విపణిలోకి షాడో ఎడిషన్ 3 సిరీస్ బిఎమ్‍డబ్ల్యూ: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ప్రత్యేకతలు
బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విపణిలోకి బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ షాడో ఎడిషన్‌ను లాంచ్ చేసింది. బిఎమ్‌డబ్ల్యూ తమ 3 సిరీస్ లగ్జరీ సెడాన్ కారును షాడో పేరుతో స్పెషల్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టింది.
బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విపణిలోకి బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ షాడో ఎడిషన్‌ను లాంచ్ చేసింది. బిఎమ్‌డబ్ల్యూ తమ 3 సిరీస్ లగ్జరీ సెడాన్ కారును షాడో పేరుతో స్పెషల్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టింది. ఇది, పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది.

సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ షాడో ఎడిషన్ 320d Sport వేరియంట్ ధర రూ. 41.40 లక్షలు మరియు 330i M Sport వేరియంట్ ధర రూ. 47.30 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

బిఎమ్డబ్ల్యూ ఇండియా షాడో ఎడిషన్ 3 సిరీస్ లగ్జరీ సెడాన్ కారును కేలం పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయిస్తుంది. రెగ్యులర్ 3-సిరీస్ సెడాన్‌తో పోల్చితే షాడో ఎడిషన్‌లో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ జరిగాయి.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ షాడో ఎడిషన్ సెడాన్‌లో కేవలం స్మోక్డ్ హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్లు, హై-గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ గల ఫ్రంట్ కిడ్నీ గ్రిల్, బ్లాక్ క్రోమ్ ఫినిషింగ్ గల టెయిల్ పైప్, పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లకు విభిన్న డిజైన్ శైలిలో లభించే 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ షాడో ఎడిషన్ ఇంటీరియర్‌లో రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ సీట్ అప్‌హోల్‌స్ట్రే, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 8.7-అంగుళాల పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.5-అంగుళాల పరిమాణంలో ఉన్న డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఎమ్ స్పోర్ట్ బ్యాడ్జింగ్ గల లెథర్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అంతే కాకుండా, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, 250వాట్స్ ఆడియో సిస్టమ్, 330ఐ వేరియంట్ మినహా వేరిబుల్ స్పోర్ట్ స్టీరింగ్ సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఇవి మినహాయిస్తే, రెగ్యులర్ 3 సిరీస్ కారుతో పోల్చితే షాడో ఎడిషన్ 3 సిరీస్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు.

సాంకేతికంగా, షాడో ఎడిషన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ అవే ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. 330i M వేరియంట్లో 248బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల 2-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు.

సాంకేతికంగా, షాడో ఎడిషన్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ అవే ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. 330i M వేరియంట్లో 248బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల 2-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు.

బిఎమ్డబ్ల్యూ 330i కేవలం 5.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు 320d వేరియంట్ 7.2 సెకండ్ల వ్యవధిలో 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే విభిన్నంగా ఉండేందుకు బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ షాడో ఎడిషన్‌లో కేవలం కాస్మొటిక్ అప్‌డేట్స్ మాత్రమే జరిగాయి. బ్లాక్ థీమ్‌లో ఉన్న షాడో ఎడిషన్ 330i M Sport మరియు 330d Sport మోడళ్లు అత్యంత స్పోర్టివ్ శైలిలో ఆకట్టుకుంటాయి.
సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు కాబట్టి, అదే పనితీరును కనబరుస్తాయి.



Click it and Unblock the Notifications








