అమ్మకాలకు సిద్దమైన బజాజ్ క్యూట్: కొన్ని ప్రాంతాలకే పరిమితం

బజాజ్ క్యూట్ స్మాల్ కారు ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో అమ్మకాలకు సిద్దమైంది. ఆగష్టు 2018 నుండి బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ వాహనాల సేల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే, ఇది తొలుత కొన్ని ప్రాంతాల్లో మాత్రమే

By Anil Kumar

బజాజ్ క్యూట్ స్మాల్ కారు ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో అమ్మకాలకు సిద్దమైంది. ఆగష్టు 2018 నుండి బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ వాహనాల సేల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే, ఇది తొలుత కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభ్యం కానుందని సమాచారం. తాజాగా అందిన సమాచారం మేరకు, కేరళ మరియు ఆగ్నేయాసియాలోని కొన్ని షోరూముల్లో మాత్రమే లభించనుంది.

అమ్మకాలకు సిద్దమైన బజాజ్ క్యూట్: కొన్ని ప్రాంతాలకే పరిమితం

సుప్రీం కోర్టు క్వాడ్రిసైకిల్‌ను ఒక నూతన వాహన విభాంగా వర్గీకరించింది. అంటే, ఆటో రిక్షా, కారు తహాలో క్వాడ్రిసైకిల్ ఒక వాహన వర్గం. క్వాడ్రిసైకిల్‌ను వ్యక్తిగత వాహనంగా ఉపయోగించరాదు. కేవలం వాణిజ్యపరమైన అవసరాలకు మాత్రమే వినియోగించాలి.

అమ్మకాలకు సిద్దమైన బజాజ్ క్యూట్: కొన్ని ప్రాంతాలకే పరిమితం

ఇప్పటి వరకు, బజాజ్ క్యూట్ విడుదల పట్ల ఎదురైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కంపెనీ ఎన్నో ఎదుర్కొంది. టీవీఎస్ మోటార్ కంపెనీ మరియు టాటా మోటార్స్ కూడా క్వాడ్రిసైకిల్స్ భద్రతా ప్రమాణాలను పాటించలేవని వ్యతిరేఖంగా గళమెత్తాయి.

అమ్మకాలకు సిద్దమైన బజాజ్ క్యూట్: కొన్ని ప్రాంతాలకే పరిమితం

బజాజ్ ఆటో ఆర్థిక విభాగ అధ్యక్షుడు కెవిన్ డిసా మాట్లాడుతూ, "భారత్‌లో క్యూట్ క్వాడ్రిసైకిల్ విడుదలకు ప్రభుత్వం నుండి అనుమతులు లభించాయి, మరికొన్ని రోజుల్లో అధికారికంగా విడుదల చేస్తాం. ప్రస్తుతం, వీటిని విక్రయించడానికి కేరళలో అనుమతులు లభించాయి. కాబట్టి, తొలి దశ క్రింద ఓ 35-40 క్యూట్ క్వాడ్రిసైకిళ్లను డీలర్లకు సరఫరా చేస్తున్నాం. వీటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా జరిగితే ప్రొడక్షన్ పెంచి రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తామని చెప్పుకొచ్చాడు."

అమ్మకాలకు సిద్దమైన బజాజ్ క్యూట్: కొన్ని ప్రాంతాలకే పరిమితం

"ప్రస్తుతం బజాజ్ ఆటో ఇండియా లైనప్‌లో ఉన్న త్రీ వీలర్లకు కొనసాగింపుగా నాలుగు చక్రాల క్వాడ్రిసైకిల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తాం. క్యూట్ వెహికల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, దక్షిణ ముంబాయ్ ప్రాంతంలో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. అంతే కాకుండా, ఇది దేశవ్యాప్తంగా ఉన్న మూడు చక్రాల ఆటో రిక్షాల స్థానాన్ని భర్తీ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు."

అమ్మకాలకు సిద్దమైన బజాజ్ క్యూట్: కొన్ని ప్రాంతాలకే పరిమితం

దేశీయ మార్కెట్ కోసం అతి చిన్న కారును అందించే ఉద్దేశంతో బజాజ్ ఆటో క్యూట్ క్వాడ్రిసైకిల్‌ను అభివృద్ది చేసింది. అయితే ఇప్పటి వరకూ ఇండియాలో బజాజ్ క్యూట్ విక్రయాలకు అనుమతులు లభించకపోవడంతో, లాటిన్ అమెరికా, యూరప్ మరియు ఆఫ్రికా దేశాలకు 2015 నుండి ఎగుమతి చేస్తోంది.

అమ్మకాలకు సిద్దమైన బజాజ్ క్యూట్: కొన్ని ప్రాంతాలకే పరిమితం

సాంకేతికంగా బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్‌లో 216సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. 13బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే బజాజ్ క్యూట్ గరిష్టంగా గంటకు 70కిమీల వేగంతో ప్రయాణిస్తుంది. మరియు ఇందులో డ్రైవర్‌తో సహా నలుగురు ప్రయాణించవచ్చు.

అమ్మకాలకు సిద్దమైన బజాజ్ క్యూట్: కొన్ని ప్రాంతాలకే పరిమితం

ఔరంగాబాద్‌లోని బజాజ్ ప్రొడక్షన్ ప్లాంటులో బజాజ్ క్యూట్ వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 60,000 యూనిట్లుగా ఉంది. బజాజ్ క్యూట్ వాహనాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగితే, త్రీ వీలర్ల ప్రొడక్షన్ లైన్ వినియోగించే అవకాశం ఉంది.

అమ్మకాలకు సిద్దమైన బజాజ్ క్యూట్: కొన్ని ప్రాంతాలకే పరిమితం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

లాటిన్ మరియు యూరప్‌లో క్వాడ్రిసైకిల్ వాహనాలు బాగా ప్రసిద్ది చెందాయి. అయితే, సుప్రీం కోర్టు నిర్ణయంతో ఇప్పుడు ఇండియన్ రోడ్ల మీద కూడా ఈ క్వాడ్రిసైకిల్ పరుగులు పెట్టనున్నాయి. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత్‌లో క్వాడ్రిసైకిల్ విడుదలకు అనుమతులు లభించాయి.

Source: Money Control

Most Read Articles

English summary
Read In Telugu: Bajaj Qute Quadricycle To Be Sold In Kerala And The Northeast Soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X