.

టయోటా అల్ఫార్డ్ లగ్జరీ ఎమ్‌పీవీ

టయోటా అల్ఫార్డ్ అన్ని ఇంజన్ వేరియంట్లో కేవలం 8-స్పీడ్ ఆటోమేటిక్ లేదా కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్(CVT) గేర్‌బాక్స్‌లో లభ్యమవుతోంది. హైబ్రిడ్ వెర్షన్ టయోటా అల్ఫార్డ్‌లో సివిటి ట్రాన్స్‌మిషన్ కలదు.

టయోటా అల్ఫార్డ్ లగ్జరీ ఎమ్‌పీవీ

టయోటా అల్ఫార్డ్ ఇంటీరియర్‌లో అత్యంత విలాసవంతమైన సీటింగ్ వ్యవస్థ లెథర్ మరియు వుడ్ ప్యానల్స్ ఉన్నాయి. మధ్యలో ఉన్న సీటును పరుపులా మార్చేసుకోవచ్చు. డ్రైవర్ సీటులో కూడా విభిన్న సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి.

టయోటా అల్ఫార్డ్ లగ్జరీ ఎమ్‌పీవీ

అల్ఫార్డ్ ఎమ్‌పీవీ తరువాత స్థానంలో వెల్‌ఫైర్ ఎమ్‌పీవీ ఉంది. ఇండియాలో ఉన్న పలు మెట్రో నగరాల్లో ఈ రెండు ఎమ్‌పీవీ వాహనాలు అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాయి. విదేశీయుల కోసం ఇక్కడ కొంత మంది వీటిని నిర్వహిస్తుంటారు.

టయోటా అల్ఫార్డ్ లగ్జరీ ఎమ్‌పీవీ

టయోటా అల్ఫార్డ్ లగ్జరీ ఎమ్‌పీవీలకు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. భారత్‌లోకి దీనిని లాంచ్ చేస్తే విపరీతమైన ఆదరణ లభించడం ఖాయం. చాలా వరకు కార్పోరేట్ అఫీషియల్స్ ఇలాంటి వాహనాలను ఎంచుకుంటారు. భారత్‌లోకి టయోటా అల్ఫార్డ్ విడుదల చేస్తే ఎలాంటి స్పందన లభిస్తోంది వేచి చూడాలి మరి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Auto Expo 2018: Toyota Alphard Luxury MPV To Be Showcased
Story first published: Tuesday, February 6, 2018, 19:03 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark