బజాజ్ క్యూట్ సీఎన్జీ వేరియంట్‌ను పరీక్షిస్తున్న బజాజ్

బజాజ్ ఆటో క్యూట్ క్వాడ్రిసైకిల్‌ను తొలిసారిగా 2012 ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించింది. సుధీర్ఘ నిరీక్షణ అనంతరం బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ ఇండియా విడుదలకు భారత ప్రభుత్వం నుండి అనుమతులు లభించాయి.

By Anil Kumar

బజాజ్ ఆటో క్యూట్ క్వాడ్రిసైకిల్‌ను తొలిసారిగా 2012 ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించింది. సుధీర్ఘ నిరీక్షణ అనంతరం బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ ఇండియా విడుదలకు భారత ప్రభుత్వం నుండి అనుమతులు లభించాయి.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు

ఈ నేపథ్యంలో బజాజ్ ఇటీవల క్యూట్ కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది. బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ రెగ్యులర్ వేరియంట్ ఆధారంగా రూపొందించిన సీఎన్జీ వేరియంట్ క్యూట్‌ను టెస్ట్ చేస్తోంది. మైలేజ్ ప్రియులు అధికంగా ఉన్న ఇండియా కోసం ప్రత్యేకంగా సీఎన్జీ వేరియంట్‌ను డెవలప్ చేసినట్లు తెలిసింది.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు

బజాజ్ ఆటో గతంలో ఎలక్ట్రిక్ వెర్షన్ క్యూట్ క్వాడ్రిసైకిల్‌ను డెవలప్ చేయాలని భావిస్తున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే, అనూహ్యంగా సీఎన్జీ వేరియంట్‌తో ముంబాయ్ రోడ్ల మీద పరీక్షలు జరుపుతూ పట్టుబడింది.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు

బజాజ్ ఆటో క్యూట్ క్వాడిసైకిల్‍‌ను వ్యక్తిగత అవసరాలకు కాకుండా, వాణిజ్య అవసరాలకు విక్రయించేందుకు మాత్రమే అనుమతులు లభించాయి. క్యూట్ సీఎన్జీ వేరియంట్ చూడటానికి అచ్చం రెగ్యులర్ వేరియంట్‌ను మాత్రమే పోలి ఉంటుంది. టెస్టింగ్ నిర్వహిస్తున్న క్యూట్ ఫ్రంట్ మరియు రియర్ మిర్రర్ మీద సీఎన్జీ స్టిక్కర్ గుర్తించవచ్చు.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్‌లో సాంకేతికంగా 216.6సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 13బిహెచ్‍‌పి పవర్ మరియు 19.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సీఎన్జీతో పాటు ఎల్పీజీ వేరియంట్లో కూడా బజాజ్ క్యూట్ లభ్యం కానుంది.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు

ప్రస్తుతానికి బజాజ్ క్యూట్ సీఎన్జీ వేరియంట్ ట్యాంక్ కెపాసిటి మరియు పవర్ అవుట్‌పుట్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కానీ, దీని పనితీరు మాత్రం పెట్రోల్ వేరియంట్ తరహాలోనే ఉండవచ్చు. పెట్రోల్ మరియు సీఎన్జీ వెర్షన్ క్యూట్ క్వాడ్రిసైకిల్ లాంచ్ అనంతరం ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టనుంది.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు

బజాజ్ క్యూట్ ఇండియన్ రోడ్ల మీద ఉన్న మూడు చక్రాల ఆటోల స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందులో గరిష్టంగా నలుగురు ప్రయాణించవచ్చు. మూడు చక్రాల ఆటోతో పోల్చుకుంటే నాలుగు డోర్లు ఉన్న బజాజ్ క్యూట్ అత్యంత సురక్షితమైనది. ఏఆర్ఏఐ నుండి అనుమతి పొందిన అనంతరం అధికారికంగా విపణిలోకి లాంచ్ చేయనున్నారు.

బజాజ్ క్యూట్ స్మాల్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుమారుగా 6 సంవత్సరాల నిరీక్షణ అనంతరం బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ ఇండియా విడుదలకు అనుమతులు లభించాయి. భారతదేశపు స్మాల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కారుగా చెప్పుకునే క్యూట్ క్వాడ్రిసైకిల్ మీద ఎంతో ఇండియన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే, దీనివిక్రయాలను కేవలం వాణిజ్య అవసరాలకు మాత్రమే పరిమితం చేశారు. బజాజ్ క్యూట్ ప్రారంభ ధర రూ. 1 లక్ష నుండి రూ. 1.5 లక్షల మధ్య ఉండవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Bajaj Qute CNG Variant Spotted Testing In India
Story first published: Wednesday, June 20, 2018, 18:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X