భారతదేశపు ఫేవరెట్ ఎస్‌యూవీల మీద అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లు
ఇటు కస్టమర్లకు, అటు కంపెనీలకు లాభాన్ని చేకూర్చేది ఆఫర్లు మాత్రమే. ఈ ఫిబ్రవరిలో భారతదేశపు బెస్ట్ ఎస్‌యూవీల మీద ఉన్న ఆఫర్లు డిస్కౌంట్ల గురించి ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....
ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఆర్థిక జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేలోపే ఓ కొత్త కారును కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అదే విధంగా కార్ల కంపెనీలు కూడా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల చేయడానికి ముందే పాత స్టాక్ క్లియర్ చేసుకోవాలని భావిస్తాయి.
అందరి పరిష్కారం కోసం వచ్చిందే ఫిబ్రవరి ఆఫర్లు మరియు డిస్కౌంట్లు. ఇటు కస్టమర్లకు, అటు కంపెనీలకు లాభాన్ని చేకూర్చేది ఆఫర్లు మాత్రమే. ఈ ఫిబ్రవరిలో భారతదేశపు బెస్ట్ ఎస్‌యూవీల మీద ఉన్న ఆఫర్లు డిస్కౌంట్ల గురించి ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

రెనో డస్టర్
భారత్‌లోకి పరిచయం అయిన తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో డస్టర్. మరి కొన్ని నెలల్లో సరికొత్త మోడల్ డస్టర్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు రెనో సిద్దం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రెనో డస్టర్ మీద గరిష్టంగా రూ. 30,000 ల ఆఫర్ ప్రకటించింది.

2018 ఏడాదిలో తయారైన రెనో డస్టర్ మోడళ్ల మీద కూడా ఈ ఆఫర్ వర్తిస్తోంది. 10,0000 రుపాయల ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్‌తో పాటు మొదటి సంవత్సరం ఉచిత ఇన్సూరెన్స్ మరియు అదనంగారూ. 5,000 వరకు కార్పోరేట్ డిస్కౌంట్ కూడా ఉంది. అన్ని ఆఫర్లు సివిటి ఆటోమేటిక్ వేరియంట్ల మినహా మిగతా అన్ని వేరియంట్ల మీద వర్తిస్తాయి.

నిస్సాన్ టెర్రానో
రెనో డస్టర్ యొక్క రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్ నిస్సాన్ టెర్రానో. రెనో డస్టర్ యొక్క ప్రీమియమ్ వెర్షన్ నిస్సాన్ టెర్రానో అతి త్వరలో భారీ అప్‌డేట్స్‌కు గురవుతోంది. ప్రస్తుతం ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మీద గరిష్టంగా రూ. 25,000 లు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది.

అంతే కాకుండా నిస్సాన్ ఇండియా టెర్రానో ఎస్‌యూవీ మీద 7.99శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 12,000 ల అదనపు బోనస్ అందిస్తోంది.

మహీంద్రా టియువి300
దేశీయ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తమ టియువి300 కాంపాక్ట్ ఎస్‌యూవీలోని వివిధ వేరియంట్ల ఆధారంగా గరిష్టంగా రూ. 40,000 ల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. మహీంద్రా ఉచిత యాక్ససరీలు లేదా రూ. 11,500 లు క్యాష్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

టియువి300 ఎస్‌యూవీని ఈ ఆఫర్ల సమయంలో ఎంచుకుంటో నాలుగవ సంత్సరానికి పొడిగించబడిన వారంటీ కూడా ఉంది. ఒకవేల ఎక్స్‌చ్ఛేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే 20,000 ల రుపాయల అదనపు బోనస్ కూడా పొందవచ్చు.

మహీంద్రా స్కార్పియో
మహీంద్రా మరియు ఇండియా యొక్క పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియో. సేల్స్ పెంచుకోవడానికి స్కార్పియో మీద మూడవ సంవత్సరం పొడగించబడిన వారంటీ, ఐదు వేల రుపాయల విలువైన యాక్ససరీలు లేదా డిస్కౌంట్ లభిస్తుంది. అదే విధంగా పాత వెహికల్ ఎక్స్‌చ్చేంజ్ ద్వారా స్కార్పియో ఎంచుకునే వారికి రూ. 15,000 లు అదనపు బోనస్ లభిస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 500
మహీంద్రా ఎక్స్‌యూవీ500 కూడా ఈ ఏడాది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల కానుంది. దీంతో మహీంద్రా డీలర్లు ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్యూవీ మీద మంచి ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించారు. ఈ ఫిబ్రవరిలో ఎక్స్‌యూవీ500 ఎంచుకునేవారు రూ. 40,000 ల వరకు లాభపడవచ్చు.

నాలుగవ సంవత్సరం ఉచిత వారంటీ మరియు క్యాష్ డిస్కౌంట్ లేదంటే రూ. 13,000 లు విలువైన యాక్ససరీలు పొందవచ్చు. అంతే కాకుండా ఎక్స్‌చ్ఛేంజ్ ద్వారా ఎక్స్‌యూవీ 500 ఎంచుకుంటే రూ. 15,000 ల బోనస్ మరియు కార్పోరేట్ డిస్కౌంట్ క్రింద మరో రూ. 10,000 పొందవచ్చు.

హోండా బిఆర్-వి
హోండా వారి 7-సీటర్ బిఆర్-వి ఎస్‌యూవీ మారుతి సుజుకి ఎర్టిగాకు గట్టి పోటీనిస్తోంది. అయితే, సేల్స్ పరంగా ఎర్టిగాను ఢీకొట్టలేకపోతున్న బిఆర్-వి మీద హోండా మోటార్స్ ఫిబ్రవరిలో రూ. 35,000 ల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

హోండా బిఆర్-వి మీద ప్రస్తుతం క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 23,000 ల విలువైన ఉచిత యాక్ససరీలను మాత్రమే అందిస్తోంది. అంతే కాకుండా బిఆర్-వి ఎంపికపై మొదటి సంవత్సరం ఉచిత ఇన్సూరెన్స్ అందిస్తోంది.

హోండా సిఆర్-వి
ప్రస్తుతం ఉన్న సిఆర్-వి స్థానంలో అతి త్వరలో కొత్త తరం సిఆర్-వి ఎస్‌యూవీ రానుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్యూవీ మీద గరిష్టంగా రూ. 1 లక్ష రుపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. హోండా సిఆర్-వి ఎస్‌యూవీ రెండు కొత్త పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది.

రెనో లాజీ
రెనో లాజీ ఎమ్‌పీవీ మీద గరిష్టంగా రూ. 65,000ల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో 30,000 రుపాయలు క్యాష్ డిస్కౌంట్ మరియు మరో 30,000 లు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.

అంతే కాకుండా, కేవలం రూ. 1 లకే ఉచిత ఇన్సూరెన్స్ మరియు కస్టమర్లు కార్పోరేట్ డిస్కౌంట్ క్రింది మరో రూ. 7,000 లు పొందవచ్చు.

మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి కొత్త తరం ఎర్టిగా ఎమ్‌పీవీని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పీవీగా నిలిచిన ఎర్టిగా లోని డీజల్ వేరియంట్ మీద గరిష్టంగా రూ. 75,000 లు మరియు పెట్రోల్ వేరియంట్ స్వల్పమేర ఆఫర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








